అక్షాంశ రేఖాంశాలు: 17°57′42″N 79°29′05″E / 17.961731°N 79.484858°E / 17.961731; 79.484858

మడికొండ (కాజీపేట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మడికొండ
—  రెవెన్యూ గ్రామం  —
మడికొండ is located in తెలంగాణ
మడికొండ
మడికొండ
అక్షాంశరేఖాంశాలు: 17°57′42″N 79°29′05″E / 17.961731°N 79.484858°E / 17.961731; 79.484858
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హన్మకొండ
మండలం కాజీపేట
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 19,229
 - పురుషుల సంఖ్య 9,606
 - స్త్రీల సంఖ్య 9,623
 - గృహాల సంఖ్య 4,778
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మడికొండ, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, కాజీపేట మండలం లోని గ్రామం.[1][2] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని హన్మకొండ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ పట్టణ జిల్లాలో, కొత్తగా ఏర్పాటు చేసిన కాజీపేట మండలం (హన్మకొండ జిల్లా) లోకి చేర్చారు.[3][4] ఆ తరువాత 2021 లో, వరంగల్ పట్టణ జిల్లా స్థానంలో హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.[4] కాజీపేట స్టేషనుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కాళోజీ, పీవీ లాంటి వారు ఈ ఊర్లో కొద్ది కాలం గడిపిన వారే.ఈ ఊరు పేరు పూర్వం మనిగిరి కాలక్రమేన మడికొండగా మారింది.ఇక్కడ ఐదు ప్రభుత్వ పాఠశాలలు.10వరకు ఇతర పాఠశాలలు ఉన్నాయి.వరంగల్లు మహానగర పాలక సంస్థలో విలీనమై, పట్టణ వాతావరణం కలిగిఉన్న రెవెన్యూ గ్రామం.

గ్రామ జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం జనాభా మొత్తం 19,229. అందులో పురుషుల 9,606 మంది కాగా, స్త్రీల 9,623 మంది ఉన్నారు. గృహాల సంఖ్య 4,778

గ్రామ ప్రముఖులు

[మార్చు]
వానమామలై వరదాచార్యులు

దేవాలయాలు

[మార్చు]

ఈ గ్రామంలో అతి ప్రాచీనమైన రెండు ఆలయాలున్నాయి.

గ్రామ విశేషాలు

[మార్చు]

1198 - 1261 మద్య కాలంలో కాకతీయ రాజులు ఆలయాలను నిర్మించి నట్లు శాసనాలను బట్టి తెలుస్తుంది. ఇక్కడ నవ సిద్ధులు తపస్సు చేసిన ప్రాంతంలో నవ గుండాలున్నాయి. ఒక్కో గుండానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అవి పాలగుండం, జీడి గుండం, కన్ను గుండం, కత్తి గుండం, రామ గుండం, గిన్నె గుండం. ప్రతి ఏటా ఈ మెట్టు గుట్టపై మహా శివరాత్రి నాడు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ క్షేత్రానికి దక్షిణ కాశి అని పేరు కూడా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. https://telangana.gov.in/PDFDocuments/G.O-Formation-of-Warangal-Urban-and-Rural-Districts.pdf
  3. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. 4.0 4.1 G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  5. వరదాచార్యులు, వానమామలై (1957). ఆహ్వానం. సికిందరాబాద్. Retrieved 6 December 2014.{{cite book}}: CS1 maint: location missing publisher (link)

వెలుపలి లింకులు

[మార్చు]