Jump to content

మదన్ మోహన్ పూంఛీ

వికీపీడియా నుండి
మదన్ మోహన్ పూంఛీ
28వ భారత ప్రధాన న్యాయమూర్తి
In office
18 జనవరి 1998 – 9 అక్టోబర్ 1998
Appointed byకె.ఆర్.నారాయణన్
అంతకు ముందు వారుజె. ఎస్. వర్మ
తరువాత వారుఆదర్శ్ సేన్ ఆనంద్
వ్యక్తిగత వివరాలు
జననం(1933-10-10)1933 అక్టోబరు 10
పాక్‌పట్టణ్, పంజాబ్
మరణం2015 జూన్ 17(2015-06-17) (వయసు: 81)
జాతీయతభారతీయుడు
కళాశాలఢిల్లీ విశ్వవిద్యాలయం
జనవరి 18,1998న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని అశోక్ హాల్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి మదన్ మోహన్ పూంఛీతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న భారత రాష్ట్రపతి కె. ఆర్. నారాయణన్

మదన్ మోహన్ పూంఛీ (10 అక్టోబర్ 1933-17 జూన్ 2015) 18 జనవరి 1998 నుండి 9 అక్టోబర్ 1998న పదవీ విరమణ చేసే వరకు భారతదేశ 28వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.

ప్రారంభ జీవితం, విద్యాభ్యాసం

[మార్చు]

ఇతని తండ్రి నందలాల్ పూంఛీ ఒక న్యాయవాది. ఇతడు డి.ఎ.వి. కళాశాల పట్టభద్రుడయ్యాడు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రం చదివాడు.

వృత్తి

[మార్చు]

1955లోఇతడు తన తండ్రి వద్ద న్యాయవృత్తిని ప్రారంభించాడు. 1979 అక్టోబర్‌లో పంజాబ్, హర్యానా హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితుడైనాడు.

1989 అక్టోబరులో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితుడై, 1998 జనవరిలో భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. తన సుప్రీంకోర్టు పదవీకాలంలో, ఇతడు 142 తీర్పులను చెప్పాడు. 776 బెంచ్‌లలో కూర్చున్నాడు.[1]

పదవీ విరమణ తరువాత, ఇతడు భారత ప్రభుత్వం ద్వారా సెంటర్ స్టేట్ రిలేషన్స్ కమిషన్ ఛైర్మన్‌గా నియమించబడ్డాడు, తరువాత ఇది పూంఛీకమిషన్ గా ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన విషయాలను నిర్వహిస్తుంది.

ఆయన చండీగఢ్కు చెందిన వ్యక్తి.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఇతడు మీరా పూంఛీని వివాహం చేసుకున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన కుమార్తె ప్రియా టాండన్ బిజెపి రాజకీయ నాయకుడు సంజయ్ టాండన్ ను వివాహం చేసుకున్నది.[2]

మూలాలు

[మార్చు]
  1. "M.M Punchhi". Supreme Court Observer (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-09-30.
  2. "Condolence message" (PDF). highcourtchd.gov.in. 2015-08-05. Retrieved 2024-10-01.

బాహ్య లింకులు

[మార్చు]