మంగళ్ రామ్ ప్రేమి
| మంగళ్ రామ్ ప్రేమి | |||
| పదవీ కాలం 1991-1998 | |||
| ముందు | మహి లాల్ | ||
|---|---|---|---|
| తరువాత | చౌదరి గిర్ధారి లాల్ | ||
| పదవీ కాలం 1980-1984 | |||
| ముందు | మాయావతి | ||
| తరువాత | ఓంవతి దేవి | ||
| నియోజకవర్గం | బిజ్నోర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1925 ఆగస్టు 25 పృథ్వీపూర్, బిజ్నోర్ , యునైటెడ్ ప్రావిన్స్ , బ్రిటిష్ ఇండియా | ||
| మరణం | 2001 డిసెంబరు 11 (వయసు: 76) న్యూఢిల్లీ | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| మూలం | |||
మంగళ్ రామ్ ప్రేమి (1925 – 2001) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బిజ్నోర్ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]మంగళ్ రామ్ ప్రేమి 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజ్నోర్ నియోజకవర్గం నుండి లోక్‌దళ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థి మహి లాల్ పై 46099 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1984 లోక్‌సభ ఎన్నికలలో లోక్‌దళ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి గిర్ధర్ లాల్ చేతిలో 99813 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మంగళ్ రామ్ ప్రేమి 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజ్నోర్ నియోజకవర్గం నుండి జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి మాయావతి చేతిలో 8879 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[1] ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 1991 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి మాయావతిపై 87734 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మంగళ్ రామ్ ప్రేమి 1996 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి సతీష్ కుమార్‌పై 27417 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 1998 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి ఓంవతి దేవి చేతిలో 9212 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మూలాలు
[మార్చు]- ↑ "To regain lost ground, Maya plays 'Bijnor's daughter' card" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 12 February 2022. Archived from the original on 26 June 2025. Retrieved 26 June 2025.
- ↑ "With 30% minorities, Bijnor had just one Muslim MP since Independence". The Times of India. 23 March 2019. Archived from the original on 26 June 2025. Retrieved 26 June 2025.