మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాల
మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాల ప్రవేశద్వారం
రకంప్రభుత్వ వైద్య విద్య
స్థాపితం2021
అనుబంధ సంస్థకాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
విద్యార్థులు150
స్థానంమంచిర్యాల, మంచిర్యాల జిల్లా, తెలంగాణ, భారతదేశం

మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాల అనేది తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, మంచిర్యాల పట్టణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల.[1] గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఔత్సాహిక వైద్య విద్యార్థులకు వైద్య పరిజ్ఞానాన్ని అందించేందుకు తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం 2021లో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించింది. ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ నుండి 2022-23 విద్యా సంవత్సరానికి 150 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లేఖను అందుకుంది.[2]

ఏర్పాటు

[మార్చు]

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంచిర్యాలలో కొత్తగా వైద్య కళాశాల ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు 2021 మే 17న ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశాడు.[3]

శంకుస్థాపన

[మార్చు]

510 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ కళాశాల భవనానికి, అనుబంధ ఆసుపత్రి అప్‌గ్రేడ్‌ పనులకు 2023, జూన్ 9న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, బీసి సంక్షేమ శాఖామంత్రి గంగుల క‌మ‌లాక‌ర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌, ఆదిలాబాదు ఎమ్మెల్యే జోగు రామ‌న్న‌, ఖానాపూర్ ఎమ్మెల్యే ఆజ్మీరా రేఖా నాయ‌క్‌తోపాటు జిల్లా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4][5]

అనుబంధ ఆసుపత్రి

[మార్చు]

మంచిర్యాల జిల్లా ఏర్పాటుకుముందున్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా ఏర్పడిన తరువాత జిల్లా ఆసుపత్రిగా మార్చారు. 100 పడకల ఆసుపత్రిగా ఉన్న ప్రభుత్వాసుపత్రిని 250 పడకలకు అప్‌గ్రేడ్‌ చేస్తూ.. 2018 ఫిబ్రవరి 15న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆర్‌వీ.కర్ణన్‌ కళాశాల రోడ్డులో ఉన్న భూదాన్‌ భూమిలో 27 ఎకరాలలో వైద్య కళాశాల, ప్రభుత్వాసుపత్రి, మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మాణం జరిగింది. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో 300 పడకలు అందుబాటులో ఉండగా, వాటిని 500 పడకలకు పెంచనున్నారు.[6]

కోర్సులు - శాఖలు

[మార్చు]
  • అనాటమీ
  • ఫార్మాకాలజీ
  • ఫిజియోలాజీ
  • బయోకెమిస్ట్రీ
  • పాథాలజీ
  • మైక్రోబయోలాజీ
  • ఫోరెన్సిక్ మెడిసిన్
  • జెనరల్ సర్జరీ
  • ఆర్థోపెడిక్స్
  • ఓటో-రైనో-లారిగోలజీ
  • ఆప్తాల్మోలజీ
  • జనరల్ మెడిసిన్
  • టిబి & ఆర్‌డి
  • డివిఎల్
  • సైకియాట్రీ
  • పీడియాట్రిక్స్
  • ఓబిజీ
  • అనస్థీషియాలజీ
  • కమ్యూనిటీ మెడిసిన్
  • రేడియోడియాగ్నోసిస్
  • ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్
  • టీబీసీడీ
  • సీటీ సర్జరీ
  • న్యూరో సర్జరీ
  • న్యూరాలజీ
  • ప్లాస్టిక్‌ సర్జరీ
  • యూరాలజీ
  • గాస్ట్రోఎంట్రాలజీ
  • ఎండోక్రైనాలజీ
  • నెఫ్రాలజీ
  • కార్డియాలజీ
  • ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్
  • ఈఎన్‌టీ
  • ఆప్తల్
  • అనస్తీషియా
  • డెంటల్

తరగతుల ప్రారంభం

[మార్చు]

కళాశాల ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు, ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సూపరిం టెండెంట్‌లు, నియామకం పూర్తవగా, హెడ్‌నర్సులు, స్టాఫ్‌ నర్సులు, ఇతర పారామెడికల్‌, నాన్‌ పారా మెడికల్‌ సిబ్బంది నియామకం కూడా పూర్తయ్యింది.[7] 2022 నవంబరు 15 నుండి ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 8 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించి వైద్యరంగంలో గుణాత్మక మార్పుకు, దేశ వైద్యరంగంలోనే నూతన అధ్యాయానికి నాందిపలికాడు.[8]

ఎనమిది వైద్య కళాశాలలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Today, Telangana (2022-08-25). "Mancherial Medical College all set to start from this academic year". Telangana Today. Archived from the original on 2022-11-16. Retrieved 2022-11-16.
  2. Today, Telangana (2022-11-03). "Telangana: Mancherial govt medical college gets nod to take up admissions". Telangana Today. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-16.
  3. telugu, NT News (2021-05-18). "మంచిర్యాలకు మెడికల్‌ కళాశాల". www.ntnews.com. Archived from the original on 2021-06-22. Retrieved 2022-11-16.
  4. "Mancherial: సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్‌". EENADU. 2023-06-09. Archived from the original on 2023-06-10. Retrieved 2023-06-10.
  5. Velugu, V6 (2023-06-09). "మంచిర్యాల జిల్లా క‌లెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్". V6 Velugu. Archived from the original on 2023-06-10. Retrieved 2023-06-10.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "మంచిర్యాలకు వైద్య కళాశాల!". Sakshi. 2019-09-12. Archived from the original on 2021-01-17. Retrieved 2022-11-16.
  7. Today, Telangana (2022-11-15). "Medical college ended woes of students in Mancherial: Collector Bharati". Telangana Today. Archived from the original on 2022-11-15. Retrieved 2022-11-16.
  8. telugu, NT News (2022-11-15). "మెడికల్‌ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2022-11-15. Retrieved 2022-11-16.