మణిబాల. ఎస్
మణిబాల. ఎస్ ప్రముఖ రంగస్థల నటి.
జననం
[మార్చు]వీరు 1968 నవంబరు 3న శ్రీమతి కామేశ్వరి, వేధనభట్ల నరసింహమూర్తి దంపతులకు కాకినాడలో జన్మించారు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]బాల్యంలోనే కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలను అభ్యసించి హైదరాబాదు రవీంద్రభారతిలోను, బరంపురం, జయపూర్, బిలాస్ పూర్, మొదలగు ఇతర రాష్ట్రాలలోనూ అనేక నృత్య ప్రదర్శనలిచ్చి ప్రముఖుల ప్రశంసలు పొందారు. సంగీతం కూడా అభ్యసించారు. తల్లిదండ్రులనుండి నటనను వారసత్వంగా పుణికిపుచ్చుకున్న మణిబాల, బాల్యంలోనే తారాశశాంకం నాటకంలో బాలచంద్రుడుగా రంగప్రవేశం చేశారు. చింతామణి నాటకంలో చింతామణి, శ్రీకృష్ణ తులాభారం నాటకంలో సత్యభామ, తారాశశాంకం నాటకంలో తార, బాలనాగమ్మ నాటకంలో సంగు మొదలైన ప్రధాన భూమికలు పోషించారు. పి అండ్ టి కల్చరల్ అసోసియేషన్, కాకినాడవారి పుటుక్కు జరజర డుపుక్కుమే, భార్యలూ బహుపరాక్, నారద సంసారం, శకుంతల, శ్రీ రుక్మణీ కళ్యాణం, భక్త పోతన, భలే నాటకంలోనూ, ది యంగ్ మెన్స్ హేపీక్లబ్ (రి), కాకినాడవారి సుభద్రా పరిణయం, మూడో పురుషార్ధం, తాబేలు, క్లైమాక్స్ లోను, శ్రీ శారదా కళామందిర్, పాలకొల్లువారి చంద్రోదయంలోను, కళాప్రియ, రాజమండ్రి వారి ఉలిపికట్టెలోను, మరెన్నో నాటక, నాటికలలోను ప్రధాన పాత్రలు పోషించి, నంది నాటకోత్సవాలతోపాటు అనేక నాటక కళాపరిషత్ ల పోటీలలో పాల్గొని, ప్రముఖుల ప్రశంసలు పొంది, ఆయా నాటక, నాటికలు ఉత్తమ ప్రదర్శన బహుమతులు పొందడానికి దోహదం చేశారు.
అనేక పరిషత్తులలో 40 కి పైగా ఉత్తమ నటి బహుమతులు పొందడంతోపాటు, కన్నాంబ అవార్డు, నాట్య మయూరి అవార్డు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కళాకారుల సంఘం వైస్ ప్రెసిడెంట్ గా, రాజోలు యస్.ఆర్.యల్.జి కళాసమితి, కాకినాడ శాఖకు ప్రెసిడెంట్ గా పనిచేస్తూ, కష్టాలలో ఉన్న కళాకారులను ఆదుకొంటున్నారు.
మూలాలు
[మార్చు]మణిబాల. ఎస్, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 69.