మంచు స్తూపం
మంచు స్తూపం ప్రాజెక్టు | |
---|---|
![]() ఫ్యాంగ్ ఆరామం వద్ద మంచు స్తూపం - 2018 ఫిబ్రవరి | |
వ్యాపారాత్మకమైందా? | No |
పథకం రకం | నీటి సంరక్షణ |
ప్రాంతం | లడఖ్ |
యజమాని | (SECMOL) |
వ్యవస్థాపకులు | సోనం వాంగ్చుక్ |
దేశం | భారతదేశం |
ప్రధాన వ్యక్తులు | సోనం వాంగ్చుక్ |
స్థాపన | అక్టోబరు 2013 |
బడ్జెట్ | Crowdfunding |
స్థితి | పనిచేస్తోంది |
మంచు స్తూపం అనేది కృత్రిమ హిమానీనదాలను సృష్టించే ఒక రకమైన హిమానీనదాలను అంటుకట్టే సాంకేతికత. ఇది శీతాకాలపు నీటిని (లేకపోతే ఉపయోగించకుండా పోతుంది) శంఖాకారపు మంచు కుప్పల రూపంలో నిల్వ చేస్తారు. వేసవిలో, నీటి కొరత ఉన్నప్పుడు, పంటలకు నీటి సరఫరాను పెంచడానికి ఈ మంచు కరుగుతుంది. నీటిపారుదల కోసం కాలువలు తవ్వడం, గడ్డకట్టించడం వందల సంవత్సరాలుగా ఉంది. దీనిని లడఖ్‌లో సోనమ్ వాంగ్‌చుక్ తిరిగి కనిపెట్టి, ప్రాచుర్యంలోకి తెచ్చి, వ్యాప్తి కలిగించాడు. ఈ ప్రాజెక్టును స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్ ఎన్జీఓ చేపట్టింది. 2013 అక్టోబరులో మొదలైన ఈ పరిడోషనాత్మక ప్రాజెక్టు 2014 జనవరిలో ది ఐస్ స్తూప ప్రాజెక్ట్ అనే పేరుతో ప్రారంభమైంది. 2016 నవంబరు 15 న సోనమ్ వాంగ్‌చుక్ మంచు స్తూపాలపై చేసిన కృషికి గాను రోలెక్స్ ఫర్ ఎంటర్‌ప్రైజ్ అవార్డులను అందుకున్నాడు.

లడఖ్ ఒక చల్లని ఎడారి,. ఇక్కడ ఘనీభవించిన నేల, తక్కువ గాలి ఉష్ణోగ్రతల కారణంగా శీతాకాలంలో వ్యవసాయం చేయరు. వసంతకాలంలో, విత్తడానికి నీటి అవసరం పెరుగుతుంది. కానీ సరిగ్గా ఆ సమయానికి వాగులు ఎండిపోతాయి. వార్షిక వర్షపాతం 50 మిల్లీమీటర్లు (2.0 అం.) మాత్రమే ఉండే లడఖ్‌లో వ్యవసాయం, మంచు, హిమానీనదాలూ కరిగి ప్రవహించే నీటిపై ఆధారపడి ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా, ఈ ప్రాంతంలో వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగడం, మంచు కరగడం పెరుగుతోంది. తదనంతరం, వసంతకాలంలో, నీటి కొరత పెరిగి, వ్యవసాయం, ఆహార సరఫరాలను ప్రభావితం చేస్తుంది.[1] [2] [3]
మే నెలలో, సోనమ్ వాంగ్చుక్ ఒక వంతెన కింద మంచును గమనించాడు. వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పటికీ, లడఖ్‌లోని ఆ ప్రదేశం సముద్రమంట్టం నుండి ఎత్తు చాలా తక్కువగానే ఉన్నప్పటికీ, మంచుపై నేరుగా ఎండ పడనందున అది కరగలేదు. నీడలో ఉంటే, లడఖ్‌లో మంచు ఎక్కువ కాలం కరగకుండా ఉంటుందని వాంగ్‌చుక్ గ్రహించాడు. పెద్దపెద్ద నీటి వనరులకు నీడ కల్పించడం సాధ్యం కాదు కాబట్టి వాంగ్‌చుక్, నీటిని గడ్డకట్టించి, శంఖాకారంలో ఆకారంలో నిల్వ చేయాలని ఆలోచించాడు. ఈ ఆకారం వలన ఎండ పడే ఉపరితల వైశాల్యం చాలా తక్కువగా ఉండడమే కాకుండా, అధిక పరిమాణంలో నీటిని నిల్వ చేయవచ్చు.[4]
2013 అక్టోబరులో సోనమ్ వాంగ్చుక్, లేహ్‌లో, ఎండ పడకుండా నీడంటూ లేని ప్రదేశంలో 6 మీటర్ల ఎత్తు, 1,50,000 లీటర్ల నిల్బ్వ సామర్థ్యం ఉన్న మంచు స్తూపాన్ని నిర్మించాడు. విద్యుత్తు గానీ, యంత్రాలను గానీ ఉపయోగించకుండా, ఎత్తు ప్రదేశాల నుండి గురుత్వాకర్షణ ద్వారా నీటిని పైపుల ద్వారా పంపించాడు. చుట్టుపట్ల ఉష్ణోగ్రత 20 °C (68 °F) పైగానే ఉన్నప్పటికీ, 2014 మే 18 వరకు ఆ మంచు స్తూపం పూర్తిగా కరగలేదు.[5] [4][6] [7]
లడఖ్ ప్రాంతంలో వసంతకాలంలో వ్యవసాయ అవసరాలకు నీరు కొరతగా ఉంటుంది. సబ్ ఆర్కిటిక్ వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో సాగు కాలం మరింత తగ్గుతుంది.[8] లడఖ్ ప్రాంతంలోని సమృద్ధిగా ఉన్న గాలి, జల, సౌర విద్యుత్ సామర్థ్యంలో కొంత భాగాన్ని శక్తి నిల్వ అవసరం లేకుండా ఉపయోగించుకోవడం ద్వారా, పంటలు, ఆర్కేడ్‌లు, తోటలు మొదలైన వాటి కోసం సాగు భూమి మొత్తాన్ని సాగు చేయడానికి మంచు ఫిరంగులను ఉపయోగించి మంచు స్తూపాలను తయారు చేయవచ్చు. [9]
కృత్రిమ హిమానీనదాలను ప్రోత్సహించడం, నీటిపారుదల కోసం నీటిని ఆదా చేయడం వంటి లక్ష్యాలతో, 2019 నుండి ఐస్ స్తూపం పోటీని నిర్వహిస్తున్నారు. [10] 2019 లో 12 మంచు స్తూపాలను నిర్మించారు. 2020 లో దాదాపు 25 నిర్మించారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Ice Stupas: Conserving water the 3 Idiots way". Forbes India. Retrieved 21 November 2016.
- ↑ "Sonam Wangchuk Wins the Rolex Award". thewire.in/. Retrieved 21 November 2016.
- ↑ "Ice Stupas: Water conservation in the land of the Buddha". indiawaterportal.org. Retrieved 21 November 2016.
- ↑ 4.0 4.1 "Sonam Wangchuk Wins the Rolex Award". thewire.in/. Retrieved 21 November 2016.
- ↑ "Ice Stupas: Conserving water the 3 Idiots way". Forbes India. Retrieved 21 November 2016.
- ↑ "Ice Stupas: Water conservation in the land of the Buddha". indiawaterportal.org. Retrieved 21 November 2016.
- ↑ "Ice Stupa - A Form of Artificial Glacier". Official website. Retrieved 21 November 2016.
- ↑ "Ice Stupa - A Form of Artificial Glacier". Official website. Retrieved 21 November 2016.
- ↑ "Artificial snow is nothing like the real stuff". 10 February 2022. Retrieved 14 February 2022.
- ↑ "Villages in Ladakh compete for building artificial glaciers".