మంగినపూడి (మచిలీపట్నం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంగినపూడి (మచిలీపట్నం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ కూనపరెడ్డి వీరాస్వామి
జనాభా (2011)
 - మొత్తం 2,138
 - పురుషులు 1,047
 - స్త్రీలు 1,091
 - గృహాల సంఖ్య 643
పిన్ కోడ్ 521002
ఎస్.టి.డి కోడ్ 08672

మంగినపూడి, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 002., ఎస్.టి.డి.కోడ్ = 08672.

మంగినపూడి బీచ్ మచిలీపట్టణానికి 11 కి.మీ. దూరములో ఉంది. బెస్తవారు చేపలు పట్టే ఒక చిన్న గ్రామము. ఇక్కడి బీచ్లో ఇసుకకి బదులుగా నల్లటి మన్ను ఉంటుంది. పాశ్చత్య దేశస్థులు తూర్పు తీరములోకి చేరడానికి ఒక ముఖ ద్వారముగా ఉండేది. ఇక్కడి బీచ్ లో సముద్రము లోతు తక్కువగా ఉంటుంది. ఈ బీచ్ లో ఉన్న నాట్య పాఠశాలలో నృత్య విద్యార్థులకు కూచిపూడి నృత్యము నేర్పిస్తున్నారు. ఇక్కడ తీరములో దత్తాశ్రమము ఒక పుణ్యక్షేత్రము మరియు తీర్థ స్థలము. దీనిని దత్తరామేశ్వరము అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న శివాలయం చాలా పురాతనమైనది కాని దత్తాశ్రమము ఈ మధ్యకాలములో నిర్మించారు. రామేశ్వరములో ఉన్నట్లుగా ఇక్కడ మంగినపూడిలో తొమ్మిది బావులు ఉన్నాయి.[1] అందువలన దీనిని దత్తరామేశ్వరము అని పిలుస్తారు. కార్తీక పౌర్ణమికి ఇక్కడికి భక్తులు తండొపతండాలుగా వచ్చి స్నానము చేస్తారు.

ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీ కూనపరెడ్డి వీరాస్వామి సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

సమీప మండలాలు[మార్చు]

బంటుమిల్లి, మచిలీపట్నం, గూడూరు, గుడ్లవల్లేరు

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

హర్ష జూనియర్ కాలేజి, అరిశేపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, మంగినపూడి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, సింగరాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: మచిలీపట్నం, విజయవాడ 78 కి.మీ

సంఘటనలు[మార్చు]

ఒకసారి సునామి వచ్చింది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,138 - పురుషుల సంఖ్య 1,047 - స్త్రీల సంఖ్య 1,091 - గృహాల సంఖ్య 643

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2227.[3] ఇందులో పురుషుల సంఖ్య 1117, స్త్రీల సంఖ్య 1110, గ్రామంలో నివాస గృహాలు 552 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. http://www.dattapeetham.com/india/festivals/birthday99/history.html Datta Peetham
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Machilipatnam/Manginapudi". Retrieved 28 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  3. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

[1] ఈనాడు కృష్ణా 2013 ఆగస్టు 5, 4వ పేజీ.

ఇవి కూడా చూడండి[మార్చు]

మచిలీపట్నం