Jump to content

మంచిర్యాల రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 18°52′14″N 79°26′46″E / 18.870509°N 79.446025°E / 18.870509; 79.446025
వికీపీడియా నుండి
మంచిర్యాల రైల్వే స్టేషన్
భారతీయ రైల్వే స్టేషన్
సాధారణ సమాచారం
ప్రదేశం7వ జాతీయ రహదారి, మంచిర్యాల, తెలంగాణ
భారతదేశం
అక్షాంశరేఖాంశాలు18°52′14″N 79°26′46″E / 18.870509°N 79.446025°E / 18.870509; 79.446025
యాజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించేవారుదక్షిణ మధ్య రైల్వే
లైన్లుBG
ప్లాట్‌ఫాములు03
ట్రాకులు07
నిర్మాణం
నిర్మాణ రకంStandard (on-ground station)
పార్కింగ్అందుబాటులో ఉంది
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్MCL
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు కాజీపేట బల్హర్సా సెక్షన్ , సికింద్రాబాద్ రైల్వే డివిజన్
జోన్(లు)భారతీయ రైల్వేలు
చరిత్ర
విద్యుద్దీకరించబడిందిYes
Services
అంతకుముందు స్టేషను   Indian Railways   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే
Location
మంచిర్యాల రైల్వే స్టేషన్ is located in Telangana
మంచిర్యాల రైల్వే స్టేషన్
మంచిర్యాల రైల్వే స్టేషన్
Location within Telangana

మంచిర్యాల రైల్వే స్టేషన్ తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో ఉన్న రైల్వే స్టేషన్[1][2]. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని కాజీపేట బల్హర్సా సెక్షన్ సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిపాలనలో ఉంది[3].

చరిత్ర

[మార్చు]

బ్రిటీష్ ప్రభుత్వం మంచిర్యాలలో రైలు మార్గాలు ఏర్పాటు చేశారు.నిజాం రాజుల కాలంలో నిజాం నవాబు ప్రత్యేక సింగరేణి రైలును ఏర్పాటు చేశారు 1874లో నిజాం ఆర్థికంగా అభివృద్ధి చేసి 1889లో కొన్ని రైలు మార్గాలు అనుసంధానం చేశారు. ఆ తర్వాత 1929లో కాజీపేట నుండి బల్లార్షా రైల్వే మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది.మంచిర్యాల రైల్వే స్టేషన్ న్యూఢిల్లీ నుండి చెన్నై వరకు గ్రాండ్ ట్రంక్ లైన్ మీద ఈ రైల్వే స్టేషన్ ఉంది.ఇది అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ దేశంలోని వివిధ నగరాలకు, పట్టణాలకు అనుసంధానం చేస్తుంది. దేశ రాజధాని న్యూఢిల్లీ, చెన్నై నగరాలకు అనుసంధానం చేస్తుంది. దీనికి మూడు ప్లాట్ ఫాం ఉన్నాయి.[4]

భౌగోళికం

[మార్చు]

మంచిర్యాల రైల్వే స్టేషన్ ను గ్రాండ్ ట్రంక్ లైన్ రైల్వే మార్గాలకు చెందింది. ఈ రైల్వే స్టేషన్ నుంచి 1. పెద్దపల్లి జంక్షన్,2. కాజీపేట జంక్షన్,3. బల్లార్షా జంక్షన్ ఈ మూడు జంక్షన్ లను అనుసంధానం చేస్తుంది.

రైలు ఫ్రీక్వెన్సీ

[మార్చు]

మంచిర్యాల రైల్వే స్టేషన్ ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలోనే పెద్ద రైల్వే స్టేషన్.ఈ రైల్వే స్టేషన్ లో 33 రైళ్లు ఆగుతాయి. మంచిర్యాల రైల్వే స్టేషన్ ప్రజా క్షేమం కోసం నడుస్తున్నాయి. భారతదేశంలో 16 రైల్వే జోన్ లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే 1966 అక్టోబర్ 02న ఏర్పడింది.ఈ రైల్వే జోన్ సికింద్రాబాదు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

సేవలు

[మార్చు]

మంచిర్యాలరైల్వే స్టేషన్ నుంచి రెండు మార్గాలలో మొత్తం 30 రైళ్లు ప్రతి రోజు వెళ్తాయి. ఇక్కడ నుండి గూడ్స్ రైళ్లు దాదాపు 50 వరకు వెళ్తాయి. ఇక్కడ నుండి తెలంగాణ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ లతో పాటు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా నడుస్తాయి. మంచిర్యాల రైల్వే స్టేషన్ నుంచి ప్రతి రోజూ 12 రైళ్లు హైదరాబాద్ వైపు పోతాయి.సూపర్ ప్యాసింజర్, జైపూర్ ప్యాసింజర్, కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్,రాయపూర్, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్, సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్, విజయవాడ నవజీవన్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం వెళ్ళడానికి ద్వారకా పురి ఎక్స్ప్రెస్ ఉన్నాయి. మంచిర్యాల నుంచి నాగపూర్ వెళ్ళడానికి 20 రైళ్లు ఉన్నాయి.వాటిలో తెలంగాణ ఎక్స్ప్రెస్ 5 గంటల్లో చేరుకోవచ్చు ‌.నాగపూర్ నుండి తిరుపతి వెళ్ళడానికి 11:30 గంటలు పడుతుంది. పాట్నా - ఎర్నాకులం తిరుపతి 11 గంటల్లో పోవచ్చును. ఆంధ్రప్రదేశ్ సంపర్క్ లో పోతే 12 గంటల్లో తిరుపతి చేరుకోవచ్చు. మహబూబ్ నగర్ వెళ్ళడానికి వారానికి 3 సార్లు జైపూర్, మైసూర్ సూపర్ ఎక్స్ప్రెస్ లు అందుబాటులో ఉంటాయి. మంచిర్యాల జిల్లాలో రైల్వే ట్రాక్ మార్గం బెల్లంపల్లి మంచిర్యాల వరకు 24 కిలోమీటర్ల రైలు మార్గం ఉంది. ప్రతి రోజూ బొగ్గు సరఫరాకు ప్రజలు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.రోజూ ఈ రెండు స్టేషన్ లో నుండి ప్రయాణించేవారు వేల సంఖ్యలో ఉంటారు.

విద్యుద్దీకరణ

[మార్చు]

మంచిర్యాల రైల్వే స్టేషన్ మూడు వరుసల రైల్వే మార్గాలు ఏర్పాటు చేశారు. 1987-1988 లో బల్హర్సా - రామగుండం ఈ రెండు సెక్టార్ లను విద్యుద్దీకరించారు. ఈ రైల్వే స్టేషన్ నుంచి గూడ్స్ రైళ్లు నిరంతరం వెళ్తాయి.

అభివృద్ధి

[మార్చు]

మంచిర్యాల రైల్వే స్టేషన్ 26 ఆగష్టు 2016 లో బల్హర్సా, కాజీపేట మధ్య ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటి 201.04 కిలోమీటర్ల అనగా 124.92 మైళ్ళ రైలు మార్గానికి ఆమోదం తెలిపింది. రాఘవపురం వద్ద కేసోరాం సిమెంట్,థర్మల్ పవర్ స్టేషన్, ఎస్.సి.సి.ఎల్ .వద్ద తెలంగాణ లో రామగుండం, మహారాష్ట్ర లోని సిమెంట్ చంద్రపూర్ ఇది ‌ప్రయాణీకుల ట్రాఫిక్, సిమెంట్, బొగ్గు, ఆహారంతో కూడిన వస్తువుల తరలింపు రెండింటినీ సులభతరం చేస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. "మంచిర్యాల రైల్వే స్టేషన్​కు మంచిరోజులు.. అభివృద్ధి పనులు షురూ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు". Samayam Telugu. Retrieved 2025-01-21. {{cite web}}: zero width space character in |title= at position 25 (help)
  2. Velugu, V6 (2023-04-01). "మంచిర్యాల రైల్వే స్టేషన్​కు ఇక మంచిరోజులు". V6 Velugu. Retrieved 2025-01-21. {{cite web}}: zero width space character in |title= at position 25 (help)CS1 maint: numeric names: authors list (link)
  3. ABN (2023-12-25). "Man̄chiryāla: మంచిర్యాల రైల్వేస్టేషన్‌కు మహర్దశ". Andhrajyothy Telugu News. Retrieved 2025-01-21.
  4. "MANCHIRYAL Railway Station | मनछेरल रेलवे स्टेशन | MCI रेलवे स्टेशन – NDTV.in". ndtv.in (in హిందీ). Retrieved 2025-01-21.