Jump to content

మంతాజ్ సంఘమిత

వికీపీడియా నుండి
మంతాజ్ సంఘమిత
పార్లమెంటు సభ్యురాలు
In office
మే 2014 – మే 2019
అంతకు ముందు వారుసైదుల్ హక్
తరువాత వారుఎస్. ఎస్. అహ్లువాలియా
నియోజకవర్గంబర్ధమాన్ దుర్గాపూర్ లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం(1946-01-16)1946 జనవరి 16
మరణం2026 ఆగస్టు 27(2026-08-27) (వయసు: 80)
రాజకీయ పార్టీతృణమూల్ కాంగ్రెస్
జీవిత భాగస్వామినూర్ ఆలం చౌదరి
నైపుణ్యంవైద్య నిపుణురాలు/ప్రొఫెసర్

డాక్టర్ మంతాజ్ సంఘమిత (ఆంగ్లం: Mamtaz Sanghamita: 1946 జనవరి 16– 2026 ఆగస్టు 27), ఒక భారతీయ వైద్యురాలు, రాజకీయవేత్త. ఆమె బర్ధమాన్ దుర్గాపూర్ లోక్‌సభ నియోజకవర్గం, పశ్చిమ బెంగాల్ నుండి 16వ లోక్‌సభకు పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నది. ఆమె 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచింది.[1]

మంతాజ్ సంఘమిత పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ స్పీకర్, మాజీ న్యాయ మంత్రి దివంగత సయ్యద్ అబ్దుల్ మన్సూర్ హబీబుల్లా, విద్యావేత్త మక్సూదా ఖాతూన్ దంపతుల కుమార్తె.[2]

ఆమె వృత్తిరీత్యా స్త్రీ జననేంద్రియ వైద్యురాలు, కలకత్తా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో స్త్రీ జననేంద్రియా విభాగానికి అధిపతిగా ఉన్నది.[3]

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆమె బర్ధమాన్ లోని మునిసిపల్ గర్ల్స్ స్కూల్, కోల్కతాలోని బ్రహ్మ బాలికా విద్యాలయ లలో చదివింది. ఆమె బెతున్ కళాశాల నుండి ప్రీ-మెడికల్ పూర్తి చేసింది. ఆమె 1968లో కలకత్తా మెడికల్ కాలేజీ నుండి ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించింది. దాని తరువాత, ఆమె 1970లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి డీజీఓ, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఎండీ (ఓటీజీ) పూర్తి చేసింది. ఆమె ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్ళింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1975లో ఆమె న్యాయవాది, తరువాత రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి అయిన నూర్ ఆలం చౌదరిని వివాహం చేసుకున్నది. వారి ఏకైక కుమార్తె డాక్టర్ షబానా రోజ్ నేషనల్ మెడికల్ కాలేజీ నుండి ఎంబిబిఎస్ చేసి ఉన్నత వైద్య పరిశోధనను కొనసాగిస్తున్నది.[4]

సంఘమిత తన 80 వ ఏట 2026 ఆగస్టు 27న మరణించింది.[5]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Constituencywise-All Candidates". Archived from the original on 4 సెప్టెంబరు 2020. Retrieved 17 May 2014.
  2. ↑ Siddiqui, Kanchan (6 March 2014). "Habibulla daughter challenges CPM MP". Trinamul fields controversial physician to uproot stalwart. The Statesman, 7 March 2014. Retrieved 11 June 2014.
  3. ↑ "Lok Sabha Elections 2014 – Know Your Candidates". Dr. Mumtaz Sanghamita. All India Trinamool Congress. Archived from the original on 25 June 2014. Retrieved 11 June 2014.
  4. ↑ "Prof. (Dr.) Mumtaz Sanghamita". Calcutta Yellow Pages. Archived from the original on 10 ఆగస్టు 2019. Retrieved 12 June 2014.
  5. ↑ "Former Trinamool MP Mamtaz Sanghamita passes away at 80". The Times of India. 27 August 2026. Retrieved 27 August 2026.