మడవ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది వ్యవసాయ సంబందిత పదం. వెలి దుక్కిలో నాటే పంటలకు సాలు తోలి దానిలో మొక్కలను నాట తారు. చెరకు, మిరప తోట మొదలగు వాటికి ఈ మడవలు" తప్పని సరి. పారించే నీరు వృధా కాకుండా సమానంగా పారించ డానికి వీటిని ఏర్పాటు చేస్తారు. ముందుగా 'సాళ్లు తోలి' ఆ సాళ్లకు అడ్డంగా సుమారు పదడుగులక ఒకటి చొప్పున మరొక సాలు తోలు తారు. ఇది చిన్న కాలువగా వుపయోగిస్తారు. దీని ద్వార ఇరువైపుల వున్న సాళ్లకు నీరు పారిస్తారు. ఆ సాళ్లు మూడు లేక ఐదు(బేసి) సాళ్లుకు కలిపి నీరు పారిస్తారు. అలా నీరు పారించే చిన్న అడ్డు కట్టను మడవ అంటారు. ఒక వైపు 'మడవ' కట్టి అది పారగానె దాని కెదురుగా వున్న సాళ్లకు మరొక 'మడవ' కట్టి ఆ సాళ్లను కూడ పారిస్తారు. అలా ఆ చిన్న కాలువ గట్టుకున్న మట్టిని పారతో తీసి కాలవకు అడ్డుగా వేస్తె ఆ కాలువలో పారె నీరు సాళ్లలోకి పారు తుంది. అది పారిన తర్వాత ఆ అడ్డు కట్టను పారతో తొలిగించి మరొక సాళ్లలోనికి పారిస్తారు. దీనినే 'మడవ' కట్టడం అంటారు. ఆ విదంగా ఒక పార మందం కాలువ గట్టును తొలగించడమును 'మడవ' అంటారు. అలాగె నీరు పారె మూడు సాళ్లను (లేదా ఐదు సాళ్లను కూడ) 'మడవ' అంటారు. ఒక్కో కాలవకు దాని పొడవును బట్టి సుమారు ఒక్కోవైపు ఐదు లేక ఆరు 'మడవలు' వుంటాయి. (పద ప్రయోగాలు: మడవ సరిగా కట్టక పోతె నీరు పొల్లి పోయి మడవ తెగి పోతుంది. ,,, ఇంకా నాలుగు 'మడవలు' కూడ పారలేదు అప్పుడే కరెంటు పోయిందా?) ఇక్కడున్న చిత్రం లేత చెరుకు తోటకు వున్న కాలువలు, మడవలు, సాళ్లను గమనిస్తే మడవ అంటే వివరంగా తెలుస్తుంది.

లేత చెరుకు తోటకు వేసిన సాళ్లు, మడవలు, కాలువలు.
"https://te.wikipedia.org/w/index.php?title=మడవ&oldid=2436102" నుండి వెలికితీశారు