మంగిన నాగమణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మంగిన నాగమణి తెలుగు రంగస్థల నటి.

జననం[మార్చు]

నాగమణి పొన్నాడ ఆచార్యులు, ఆదిలక్ష్మి దంపతులకు తణుకులో జన్మించింది.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

ఈవిడ తన 18వ ఏట రక్త కన్నీరు నాటకంలో ‘శాంత’ పాత్ర ద్వారా రంగస్థల నటనకు శ్రీకారం చుట్టింది. తరువాత శ్రీ శారద నాట్యమండలి-వేల్పూరు తిప్పా సత్యనారాయణ సారథ్యంలో పి.వి. భద్రం దర్శకత్వంలో చంద్రహాస, ప్రమీలార్జునీయం మొదలగు నాటకాల్లో నటించింది. తణుకుకు చెందిన మదాసు నరసింహారావు సంస్థలో మహాకవి కాళిదాసులో ‘విద్యాధరి’గా, శ్రీరామభక్త హనుమాన్ లో ‘సీత’గా పాత్రధారణ చేసిన నాగమణి, ఇళ్ళ వెంకట్రావు శకుంతల నాటకంలో శకుంతల పాత్రను పోషించి ప్రశంసలు పొందింది.

ఈవిడ భర్త మంగిన సత్యనారాయణ సాంకేతిక నిపుణుడు కావడంతో ‘శ్రీరాజరాజేశ్వరి నాట్యమండలి’ పేర స్వంత సంస్థ స్థాపించి మహాకవి కాళిదాసు, సత్యహరిశ్చంద్ర, భక్త చింతామణి ప్రదర్శనలు ఇచ్చారు. మందపాక వేంకటేశ్వరరావు శిక్షణలో ‘చంద్రమతి’ పాత్ర నేర్చుకొని రంగస్థల నటులు డి.వి. సుబ్బారావు, చీమకుర్తి నాగేశ్వరరావు వంటి నటుల సరసనే కాక, డి.వి. సుబ్బారావు (జూనియర్), మీనగల్లు సుధాకర్, మంగాదేవి సరసన నటించింది.[1]

మూలాలు[మార్చు]

  1. మన ఈస్ట్ వెస్ట్, ప్రముఖులు (20 March 2020). "'నటి'విశ్వరూపం". ManaEastWest.Com. Retrieved 15 July 2020.[permanent dead link]