Coordinates: 26°57′0″N 94°10′0″E / 26.95000°N 94.16667°E / 26.95000; 94.16667

మజులి జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మజులి జిల్లా
అసోం రాష్ట్ర జిల్లా
జూలైలో చిత్తడి నేల
జూలైలో చిత్తడి నేల
అస్సాంలోని ప్రదేశం ఉనికి
అస్సాంలోని ప్రదేశం ఉనికి
Coordinates: 26°57′0″N 94°10′0″E / 26.95000°N 94.16667°E / 26.95000; 94.16667
దేశం భారతదేశం
రాష్ట్రంఅసోం
డివిజన్ఎగువ అసోం
జిల్లా ఏర్పాటు2016 జూన్ 27
ముఖ్య పట్టణంగారమూర్
Government
 • డిప్యూటి కమీషనర్బికారాం కైరీ
Area
 • మొత్తం880 km2 (340 sq mi)
Population
 • మొత్తం1,57,304
భాషలు
 • అధికారికఅస్సామీ
Time zoneUTC+05:30 (భారత కాలమానం)
Vehicle registrationఏఎస్-29

మజులి జిల్లా,[1] అసోం రాష్ట్ర్రంలోని జిల్లా. దీని ముఖ్య పట్టణం గారమూర్. ఈశాన్య అస్సాంలోని బ్రహ్మపుత్రా నదిపై ఉన్న ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద నది ద్వీపం[2] కాగా, దేశంలోని మొదటి ద్వీప జిల్లా.[3]

ఏర్పాటు[మార్చు]

2016, జూన్ 27న సర్బానంద సోనోవాల్ ఈ జిల్లాను ప్రకటించాడు. జోర్హాట్ ఉత్తర భాగాలతో మజులిని ఏర్పాటుచేసిన తరువాత అస్సాం రాష్ట్ర జిల్లాల సంఖ్య 33కి చేరుకుంది.[4]

విస్తీర్ణం - జనాభా[మార్చు]

మజులి జిల్లా విస్తీర్ణం 880 చ.కి.మీ. (340 చ.మై.) కాగా, జిల్లాలో 1,57,304 జనాభా ఉంది.

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

ఇక్కడ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం కాగా, వరి ప్రధాన పంటగా ఉంది. మజులిలో విభిన్నమైన వ్యవసాయ సంప్రదాయం ఉంది, పురుగుమందులు, కృత్రిమ ఎరువులు లేకుండా ఇక్కడ 100 రకాల వరిని పండిస్తారు.

గ్రామీణ ప్రాంత జనాభాలో చేనేత ప్రధాన వృత్తిగా ఉంది. ఇది వాణిజ్యేతర వృత్తి అయినప్పటికీ, చాలామంది ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. పత్తి, పట్టు, ముఖ్యంగా ముగా పట్టుకు వివిధ రంగులు అద్ది, అల్లికలను ఉపయోగించి బట్టలను నేస్తారు.

ఇక్కడ పండించే కోమల్ సాల్ వరి ప్రత్యేకమైనది. ధాన్యాలను వెచ్చని నీటిలో 15 నిమిషాలు నానబెట్టి తినవచ్చు. చాలామంది వీటిని అల్పాహారం ధాన్యంగా తింటారు. చేపలు పట్టడం, పాడిపరిశ్రమ, కుండలు, చేనేత, పడవ తయారీ ఇతర ముఖ్యమైన వృత్తులు.[5]

రాజకీయాలు[మార్చు]

మజులి శాసనసభ నియోజకవర్గం అస్సాంలోని అసెంబ్లీలోని 99వ నియోజకవర్గం. ఇది షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) కేటాయించినన సీటు. లఖింపూర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలలో మజులి ఒకటి.

మూలాలు[మార్చు]

  1. Official Website
  2. "Assam's Majuli to become India's first island district today".
  3. "Assam: Majuli becomes 1st river island district of India". Hindustan Times. Guwahati. 27 June 2016. Retrieved 23 December 2020.
  4. Majuli to get district status today
  5. The Only Govt Jobs updates website open from Majuli Archived 2017-05-01 at the Wayback Machine

వెలుపలి లంకెలు[మార్చు]