మండల ప్రజా పరిషత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మండలాలలో రెవిన్యూ డిపార్ట్ మెంట్ నుండి తహసీల్ దారు ఉంటే. పంచాయితీరాజ్ డిపార్ట్ మెంట్ నుండి ఎమ్.పి.డి.వో., మండలాధ్యక్షుడు, జిల్లా పరిషత్తు సభ్యుడు, ఎమ్.పి.టి.సి.లు ఉంటారు.

మండల స్థాయి సంఘాలు[మార్చు]

ప్రతి మండల పరిషత్తులో మూడు స్థాయి సంఘాలు ఏర్పాటుచేయాలి. వీటిలో సహజ వనరులు, మానవ వనరులు, మౌలిక వసతులకు సంబంధించి కమిటీలు ఉంటాయి. సహజ వనరుల కమిటీలో వ్యవసాయం, పశుపోషణ, మత్య్స పరిశ్రమ, రక్షిత మంచినీరు, వాటర్‌షెడ్లు తదితర అంశాలు ఉంటాయి. దీనికి ఎంపీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మౌలిక వసతుల కమిటీలో రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టులు తదితరమైనవి ఉంటాయి. ఈ కమిటీకి మండల ఉపాధ్యక్షుడు బాధ్యులుగా ఉంటారు. ఇక మానవ వనరుల కమిటీలో విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం, శిశు, మహిళ, వికలాంగ, వృద్ధుల సంక్షేమం వగైరా ఉంటాయి. ఈ కమిటీకి మండల ప్రాదేశిక నియోజకవర్గంనుంచి ఎన్నికైన మహిళా సభ్యురాలు ఛైర్‌ పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఈ మూడు కమిటీలకు ఎంపీడీవో కన్వీనర్‌గా వ్యవహరించాలి. జిల్లా పరిషత్తు పాలన మాదిరిగానే మండల పరిషత్తుల్లోనూ స్థాయీ సంఘాలను ఏర్పాటు చెయ్యాలన్న ఆలోచనతో ప్రభుత్వం 2008లో 148 జీవో జారీచేసింది. స్థాయి సంఘాల ఏర్పాటు ద్వారా మండలంలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించి, ఆదాయ మార్గాలను అన్వేషించి, వనరులను సమీకరించుకోవాలన్నది ఉద్దేశం.

స్థాయి సంఘాల ఏర్పాటు జరిగితే జవాబుదారీతనం పెరుగుతుంది. కమిటీలు సమావేశాలు నిర్వహించి, తీర్మానాలు చేయాలి. ఎంపీపీ, ఉపాధ్యక్షులకు పొసగకపోవడం, జడ్పీ మాదిరిగా మండల పరిషత్తు స్థాయి సంఘ సభ్యులకు నిర్ణయాధికారాలు లేకపోవటం లక్ష్యాన్ని నీరుగార్చింది.మండల పరిషత్తు పరిధిలో ఏర్పాటుచేయాల్సిన స్థాయి సంఘ కమిటీలు ప్రతి రెండు నెలలకోసారైనా విధిగా సమావేశం కావాలి. సమావేశానికి ఐదు రోజులకు ముందు సభ్యులకు అజెండా ఇచ్చి సమావేశంలో ఆయా అంశాలపై చర్చించాలి. ఆయా శాఖల అధికారులు విధిగా సమావేశాలకు హాజరుకావాలి. ఎంపీపీలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ అంశంపై ఈ స్థాయిసంఘ కమిటీలు, అధికారుల అభిప్రాయాన్ని సేకరించాలి.