Jump to content

మకరంద్ జాదవ్

వికీపీడియా నుండి
మకరంద్ జాదవ్ పాటిల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 డిసెంబర్ 15
గవర్నరు సీ.పీ. రాధాకృష్ణన్
ముందు అనిల్ భైదాస్ పాటిల్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009
ముందు మదనరావు పిసల్
నియోజకవర్గం వాయ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

మకరంద్ లక్ష్మణరావు జాదవ్ పాటిల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వాయ్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2024 డిసెంబరు 15న మూడో ఫడ్నవీస్ మంత్రివర్గంలో ఉపశమన & పునరావాస శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

మకరంద్ జాదవ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పోటీ చేసి 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వాయ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి మదనరావు పిసల్ చేతిలో 18,265 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయనకు 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి మదన్ ప్రతాప్రావు భోసలేపై 21,825 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

మకరంద్ జాదవ్ తిరిగి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వాయ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి భోసలే మదన్ ప్రతాప్రావుపై 38,702 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మదన్ ప్రతాప్రావు భోసలేపై 43,647 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు[3]


మకరంద్ జాదవ్ 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వాయ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థి అరుణాదేవి శశికాంత్ పిసల్‌పై 61,392 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[4] 2024 డిసెంబరు 15న మూడో ఫడ్నవీస్ మంత్రివర్గంలో ఉపశమన & పునరావాస శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra portfolios: Fadnavis keeps Home, Shinde Urban Development; Ajit gets Finance" (in Indian English). The Hindu. 21 December 2024. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.
  2. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  3. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. The Indian Express (15 December 2024). "Maharashtra cabinet expanded; here is the full list of ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  6. "Maharashtra portfolio allocation: CM Fadnavis keeps home ministry, Ajit Pawar gets finance, Shinde gets urban development". The Times of India. 21 December 2024. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.
  7. "Fadnavis retains Home, Ajit Finance, Shinde gets Urban, Works, and Housing" (in ఇంగ్లీష్). The Indian Express. 22 December 2024. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.