మండవ వెంకటేశ్వర రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండవ వెంకటేశ్వర రావు
మండవ వెంకటేశ్వర రావు


మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే
నియోజకవర్గం డిచ్‌పల్లి శాసనసభ నియోజకవర్గం
నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1950
నిజామాబాద్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, భారత్ రాష్ట్ర సమితి
నివాసం హైదరాబాద్

మండవ వెంకటేశ్వర రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎక్సైజ్‌ శాఖ, విద్యా శాఖ, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

మండవ వెంకటేశ్వర రావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1985లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అంతరెడ్డి బాల్ రెడ్డి పై 7726 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.ఆయన 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

మండవ వెంకటేశ్వరరావు 1995లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, 1997లో నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఎక్సైజ్‌ శాఖమంత్రిగా పనిచేశాడు. మండవ వెంకటేశ్వరరావు 1999 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా మూడేళ్ల పాటు పనిచేసి, 2002లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[2]

మండవ వెంకటేశ్వరరావు 2004లో ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం గంగారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆయన 2008 (ఉప ఎన్నిక) 2009, 2010 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాడు.

హైదరాబాద్‌లోని మండవ వెంకటేశ్వరరావు ఇంటికి 2019 ఏప్రిల్ 05న వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనను పార్టీలోకి రావాలని ఆహ్వానించాడు.[3] ఆయన ఏప్రిల్ 06వ తేదీన ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.[4][5]

మండవ వెంకటేశ్వరరావు 2023 నవంబరు 25న బోధన్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[6]

ఎన్నికల చరిత్ర

[మార్చు]
ఎన్నికల ఫలితాలు
సంవత్సరం కార్యాలయం నియోజక వర్గం పార్టీ ఓట్లు % ప్రత్యర్థి పార్టీ ఓట్లు % ఫలితం
1985 ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిచ్‌పల్లి తెలుగుదేశం పార్టీ 37,211 అంతరెడ్డి బాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 29,485 గెలుపు
1989 42,896 ఎన్. ఎల్. నారాయణ 42,671 గెలుపు
1994 58,928 మహేశ్వర్ గౌడ్ 28,972 గెలుపు
1999 51,641 అంతరెడ్డి బాల్ రెడ్డి 47,355 గెలుపు
2004 38,790 గడ్డం గంగారెడ్డి 65,434 ఓటమి
2008^ 31,308 ఆకుల లలిత 39,756 ఓటమి
2009 నిజామాబాదు (రూరల్‌) 71,813 ఆకుల లలిత 43,086 గెలుపు

మూలాలు

[మార్చు]
  1. Eenadu (4 November 2023). "8 మంది హ్యాట్రిక్‌ వీరులు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  2. Sakshi (3 November 2018). "నిజామాబాద్‌ నియోజకవర్గా ఎన్నికల రివ్యూ". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  3. TV9 Telugu (5 April 2019). "టీఆర్ఎస్‌లోకి టీడీపీ నేత మండవ.. ఇంటికెళ్లి ఆహ్వానించిన కేసీఆర్". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Sakshi (6 April 2019). "టీఆర్‌ఎస్‌లో చేరిన మండవ, గాయత్రి రవి". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  5. 10TV (6 April 2019). "టీడీపీకి షాక్ : టీఆర్ఎస్‌లో చేరిన మండవ వెంకటేశ్వరరావు" (in telugu). Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  6. A. B. P. Desam (25 November 2023). "కాంగ్రెస్‌లో చేరిన మండవ వెంకటేశ్వరరావు - నిజామాబాద్ కాంగ్రెస్‌కు కొత్త బలం !". Archived from the original on 26 November 2023. Retrieved 26 November 2023.