మంచు మనోజ్ కుమార్
మంచు మనోజ్ కుమార్ | |
![]() | |
జననం | |
క్రియాశీలక సంవత్సరాలు | 2004 నుండి ఇప్పటివరకు |
మనోజ్ గా అందరికీ సుపరిచితుడైన మంచు మనోజ్ కుమార్ తెలుగు సినిమా నటుడు. ఇతను కలెక్షన్ కింగ్ గా పేరొందిన నటుడు మోహన్ బాబు రెండవ కొడుకు. మనోజ్ బాల్యంలో తన పదోయేటనే మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించాడు. 2004లో దొంగ దొంగది సినిమాతో తెలుగు సినీ ప్రపంచానికి కథానాయకుడిగా పరిచయమయ్యాడు.బిందాస్ సినిమాకుగానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నాడు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
మంచు మనోజ్ 1983 మే 20న మోహన్ బాబు, నిర్మల దేవిలకు మూడో సంతానం, రెండో కొడుకుగా పుట్టాడు. అక్క లక్ష్మీ మంచు, పెద్దన్నయ్య విష్ణు మంచు సినీ నటులు. ఇతను తన విద్యను సౌత్ ఈస్టర్న్ ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీలో పూర్తి చేసాడు. హైదరాబాద్, 2015 మే 20 న మంచు మనోజ్ వివాహం ప్రణతిరెడ్డితో హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగింది.
వార్తలలో మనోజ్[మార్చు]
2013 డిసెంబర్ 8 రోడ్డు ప్రమాదం[మార్చు]
2013 డిసెంబరు 8 ఆదివారం రాత్రి ఓ వివాహానికి వెళ్తున్న మనోజ్ వాహనం హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైంది. కారులో ఉన్న గాలి బుడగలు తెరుచుకోవడంతో అందులోని మనోజ్‌తో పాటు డ్రైవర్, అంగరక్షకుడు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.[1].
నటించిన చిత్రాలు[మార్చు]
- గుంటూరోడు లవ్‌లో పడ్డాడు
- నా రాకుమారుడు
- ర్యాంబో
- ఒక్కడు మిగిలాడు
- శౌర్య
- ఎటాక్ (2016)[2]
- సుపర్ స్టార్ కిడ్నాప్
- దొంగాట
- పోటుగాడు
- పాండవులు పాండవులు తుమ్మెద
- కరెంట్ తీగ
- ఊ..కొడతారా ఉలిక్కిపడతారా
- మిస్టర్ నూకయ్య
- ఝుమ్మందినాదం (2010)
- వేదం (2010)
- బిందాస్ (2010)
- ప్రయాణం (2009)
- నేను మీకు తెలుసా (2008)
- రాజు భాయ్ (2007)
- శ్రీ (2005)
- పొలిటికల్ రౌడీ (2005)
- దొంగ - దొంగది (2004)
- ఖైదీగారు (బాల నటుడు)
- అడవిలో అన్న (1997) (బాల నటుడు)
- పుణ్యభూమి నా దేశం (1994) (బాల నటుడు)
- మేజర్ చంద్రకాంత్ (1993) (బాల నటుడు)
పురస్కారాలు[మార్చు]
- స్పెషల్ జ్యూరీ అవార్డు - బిందాస్
మూలాలు[మార్చు]
- ↑ "Actor Manchu Manoj injured as SUV overturns". The Hindu. 2013-12-09. Retrieved 2013-12-09.
- ↑ "RGV-Jagapati Babu team up for 'Golusu'". 123telugu.com. Archived from the original on 30 సెప్టెంబరు 2017. Retrieved 10 January 2020.