మండోజి నర్సింహాచారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండోజి నరసింహాచారి చిత్రము

మండోజి నర్సింహాచారి తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ శాస్త్రవేత్త. ఆయన ఆరిపోయిన ట్యూబ్ లైట్లతో మళ్లీ వెలుగులు నింపేందుకు క్రొత్త ఆవిష్కరణ "చారి ఫార్ములా" ను రూపొందించాడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన నిజామాబాదు జిల్లా కు చెందిన నవీపేట్ గ్రామానికి చెందినవాడు.[2] ఆయన ఎలక్ట్రానిక్స్ రంగంలో బాల్యం నుండి ఆసక్తి కలిగియుండేవాడు. ఆయన తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే కాలిపోయిన ట్యూబ్ లైట్లను తిగిగి వెలిగించుటకు అనేక ప్రక్రియల కోసం పరిశోధనలు మొదలుపెట్టాడు. చివరికి ఆయన కాలిపోయిన ట్యూబ్ లైట్ ను కూడా వెలిగించగల సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించి అందరిని అబ్బురపరచిన ఆవిష్కర్త గా చరిత్రలో నిలిచాడు. ఈయన రూపొందించిన ఈ పరికరం మాడిపోయిన ట్యూబ్‌లైట్ ను వెలిగించటమే ప్రధానమైనను ఈ పరికరం ద్వారా కొత్త ట్యూబ్‌లైట్ నూ వెలిగించవచ్చు. ఈ పరికరం ద్వారా ట్యూబ్‌లైట్‌ను వెలిగించినట్లయితే విద్యుత్ ఆదా కూడా అవుతుంది. ఇతను రూపొందించిన పరికరం ద్వారా ట్యూబ్‌లైట్ వెలుగునప్పుడు గతకడం కూడా జరగదు, తడిసినా నీటిలో మునిగినా లైట్ వెలుగునిస్తూ ఉంటుంది.

ఆయన కనుగొన్న "చారీ ఫార్ములా" తో ఆరిపోయిన ట్యూబ్ లైట్లను వెలిగించుటలో, ట్యూబ్ లైట్ల వ్యర్థాలనుండి పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో చేసిన కృషి ప్రపంచ మేథావులను అబ్బురపరచింది. ఆయన చేసిన "చారీ ఫార్ములా" ను, నిజామాబాదు మ్యునిసిపాలిటీ ముందుకు వచ్చి, వీధి దీపాలకు అమర్చింది. ఆయనకు అనేక అంతర్జాతీయ, జాతీయ అవార్డులు వచ్చాయి.

చారి ఫార్ములా[మార్చు]

మాడిపోయిన ట్యూబ్‌లైట్ లో మళ్ళీవెలుగులు నింపేందుకు నర్సింహాచారి రూపొందించిన పరికరం పేరు ఐక్య-రెడ్.[3]

ఈ పరికరంతో లాభాలు
గ్రామానికిచెందినవారు
  1. కాలిపోయిన/కొత్త ట్యూబ్‌లైట్ ను వెలిగించవచ్చు.
  2. చౌక్, స్టార్టర్ ల అవసరం లేదు.
  3. తక్కువ ఓల్టేజ్ తో పనిచేస్తుంది.
  4. గతకదు.
  5. ఉపయోగించడం చాలా సులభం.

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Ideas from the abyss need ground to grow
  2. "Indian Edison Mandaji Narasimhachary". మూలం నుండి 2016-03-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-09-09. Cite web requires |website= (help)
  3. Ideas from the abyss need ground to grow-Dr N R Sudheendra Rao, July 29, 2013, DHNS

ఇతర లింకులు[మార్చు]