మణీందర్ సింగ్ ధీర్
| మణీందర్ సింగ్ ధీర్ | |||
| పదవీ కాలం 2014 జనవరి 3 – 2015 ఫిబ్రవరి 23 | |||
| ముందు | యోగానంద్ శాస్త్రి | ||
|---|---|---|---|
| తరువాత | రామ్ నివాస్ గోయల్ | ||
| పదవీ కాలం 2013 – 2015 | |||
| ముందు | తర్విందర్ సింగ్ మార్వా | ||
| తరువాత | ప్రవీణ్ కుమార్ | ||
| నియోజకవర్గం | జాంగ్‌పురా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1952 ఏప్రిల్ 20 న్యూ ఢిల్లీ, భారతదేశం | ||
| మరణం | 2018 సెప్టెంబరు 17 (వయసు: 66)[1] | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
మణీందర్ సింగ్ ధీర్ (20 ఏప్రిల్ 1952 - 17 సెప్టెంబర్ 2018) ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో జాంగ్‌పురా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]మణీందర్ సింగ్ ధీర్ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో జాంగ్‌పురా శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి తర్విందర్ సింగ్ మార్వాపై 1,744 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 జనవరి 3 నుండి 2015 ఫిబ్రవరి 23 వరకు ఢిల్లీ శాసనసభ స్పీకర్‌గా పని చేశాడు.
మణీందర్ సింగ్ ధీర్ నవంబర్ 2014లో ఆమ్ ఆద్మీ పార్టీని వీడి[2] నవంబర్ 21న భారతీయ జనతా పార్టీలో చేరాడు.[3] ఆయన 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో జాంగ్‌పురా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ చేతిలో 20,450 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Former Felhi Assembly Speaker Maninder Singh Dhir dies". UNI. 17 September 2018. Archived from the original on 19 March 2025. Retrieved 19 March 2025.
- ↑ "Former Delhi Speaker Maninder Singh Dhir quits AAP, joins BJP". The Economic Times. 21 November 2014. Archived from the original on 19 March 2025. Retrieved 19 March 2025.
- ↑ "AAP Lawmaker and Former Delhi Speaker MS Dhir Joins BJP" (in ఇంగ్లీష్). NDTV. 21 November 2014. Archived from the original on 19 March 2025. Retrieved 19 March 2025.