మణికరన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మణికరన్

మణికరన్ (హిందీ: मणिकर्ण) అనేది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, కుల్లూ జిల్లాలోని ఈశాన్య భుంతర్‌లోని బియాస్ మరియు పార్వతి నదుల మధ్య ఉన్న పార్వతీ లోయలో నెలకొని ఉంది. ఇది 1760 మీటర్ల ఎత్తులో ఉంది, కుల్లు నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ చిన్న పట్టణం తన వేడి నీటి బుగ్గలతో, యాత్రా కేంద్రాలతో, మనాలి మరియు కుల్లు సందర్శిస్తున్న పర్యాటకులను తన వైపుకు ఆకర్షించుకుంటోంది. ప్రయోగాత్మకమైన భూఅంతర్గత ఉష్ణశక్తి కర్మాగారం కూడా ఇక్కడ స్థాపించబడింది.

ధార్మిక కేంద్రం[మార్చు]

2009 మే మణికరన్ గురుద్వారా కాంప్లెక్స్ లో వసంత కాలం లో పర్యాటకులు మరియు భక్తులు స్నానాలు చేస్తూ.

మణికరన్ హిందువులు మరియు సిక్కులకు తీర్థయాత్రా కేంద్రం. వరద తర్వాత మనువు మణికరన్‌‌లో మానవజీవితాన్ని పునఃసృష్టించాడని, ఆ విధంగా దీన్ని పవిత్ర స్థలంగా చేశాడని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడ పలు ఆలయాలు మరియు ఒక గురుద్వారా కూడా ఉన్నాయి.[1] ఇక్కడ రాముడు, కృష్ణుడు, మరియు విష్ణు ఆలయాలు ఉన్నాయి.[2] ఈ ప్రాంతం వేడినీటి బుగ్గలకు[3] మరియు సుందర ప్రకృతి దృశ్యానికి పేరుగాంచింది.

పురాణాల ప్రకారం, పరమశివుడు ఆయన దేవేరి పార్వతి ఈ లోయలో నడుస్తున్నప్పుడు, పార్వతి తన కర్ణాభరణాలలో ఒకదాన్ని ఇక్కడ జారవిడిచిందట. ఈ కర్ణాభరణాన్ని నాగదేవత అయిన శేషుడు స్వాధీనపర్చుకుని దాంతోపాటు భూమిలోకి మాయమైపోయాడట. పరమశివుడు విశ్వ నృత్యమైన తాండవ నృత్యం చేసినప్పుడు మాత్రమే శేషుడు ఈ ఆభరణాన్ని స్వాధీనపర్చి నీటలోకి విసిరివేశాడట. స్పష్టంగానే, 1905లో భూకంపం వచ్చేంతవరకు మణికరన్ జలాల్లో ఆభరణాలు విసిరివేయబడటం కొనసాగింది.[4]

సిక్కు విశ్వాసం[మార్చు]

సిక్కుల ప్రకారం, మూడవ ఉదాసి కాలంలో గురు నానక్ దేవ్ విక్రమనామ సంవత్సరం 1574లో అసు 15న తన శిష్యులు భాయ్ బాల & భాయ్ మార్దనలతో కలిసి ఈ ప్రాంతానికి వచ్చాడట.శ్రీ గురు నానక్ దేవ్ తన శిష్యులతో పాటు భారత్‌లోని హిమాలయా పర్వతాలలో ఉండేవారు. ఆయన శిష్యులకు ఆకలి వేసింది కాని అక్కడ వారికి ఎలాంటి ఆహారమూ లభించలేదు. గురునానక్ తన ప్రియమిత్రుడు భాయ్ మార్దనను లంగార్ (సామూహిక వంటశాల) కోసం ఆహారాన్ని సేకరించుకు రావడానికి పంపారు. చాలా మంది ప్రజలు ప్రసాదం (బ్రెడ్) తయారు చేయడానికి బియ్యం మరియు పిండి (అట్టా) ని విరాళంగా ఇచ్చారు. అయితే సమస్య ఏమిటంటే ఆహారాన్ని వండటానికి అక్కడ నిప్పు లేకుండా పోయింది. అప్పుడు గురునానక్ ఒక రాతిని పక్కకు తోయగా, అక్కడ ఒక వేడి బుగ్గ (వేడి నీరు) కనిపించింది. అప్పుడు శిష్యులు బియ్యం, బీన్స్‌‍తో వంట చేసుకున్నారట. భాయ్ మార్దనకు చపాతీలను చేయడంలో చిక్కు ఎదురైంది ఎందుకంటే అవి మునిగిపోతూ వచ్చాయి. భాయ్ మార్దన చెప్పాడు దేవుడి పేరుతో నా జీవితాన్నే సమర్పించబోతున్నాను . దాంతో ప్రసాదం అద్భుతంగా పైకి తేలింది. దేవుడి పేరుతో తమ జీవితాలను ఎవరయితే సమర్పిస్తారో అతడు (లేదా ఆమె) నీటిలో ముంచిన వస్తువులు పైకి తేలతాయని గురునానక్ దేవ్

చెప్పారు. ఇది అద్భుతం.

హిందూ విశ్వాసం[మార్చు]

మణికరన్ లో విష్ణు మందిరాలు

ఈ ప్రాంతం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు పరమశివుడు, పార్వతీదేవి పర్వతాలతో, హరిత పత్రాలతో వ్యాపించి ఉన్న ప్రాంతానికి వచ్చారని మణికరన్ పురాణ గాథ చెబుతోంది. ఆ ప్రాంత సౌందర్యాన్ని చూసి మరులుగొన్న వీరు కాస్సేపు అక్కడే గడపాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి వీరు ఇక్కడే పదకొండు వందల సంవత్సరాలు గడిపారని భక్తుల విశ్వాసం.

వారు ఇక్కడ గడిపిన కాలంలో, పార్వతీదేవి మణి నీటి ప్రవాహంలో జారిపోయిందట.

మణి చేజారటంతో విచారంలో మునిగిన పార్వతి దాన్ని తిరిగి తీసుకురమ్మని శివుడిని కోరిందట. పార్వతి కోసం మణిని వెదికి తీసుకురమ్మని పరమశివుడు తన సహాయకుడిని ఆదేశించాడు కాని, వారు ఆ ప్రయత్నంలో విఫలమవటంతో శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. అతడు తన త్రినేత్రాన్ని తెరిచాడు. ఆ అసాధారణ అశుభ ఘటనతో విశ్వం కంపించిపోయింది. రుద్రనేత్రుడిని శాంతింపజేయడానికి నాగదేవత అయిన శేషసర్పాన్ని వేడుకున్నారు. అప్పుడు శేషసర్పం పెద్దగా బుసకొట్టగా వేడినీరు ఉవ్వెత్తున పైకెగిసిందట. ఆ ప్రాంతం మొత్తంలో వేడి నీరు పారింది, దీని ఫలితంగా పార్వతీదేవి పోగొట్టుకున్న మేలురాళ్లవంటివి అక్కడ పైకి తేలాయట. దీంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతగానో సంతోషించారట.

ఈ పురాణగాధ నుంచే మణికరన్ పేరు పుట్టింది. ఇక్కడి నీళ్లు ఇప్పటికీ వేడిగానే ఉంటూ పరమ శుభదాయకంగా భావిస్తుంటారు. ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే తీర్థయాత్ర ముగించిన ఫలితం ఒనగూరుతుందని నమ్మిక. ఈ ప్రాంతాన్ని సందర్శించాక ఇక కాశీని కూడా సందర్శించనవసరం లేదని జనం విశ్వాసం. ఈ బుగ్గలోంచి ఉబికి వచ్చే నీటికి వ్యాధులను పోగొట్టే శక్తులు ఉన్నాయని భావిస్తుంటారు. ఇక్కడి నీరు ఎంత వేడిగా ఉంటుందంటే బియ్యం కూడా ఉడికిపోతాయి.

సిక్కు తీర్థయాత్ర[మార్చు]

మణికరన్ లో ట్రక్ లో ఆహ్లాదముగా గడుపుతున్న సిఖ్ భక్తులు
మణికరన్ గుర్ద్వర లాంగర్

గురు నానక్ దేవ్ ఇక్కడ సందర్శించాడని నమ్ముతుండటంతో దేశంలోని సిక్కు జనాభాకు మణికరన్ అతి పవిత్ర స్థలంగా ఉంటోంది. దీనికి సంబంధించిన చరిత్ర జనమ్ శక్తి లేదా త్వరిఖ్ గురు ఖల్సా లో కనిపిస్తుంది (గియనీ గియన్ ద్వారా). కలనౌర్, గురుదాస్‌పూర్, దసుయా, త్రిలోక్‌నాథ్, పలంపూర్, కంగ్రా, మాండి, ఛాంబ, కులు, బిజిలి మహదేవ్ ప్రాంతాలను సందర్శించిన తర్వాత గురునానక్ తన శిష్యుడు భాయ్ మార్దనతో కలిసి ఇక్కడికి వచ్చారట. అతడి వెంట మరో అయిదుగురు అనుయాయులు లేదా 'పైరాస్' కూడా వచ్చారు.

మణికరన్ గురుద్వారా[మార్చు]

గురునానక్‌తో సంబంధం కారణంగా ఇక్కడి శ్రీ గురు నానక్ దేవ్ జీ గురుద్వారా సుప్రసిద్ధమైనది. ఈ గురుద్వారాకు వచ్చే భక్తులు వేడినీటి బుగ్గల నుంచి వచ్చే వేడినీటిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. ఇక్కడ చేసే మూడు స్నానాలలో ఒకటి గురుద్వారా కిందనే ఉంది. స్త్రీ పురుషులకు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడికి కాస్త దూరంలో లంగార్ హాల్ (సామూహిక వంటశాల) ఉంది ఇక్కడ ఉచిత భోజనం అందిస్తారు.

మణికరన్ వద్ద గల హిందూ దేవాలయాలు[మార్చు]

రామచంద్ర ఆలయం[మార్చు]

ఇది బహుశా మణికరన్‌లో అతి ముఖ్యమైన ఆలయం. 17 శతాబ్దంలో రాజా జగ్జీత్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. చారిత్రక ఆధారాలు లేకున్నప్పటికీ, ఇక్కడ ప్రతిష్ఠాపించిన శ్రీరాముడి విగ్రహం నేరుగా ఆయోధ్య నుంచే తీసుకురాబడిందని భక్తుల విశ్వాసం. రాముడి చిన తమ్ముడు లక్ష్మణుడి విగ్రహం కూడా ఇక్కడ ఉండేదని భావించబడుతోంది కాని ఇప్పుడది ఇక్కడ కనిపించడం లేదు. సీతాదేవి విగ్రహం కూడా రాముడి సరసనే ఉంటోంది. 1889లో రాజా దిలీప్ సింగ్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఆలయ చరిత్ర రాతిగోడల మీద చెక్కి ఉన్నప్పటికీ స్పష్టంగా కనిపించదు. ఈ రోజు ఆలయం ధర్మకర్త పర్యవేక్షణలో ఉంది. ఆలయ సముదాయంలో మూడు మందిరాలు మరియు నలభై గదులు ఉన్నాయి ఇవన్నీ భక్తుల కోసమే ఉంటున్నాయి. భక్తులకు ఆహారం సరఫరా చేయడానికి లంగార్ -సామూహిక వంటశాల- నిర్వహించబడుతోంది.

పరమశివుడి ఆలయం[మార్చు]

పరమశివుడికి చెందినది కావడంతో ఈ ఆలయాన్ని అత్యంత భయభక్తులతో చూస్తుంటారు. అయితే, 1905లో సంభవించిన భూకంపం ఆలయాన్ని స్వల్పంగా దెబ్బతీసింది మరియు ఆలయం కాస్త పక్కకు ఒరిగిపోయింది. కుల్లు లోయలోని దేవతలు ఒక ప్రత్యేక దినం ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారనే వాస్తవం నుంచి మణికరన్ ప్రాధాన్యతను ఎవరైనా అంచనా వేయవచ్చు.

[5]

సూచికలు[మార్చు]

  1. "Manikaran Travel Guide". Retrieved 2006-09-23.
  2. "Lord Shiva, the principle deity of Himachal Pradesh". Retrieved 2006-09-23.
  3. "Hot Springs in Himachal Pradesh". Retrieved 2006-09-23.
  4. మీనాక్షి చౌదురి, డెస్టినేషన్ హిమాచల్, p. 208. రూప్ అండ్ కో, పబ్లిషింగ్ (2006) ISBN 8129107155
  5. అధికారిక వెబ్‌సైట్ గురుద్వారా మణికరన్ సాహిబ్

బాహ్య లింకులు[మార్చు]

Coordinates: 32°01′40″N 77°20′53″E / 32.027871°N 77.348042°E / 32.027871; 77.348042

"https://te.wikipedia.org/w/index.php?title=మణికరన్&oldid=2352089" నుండి వెలికితీశారు