మణి కుమార్ ఛెత్రి
| మణి కుమార్ ఛెత్రి | |
|---|---|
| జననం | 1920 మే 23 తీస్తా వ్యాలీ, డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్, భారతదేశం |
| వృత్తి | కార్డియాలజిస్ట్ |
| తల్లిదండ్రులు | పి. ఎల్. సింగ్ ఛెత్రి హెచ్. ఎమ్. ఛెత్రి |
| పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం |
డాక్లర్ మణి కుమార్ ఛెత్రి (జననం 1920 మే 23), ఒక భారతీయ కార్డియాలజిస్ట్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆరోగ్య సేవల మాజీ డైరెక్టర్, కోల్‌కతాలోని ఐపిజిఎంఇఆర్ అండ్ ఎస్‌ఎస్‌కెఎం హాస్పిటల్ మాజీ డైరెక్టర్.[1] అతను నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు ఎన్నికైన సభ్యుడు. 1974లో భారత ప్రభుత్వం నుండి నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ గ్రహీత.[2]
జీవితచరిత్ర
[మార్చు]మణి కుమార్ ఛెత్రి 1920 మే 23న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ లోని తీస్తా నది లోయలో పి. ఎల్. సింగ్ ఛెత్రి, హెచ్.ఎమ్. ఛెత్రి దంపతులకు జన్మించాడు.[3][4][5] ఆయన డార్జిలింగ్ మునిసిపల్ ప్రైమరీ స్కూల్, టర్న్‌బుల్ హైస్కూల్లో తన ప్రారంభ పాఠశాల విద్యను పూర్తి చేసి, 1936లో డార్జిలింగ్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేసాడు.[1] కోల్‌కతాలోని సెయింట్ పాల్స్ కేథడ్రల్ మిషన్ కాలేజీ నుండి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తరువాత, అతను కోల్‌కతాలోని మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి మెడిసిన్ లో గ్రాడ్యుయేట్ డిగ్రీని, 1956లో ప్రభుత్వ స్కాలర్షిప్ పై లండన్ నుండి ఎఫ్‌ఆర్‌సిపి డిగ్రీని పొందాడు.[1]
ఆయన 1960లో ఐపిజిఎంఇఆర్ అండ్ ఎస్‌ఎస్‌కెఎం హాస్పిటల్ లో కార్డియాలజీ విభాగానికి డైరెక్టర్ కమ్ ప్రొఫెసర్ గా చేరాడు. 1976లో పశ్చిమ బెంగాల్ ఆరోగ్య సేవల డైరెక్టర్ గా నియమించబడ్డాడు. అప్పటి ముఖ్యమంత్రి జ్యోతి బసు వ్యక్తిగత వైద్యుడిగా ఆయన పనిచేసాడు.[6] 1997లో, ధకురియాలో అడ్వాన్స్డ్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (AMRI) కు ప్రారంభ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయన నియమించబడ్డాడు, కానీ అతను ఐపిజిఎంఇఆర్ అండ్ ఎస్‌ఎస్‌కెఎం హాస్పిటల్ తో సలహాదారుగా తన అనుబంధాన్ని కొనసాగించాడు.[7] భారత ప్రభుత్వం 1974లో ఆయనకు పద్మశ్రీ పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది.[8]
ఛెత్రీ ఏప్రిల్ 5, 2026న కోల్‌కతాలోని తన నివాసంలో 105 ఏళ్ల వయసులో మరణించారు.[9] 15 రోజుల క్రితం కిందపడటం వల్ల ఆయన తలకు గాయమైంది.[10]
మూలాలు
[మార్చు]- 1 2 3 "Personality of the Month". Darjeeling Times. 27 December 2007. Archived from the original on 4 January 2017. Retrieved 7 June 2015.
- ↑ "List of Fellows - NAMS" (PDF). National Academy of Medical Sciences. 2016. Retrieved 19 March 2016.
- ↑ "Moni Kumar Chetri after Bidhanchandra Roy in West Bengal's Health Services". ABP Ananda (in Bengali). Today in Focus. 2020-05-31.
{{cite news}}: CS1 maint: others (link) - ↑ "Dazzling Darjeeling". Darjeeling Times. 2 April 2015. Archived from the original on 12 June 2015. Retrieved 9 June 2015.
- ↑ "Notable Indian Gorkhas". World Gorkha Foundation Trust. 2015. Archived from the original on 2 July 2017. Retrieved 9 June 2015.
- ↑ "All India Gorkha League (AIGL) condemns the arrest of Dr. Mani Kumar Chettri". Mungpoo News. 29 January 2012. Retrieved 9 June 2015.
- ↑ "GJM cries foul in arrest of Padmashree Doctor in AMRI case". I Sikkim. 31 January 2012. Retrieved 9 June 2015.
- ↑ "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 11 November 2014.
- ↑ "প্রবীণ চিকিৎসক মণি ছেত্রী প্রয়াত, বয়স হয়েছিল ১০৬ বছর! ছিলেন জ্যোতি বসুর শুশ্রূষার দায়িত্বে". Anandabazar. 5 April 2026. Retrieved 5 April 2026.
- ↑ "Mani Kumar Chetri: বার্ধক্যজনিত অসুস্থতায় ভুগছিলেন, প্রয়াত খ্যাতনামা চিকিৎসক মণি ছেত্রী". ABP. 5 April 2026. Retrieved 5 April 2026.