మంజు శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంజు శర్మ
వృత్తిమహిళా శాస్త్రవేత్త

మంజు శర్మ చిన్నవయసులో సంగీతం, నృత్యం, సంస్కృతి అంటే ఆసక్తి కలిగి ఉంది. అది చూసి వారి కుటుంబ సభ్యులు ఆమె కళాకారిణి ఉఒతుందని భావించారు. అయినా ఐదవ తరగతికి చేరుకున్న తతువాత ఆమెకు లభించిన బయాలజీ టీచర్ కారణంగా ఆమెకు బాటనీ అంటే ఆసక్తి కలిగింది. తరువాత ఆమెను మొక్కలు ఆకర్షించాయి. ఆసక్తి కారణంగా ఆమెకు సహజంగా ఉన్న చక్కని ఙాఅపకశక్తి వలన అనేక మొక్కలను గుర్తించి వాటిని వర్గాలుగా గుర్తించి అలాగే వాటి పేర్లను వివరించగలిగినంతగా అవగాహన పెరిగింది. బి.ఎస్.లో చేరే సమయానికి ఆమె శాస్త్రవేత్త కావాలని దృఢంగా నిర్ణయించుకున్నది. ఆమెకు ప్రేరణ కలిగించిన మహిళా శాత్రవేత్త " మేరీ క్యూరీ ". శాస్త్రవేత్త కావాలన్నది ఆమె స్వంత అభిలాష మాత్రమే.

రీసెర్చ్ , పోస్ట్ డాక్టొరల్ పొజిషన్[మార్చు]

రీసెర్చ్ చేసే సమయంలో ఆమెకు పి.హె.డి గైడుగా ఉన్న ప్రొఫెసర్‌గా ఉన్న ఎ.ఆర్. రావు ఆమెకు ప్రేరణ కలగడానికి కారణమయ్యాడు. తరువాత ఆమె పోస్ట్ డాక్టొరల్ పొజిషన్ ప్రూడ్యూ యూనివర్శిటీలో ప్రొఫెసర్ ఎ.సి. లీపోల్డ్‌తో కలిసి పనిచేసింది. ఆతతువాత " యూనివర్శిటీ ఆఫ్ కోఫెన్‌హాగన్ "లో పనిచేసింది. తరువాత ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. భారతదేశంలో ఆమె కోరుకున్న అవకాశాలు లభించకున్నా మేనేజ్‌మెంట్ స్థాయిలో ప్రభుత్వ సంస్థలో పనిచేసే అవకాశం లభించింది. ఆమె మేనేజ్‌మెంట్, నిర్వహణను సవాలుగా తీసుకుని పనిచేస్తూ సైన్సు పరిఙానం అభివృద్ధిచేయడానికి ఆ అనుభవాలను ఉపయోగించుకున్నది.

సహోద్యోగులు[మార్చు]

ఆమెకు ప్రోత్సాహం ప్రేరణ కలిగిస్తూ శాస్త్రవేత్తగా ఎదగడానికి సహకారం అందించిన ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్, డాక్టర్ ఎ. రామచంద్రన్, ప్రొఫెసర్ ఎం.జి.కె మేనన్, ప్రొఫెసర్ ఎ.కె శర్మ, ప్రొఫెసర్ పి.ఎన్. టాండన్ వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు అందించే సహకారం దేశానికి ఎంతో మేలు చేయగలదని ఆమె భావించింది. సహోద్యోగుల నుండి ఆమెకు లభించిన సహకారం శాస్త్రవేత్తగా ఎదగడానికి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో ఉపకరించింది. స్త్రీగా ఎదగడానికి ఆమెకున్న అడ్డకులను దాటడానికి సహోద్యోగులు ఎంతో సహకారం అందించారు. ముఖ్యంగా యువత ఆమెకు పక్కబలంగా ఉండి ఆమెకు సహకరించారు. భారతదేశం అయినా విదేశాలలో అయినా సీనియర్లైనా యువతతోనైనా సైన్సు సమాజం సభ్యులతో కలిసి పనిచేయడంలో ఆమె తృప్తిని ఆనందాన్ని అనుభవించింది. ఈ సంతృప్తి ఆమెను వృత్తిలో చాలా కాలం కొనసాగడానికి అలాగే పలు సాధనలు చేయడానికి సహకరించింది.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.


"https://te.wikipedia.org/w/index.php?title=మంజు_శర్మ&oldid=3857939" నుండి వెలికితీశారు