మంగళాపురం(చల్లపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంగలపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం చల్లపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి నీలా గౌతమి
జనాభా (2011)
 - మొత్తం 3,983
 - పురుషుల సంఖ్య 1,986
 - స్త్రీల సంఖ్య 1,997
 - గృహాల సంఖ్య 1,215
పిన్ కోడ్ 521131
ఎస్.టి.డి కోడ్ 08671

మంగళాపురం, కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము పిన్ కోడ్ న, 521 131., యస్.టీ.డీ. కోడ్ నం. 08671.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 10 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో దాలిపర్రు, లక్ష్మిపురం, చల్లపల్లి, భోగిరెడ్డిపల్లి, పూషడం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

ఘంటసాల, మోపిదేవి, మొవ్వ, అవనిగడ్డ

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కొడాలి, చల్లపల్లి, విజయవాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 63 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల విద్యార్థిని డొక్కు వనజ, 2015,డిసెంబరు-3,4 తేదీలలో గుంటూరులో నిర్వహించు రాష్ట్రస్థాయి డిస్కస్ థ్రో పోటీలకు అండర్-16 విభాగంలో పాల్గొనడానికి ఎంపికైనది. 2015,నవంబరు-29న ఉయ్యూరులో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలలో ఈమె ప్రథమస్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనది. [5]\ మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, ఈనాయిపాలెం గ్రామం.

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

పశువైద్యశాల[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. ఈనాయిపాలెం గ్రామం, మంగళాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  2. ఈ గ్రామ పంచాయతీకి జూలై 2013 లో జరిగిన ఎన్నికలలో శ్రీమతి నీలా గౌతమి సర్పంచిగా 149 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఉపసర్పంచిగా శ్రీ పేరుబోయిన సాయిబాబు ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. ఈ గ్రామములో పునర్నిర్మాణం గావించిన గంగానమ్మగా కొలువబడే శ్రీ తాటానమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా, 2014,మార్చి-2, ఆదివారం ఉదయం, అగ్ని ప్రతిష్ఠాపన, నిత్య హోమం, నవగ్రహ పూజ, క్షీరాధి, జలాధివాసములను నిర్వహించారు. 2014,ఫిబ్రవరి-3, సోమవారం నాడు, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహం, నిత్య హోమం, యంత్రస్థాపన, పూర్ణాహుతి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. [3]
  2. శ్రీ కోదండరామాలయం:- ఈ ఆలయంలో ప్రతిష్ఠించనున్న సీతా సమేత శ్రీ కోదండరామస్వామి, లక్ష్మణ, హనుమత్ విగ్రహాలకు 2014,జూన్-3, మంగళవారం నాడు, అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం, 7 గంటలకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ఆరాధన, పంచగవ్యప్రాశన, నవగ్రహ యఙ్నం, అగ్నిప్రతిష్ఠా పూజా కార్యక్రమాలను వేదపండితులు నిర్వహించారు. తొలుత వేదపడితులు, అర్చకుల ఆధ్వర్యంలో గోపూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మరుసటిరోజున, బుధవారం నాడు విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకు, ఆలయం వద్ద, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్నిధ్యానం, రత్నన్యాసం, ధృవబిందు, శిఖర, ధ్వజదండాది సర్వ ప్రతిష్ఠలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 8-01 గంటలకు, పూర్ణాహుతి కళాన్యాసం, అర్చన, శాంతికళ్యాణం, మమదార్చన దానము కార్యక్రమాలను నిష్టతో నిర్వహించారు. సర్వ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయం వద్ద భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [4] & [5]

గ్రామములోని ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు శ్రీ చండ్ర రాజేశ్వరరావు ఈ గ్రామస్థులే.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామాన్నీ, ఈ గ్రామ పరిధిలోని ఆవాస గ్రామాలను, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో, ఆకర్షణీయ గ్రామాలు (స్మార్ట్ విలేజెస్) గా అభివృద్ధి చేయడానికై, మిట్-సుబిషి కార్పొరేషన్ అను ఒక ప్రైవేటు సంస్థ ముందుకు వచ్చింది. [6]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4260.[2] ఇందులో పురుషుల సంఖ్య 2095, స్త్రీల సంఖ్య 2165, గ్రామంలో నివాస గృహాలు 1182 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1073 హెక్టారులు.
జనాభా (2011) - మొత్తం 3,983 - పురుషుల సంఖ్య 1,986 - స్త్రీల సంఖ్య 1,997 - గృహాల సంఖ్య 1,215

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Challapalli/Mangalapuram". Retrieved 25 June 2016. External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,ఆగస్టు-1; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,మార్చి-3; 2వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జూన్-4; 1వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2014,జూన్-5; 15వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-13; 13వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-1; 40వపేజీ.