మదన్‌రావ్ పిసల్
మదన్‌రావు పిసల్ | |||
మార్కెటింగ్ & స్వయం ఉపాధి శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2003 - 2004 | |||
పదవీ కాలం 1985 – 2009 | |||
ముందు | ప్రాత ప్రావో భోసలే | ||
---|---|---|---|
తరువాత | మకరంద్ జాదవ్ పాటిల్ | ||
నియోజకవర్గం | వాయ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
మరణం | 2012 అక్టోబర్ 23[1] | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | స్వతంత్ర | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ |
మదన్‌రావు గణపతిరావు పిసల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వాయ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మార్కెటింగ్ & స్వయం ఉపాధి శాఖ మంత్రిగా పని చేశాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]మదన్‌రావు పిసల్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పోటీ చేసి 1985 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వాయ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1990, 1995 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మదన్‌రావు పిసల్ ఆ తరువాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా ఐదవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Former minister Madanrao Pisal dies". The Times of India. 23 October 2012. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.
- ↑ "Ministers in Maharashtra's jumbo cabinet fight for office space in overcrowded secretariat" (in ఇంగ్లీష్). India Today. 9 June 2003. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.