మంగ్లీ(సత్యవతి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంగ్లీ (సత్యవతి చౌహన్ )
జననంఅనంతపురం జిల్లా, గుత్తి మండలం, బసినేపల్లె తాండ
జాతీయతభారతీయురాలు
వృత్తిన్యూస్ ప్రజెంటర్, వ్యాఖ్యాత,నటి
క్రియాశీలక సంవత్సరాలు2014 -ప్రస్తుతం

మంగ్లీ ప్రముఖ వర్తమాన టీవీ వాఖ్యాత,జానపద మరియు సినీ గాయని, సినీ నటి.

జననం, బాల్యం[మార్చు]

మంగ్లీ అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లె తాండలో పేద బంజారా కుటుంబంలో పుట్టింది. చదివింది 5 వరకు తాండ లోని ప్రభుత్వ స్కూల్ లొనే..5 నుండి 10 వరకు గుత్తి లోని గర్ల్స్ హై స్కూల్. *RDT సంస్థ (Rural Development Trust) ద్వారా చదువుకొని పాటలు పాడటం నేర్చుకుంది. ఆదే సంస్థ సలహాతో మరియు ఆర్థిక సహాయంతో తిరుపతిలో కర్నాటిక్ సంగీతం నేర్చుకుంది. వారి ఆర్థిక సహాయంతోనే పదో తరగతి తర్వాత ఎస్.వీ.విశ్వవిద్యాలయంలో మూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లోమా కోర్సులో చేరారు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె జీవితం మలుపు తిప్పింది మాత్రం RDT సంస్థనే. RDT చొరవతో సంగీతం పై పట్టు పెంచుకొని తిరుపతి లోని సంగీత విద్యాలయంలో పూర్తి మెళకువలు నేర్చుకుంది. ఆ తరువాత తన కెరియర్ మొదలు పెట్టి తెలంగాణ లో పల్లె పాటలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తుంది. మొదట జానపద గీతాలతో కెరియర్ మొదలు పెట్టిన మంగ్లీ.. తీన్మార్ పొగ్రాంతో టీవీ ఛానల్స్ లోకి ఎంటర్ అయి జనాలకు పరిచయమైంది. అయితే మంగ్లీ యాస బాష చూసి తను తెలంగాణకు సంబంధించిన వ్యక్తిగా అనుకుంటారు.[1]

మంగ్లీ గా*[మార్చు]

ఒకసారి V6 TV చానెల్ లో జానపద కార్య క్రమం జరుగుతుంటే బిక్షు నాయక్ అనే జానపద గాయకుడు అక్కడికి పంపించాడు. ఆ కార్యక్రమం తర్వాత ఆ చానెల్ వారు 'యాంకర్ గా చేస్తారా?' అని అడిగారు. ఆ విధంగా యాంకర్ అయ్యారు. 'సత్యవతి ' పేరుకన్నా ఇంకేదైనా పేరు పెట్ట్టుకో మంటే, ;మంగ్లీ అనే తన తాతమ్మ పేరు 'మంగ్లీ ' అనే పేరు ఎంచుకున్నది. ఆ పేరుతోనే 'మాటకారి మంగ్లీ' అనే కార్యక్రమం మొదలైంది. ఆ తర్వాత చేసిన 'తీన్మార్ ' తీన్మార్ న్యూస్ ' తో మంగ్లీ పేరు తెలంగాణా లోని గడప గడపకీ చేరింది. అప్పుడే ఎంటర్ టైన్మెంట్ యాంకర్ గా నేషనల్ టీవీ అవార్డు గెలుచు కొన్నది. కానీ ఇంత పేరు వచ్చినా తనకు ఇష్టమైన సంగీతానికి దూరమవుతున్నానన్న బాధ వుండేది. అందుకే టి.వీ నుండి బయటకు వచ్చి 'మైక్'టీవీ యూట్యూబ్ చానల్ లో రేరింది. అప్పుడే తెలంగాణా ఆవిర్భావ సందర్భంగా పాడిన "రేలా......రేలా....రే." పాట మంగ్లీని సెలబ్రటీ సింగర్ ని చేసింది. ఆ తర్వాత సినిమా పాటల రచయిత కాసర్ల శ్యాం ద్వారా సినిమా పాటలు కూడా పాడారు. (మూలం: *ఈనాడు ఆదివారం 19, జనవరి, 2020) అలా సినిమాలలో పాటలు పాడిన మంగ్లీ 'గోర్ జీవన్ ' అనే లంబాడీ చిత్రంలో హీరోయిన్ గా నటించారు. లంబాడా ఆడ పిల్లల్ని కాపాడుకోవాలంటూ సందేశమిచ్చే చిత్రం అది.

పాడిన పాటల జాబితా[మార్చు]

Year Channel Song Composer(s) Writer(s) Co-artist(s) Views on YouTube
2018 Mic TV Bathukamma song Suresh Bobbili Dr. Nandini Sidda Reddy 5+ Millions
2018 Mic TV Ganesh Chaturdhi Ameen Kasarla Shyam 2+ Millions
2018 Aditya Music Shailaja Reddy Alludu Choode(Film Song) Gopi Sundar Kasarla Shyam 1.6+ Millions
2018 Mic TV Telangana Bonalu Song Suresh Bobbili Tirupati Matla Tirupati Matla 10+ Millions
2018 RTV Banjara Banjara teej song(Gugara Bandalena) Kalyana Yakub Nayak 3.4+ Million
2018 Mic TV Telangana Formation day song Nandan Bobbili Dr. Kandikonda Jangi Reddy 9.7+ Millions
2018 Mic TV KCR song Ravi Varma Potedar Dr. Kandikonda 1 Million
2018 Mic TV Ugadi Special Song Nandan Bobbili Dr. Kandikonda 4.5+ Million
2018 RTV Banjara Banjara song (BAPU VEERANNA KURAVI VEERANNA) Kalyana Yakub Nayak 4.2+ Million
2018 Mic TV Sammakka Sarakka Meenakshi Bhujang Dr. Kandikonda Shishira 10+ Million
2018 Mic TV Sankranti song Nandan Bobbili Dr. Kandikonda Rapper:MEGH-UH-WATT(Meghraj) 22+ Million
2018 Mango Music Parvathi thanayudavo (Needi Naadi Oke Katha Film Song) Suresh Bobbili Dr.Kandikonda Ranjani Sivakumar Siddareddy, Naresh,Suresh Bobbili, Shankar Babu 3+ Lakhs
2017 Mic TV Telugu Mahasabhalu Bathukamma Song 2.5+ Lakhs
2017 i Dream Bathukamma song Pramod Pulligilla Taidala Bapu Pramod Pulligilla 3.8+ Million
2017 TeluguOne Bathukamma special song Satya Sagar Polam Satya Sagar Polam Rahul Sipligunj 3.5+ Million
2017 Mic TV Bathukamma song Suresh Bobbili Mittapally Surendar Saketh 30+ Million
2017 Future Films Folk Song(Ammava Rati bommava) Mustafa 11+ Million
2017 Mic TV Rela re Rela re Nandan Bobbili Dr. Kandikonda Lipsika 16+ Million

మూలాలు[మార్చు]

  1. Telangana Today, Folk icon of Telangana (21 August 2019). "Folk icon of Telangana". Telangana Today. Pasupuleti Author Priyanka. మూలం నుండి 24 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 24 September 2019.