మజిద్ ఖాన్ (క్రికెటర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాజిద్ ఖాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మాజిద్ జహంగీర్ ఖాన్
పుట్టిన తేదీ (1946-09-28) 1946 సెప్టెంబరు 28 (వయసు 77)
లూథియానా, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
బంధువులు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 44)1964 అక్టోబరు 24 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1983 జనవరి 23 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 4)1973 ఫిబ్రవరి 11 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే1982 జూలై 19 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 63 23 410 168
చేసిన పరుగులు 3,931 786 27,444 4,441
బ్యాటింగు సగటు 38.92 37.42 43.01 28.28
100లు/50లు 8/19 1/7 73/128 2/31
అత్యుత్తమ స్కోరు 167 109 241 115
వేసిన బంతులు 3,584 658 7,168 2,817
వికెట్లు 27 13 223 71
బౌలింగు సగటు 53.92 28.76 32.14 22.67
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 4 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/45 3/27 6/67 5/24
క్యాచ్‌లు/స్టంపింగులు 70/– 3/– 410/– 43/–
మూలం: ESPNCricinfo, 2006 ఫిబ్రవరి 4

మాజిద్ జహంగీర్ ఖాన్ (జననం 1946, సెప్టెంబర్ 28), పాకిస్తాన్ మాజీ క్రికెటర్, బ్యాట్స్‌మన్. పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా కూడా ఉన్నాడు. ఒకానొక సమయంలో ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. 1961 నుండి 1985 వరకు 18 సంవత్సరాల పాటు సాగిన అతని ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో, పాకిస్తాన్ తరపున 63 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 8 సెంచరీలతో 3,931 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 27,000 పరుగులు (73 ఫస్ట్ క్లాస్ సెంచరీలు, 128 ఫిఫ్టీలతో) చేశాడు.[1] 1983 జనవరిలో భారత్‌తో లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో తన చివరి టెస్టును ఆడాడు.[2] 1982 జూలైలో మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లాండ్‌తో చివరి వన్డే ఇంటర్నేషనల్ ఆడాడు.[3] లాహోర్ ఎడ్యుకేషన్ బోర్డ్ క్రికెట్ టీమ్ తరపున కూడా ఆడాడు.

తొలి జీవితం

[మార్చు]

మాజిద్ జహంగీర్ ఖాన్ 1946, సెప్టెంబరు 28న బ్రిటీష్ ఇండియా, పంజాబ్‌లోని లూథియానాలో బుర్కీ పష్టూన్ కుటుంబంలో జన్మించాడు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్‌లో పెరిగాడు. ఇతని తండ్రి, జహంగీర్ ఖాన్, 1947లో భారతదేశ విభజనకు ముందు భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు. ఇతను పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ బంధువు.

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

1964లో, ఆస్ట్రేలియాతో కరాచీలోని నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ ఆడాడు.[4] 1976-77 టెస్ట్ సిరీస్ సమయంలో కరాచీలో న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు లంచ్‌కు ముందు సెంచరీ చేసిన ఆరుగురు బ్యాట్స్‌మెన్ (మిగతా ఐదుగురు ట్రంపర్, మాకార్ట్నీ, బ్రాడ్‌మన్, వార్నర్, శిఖర్ ధావన్ ) మజీద్ ఖాన్ ఒకడు. ఇతను 78 బంతుల్లో 108 నాటౌట్ గా నిలిచాడు.[5][6][7] 1973లో న్యూజిలాండ్‌లోని లాంకాస్టర్ పార్క్‌లో న్యూజిలాండ్‌పై తన వన్డే అరంగేట్రం చేశాడు.[8] 1974, ఆగస్టు 31న ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో పాకిస్తాన్ తరపున మొదటి వన్డే సెంచరీ చేసిన ఏకైక గౌరవాన్ని కూడా కలిగి ఉన్నాడు.[9][10][11] ఖాన్ 93 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 109 పరుగులు చేసి పాకిస్థాన్‌ను విజయతీరాలకు చేర్చాడు.[9][10]

అంతర్జాతీయ క్రికెట్ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్‌లో అడ్మినిస్ట్రేటర్ గా నియమించబడ్డాడు. 1990ల మధ్యలో బోర్డు సీఈఓ అయ్యాడు.[12] 1993లో పాకిస్థాన్‌కు చీఫ్‌ సెలక్టర్‌గా ఉన్నాడు. 1995లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌లకు మ్యాచ్-రిఫరీగా వ్యవహరించాడు. పాకిస్తాన్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, కానీ 1999 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేయడంతో రాజీనామా చేశాడు.

మూలాలు

[మార్చు]
 1. "Majid Khan", ESPNcricinfo, retrieved 2023-09-19
 2. "India in Pakistan Test Series – 5th Test", ESPNcricinfo, 23 January 1983, retrieved 2023-09-19
 3. "Prudential Trophy – 2nd ODI", ESPNcricinfo, 19 July 1982, retrieved 2023-09-19
 4. "Australia in Pakistan Test Match", ESPNcricinfo, 24 October 1964, retrieved 2023-09-19
 5. Seervi, Bharath (3 January 2017). "Warner only fifth to score century before lunch on first day". ESPNcricinfo. Retrieved 3 January 2017.
 6. "Records / Test matches / Batting records / Hundred runs before lunch", ESPNcricinfo, 30 October 1976, retrieved 2023-09-19
 7. "New Zealand in Pakistan Test Series – 3rd Test", ESPNcricinfo, 30 October 1976, retrieved 2023-09-19
 8. "Pakistan in New Zealand ODI Match", ESPNcricinfo, 11 February 1973, retrieved 2023-09-19
 9. 9.0 9.1 "Prudential Trophy – 1st ODI", ESPNcricinfo, 31 August 1974, retrieved 2023-09-19
 10. 10.0 10.1 England v Pakistan – Prudential Trophy 1974 (1st ODI), CricketArchive, 31 August 1974, retrieved 2023-09-19
 11. Who made the 1st century for Pakistan?, ItsOnlyCricket, 27 December 2010, retrieved 2023-09-19
 12. Profile: Majid Khan, Lords, archived from the original on 20 March 2012, retrieved 2023-09-19

బాహ్య లింకులు

[మార్చు]