మదర్స్ డే (యునైటెడ్ స్టేట్స్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Mother's Day
Mother's Day
Examples of handmade Mother's Day gifts.
జరుపుకునే వాళ్ళుUnited States of America
తేదీSecond Sunday in May
2019 తేదీ[[May సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు]]
2020 తేదీ[[May సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు]]
2021 తేదీ[[May సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు]]
సంబంధంFather's Day, Parents' Day

మదర్స్ డే (తల్లుల దినోత్సవం) అనేది సాధారణంగా తల్లులు, మాతృత్వం మరియు వివాహ బంధాలకు గుర్తుగా మరియు తల్లులు సమాజానికి చేసిన ప్రత్యక్ష సేవలను గుర్తించేందుకు జరుపుకునే ఒక వార్షిక సెలవుదినం. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో (యునైటెడ్ స్టేట్స్) దీనిని మే మాసంలో రెండో ఆదివారం జరుపుకుంటారు.

చరిత్ర[మార్చు]

సెలవుదినాన్ని ఏర్పాటు చేసేందుకు మొదటి ప్రయత్నాలు[మార్చు]

U.S.లో "మదర్స్ డే" యొక్క ఒక పూర్వ రూపాన్ని ఎక్కువగా మహిళా శాంతి సంఘాలు జరుపుకునేవి.[1] మొదట్లో ఈ రోజున ప్రధానంగా అమెరికా పౌర యుద్ధంలో ఉభయ పక్షాల్లో బిడ్డలను కోల్పోయిన తల్లుల సంఘాలు సమావేశమయ్యేవి. 1870 మరియు 1880వ దశకాల్లో కూడా ఇటువంటి పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, అయితే ఈ కార్యక్రమాలేవీ స్థానిక పరిధి దాటి బయటకు విస్తరించలేదు.[2]

1868లో ఎన్ జార్వీస్ "మదర్స్ ఫ్రెండ్‌షిప్ డే"ను ఏర్పాటు చేసేందుకు ఒక కమిటీని సృష్టించారు, పౌర యుద్ధం సందర్భంగా విడిపోయిన కుటుంబాలను తిరిగి కలపడం వీరి ప్రధాన లక్ష్యంగా ఉంది, ఈ కార్యక్రమాన్ని ఆమె ఒక వార్షిక స్మారకదినంగా విస్తరించాలని కోరుకుంది, అయితే ఆమె ఈ వేడుక ప్రాచుర్యం పొందకముందే, 1905లో మరణించారు.[3][2] (ఆమె కూతురు అన్నా జార్వీస్ తరువాత తన తల్లి కృషిని కొనసాగించారు)

న్యూయార్క్ నగరంలో, జూలియా వార్డ్ హోవ్ జూన్ 2, 1872న యుద్ధ వ్యతిరేక కార్యక్రమంగా ఒక "మదర్స్ డే"కు నేతృత్వం వహించారు[1][4][2], దీనితోపాటే మదర్స్ డే ప్రకటన కోరుతూ నిర్వహించిన కార్యక్రమం కూడా జరిగింది. బోస్టన్‌లో ఈ కార్యక్రమం హోవ్ ఆధ్వర్యంలో పదేళ్లపాటు కొనసాగింది, తరువాత కనుమరుగైంది.[5]

కొన్ని సంవత్సరాల తరువాత మదర్స్ డే నిర్వహణ మే 13, 1877న జరిగింది, దీనిని మిచిగాన్‌లోని అల్బియాన్‌లో నిర్వహించారు, నిగ్రహ ఉద్యమానికి సంబంధించిన ఒక వివాదం నేపథ్యంలో దీనిని నిర్వహించడం జరిగింది.[6] ఒక నిగ్రహ-వ్యతిరేక సంఘం తన కుమారుడు మరియు మరో ఇధ్దరు నిగ్రహ ఉద్యమ మద్దతుదారులను ఒక సెలూన్‌లో నిర్బంధించడం, వారిచేత బహిరంగంగా మధ్యం తాగించడంపై తీవ్ర ఆందోళన చెందిన రీవమ్ మైరోన్ డౌగ్‌టెర్టీ చేసిన పూర్తి ధర్మోపదేశాన్ని పూర్తి చేసే బాధ్యతను స్థానిక ప్రముఖురాలు, అల్బియాన్ మార్గదర్శకుడు జూలియట్ కాల్హౌన్ బ్లాక్లే స్వీకరించారు. బ్లాక్లే చర్చి వేదిక నుంచి తనతో చేయి కలపాలని ఆమె పిలుపునిచ్చారు. సేల్స్‌మెన్‌లుగా పనిచేసే బ్లాక్లే ఇద్దరు కుమారులు ప్రతి ఏటా తల్లికి నివాళులు అర్పించేందుకు తిరిగి వచ్చేవారు, అంతేకాకుండా తమ వ్యాపార సంబంధీకులకు ఇదే విధంగా చేయాలని విజ్ఞప్తి చేసేవారు. వారి విజ్ఞప్తులపై, 1880వ దశకం ప్రారంభంలో, అల్బియాన్‌లోని మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చి మే మాసంలో రెండో ఆదివారాన్ని తల్లుల ప్రత్యేక సేవలను గుర్తించే రోజును ఏర్పాటు చేసింది.

1904లో తల్లులను గౌరవిస్తూ ఒక జాతీయ దినాన్ని ఏర్పాటు చేయాలని మొదటి బహిరంగ విజ్ఞప్తి చేసిన వ్యక్తిగా ఫ్రాటెర్నల్ ఆర్డర్ ఆఫ్ ఈగిల్స్ అధ్యుక్షుడు ఫ్రాంక్ ఇ. హెరింగ్ గుర్తించబడుతున్నారు.[7][8]

సెలవుదినం ప్రకటన[మార్చు]

ప్రస్తుత రూపంలో, మదర్స్ డేను అన్నా మేరీ జార్వీస్ ఏర్పాటు చేశారు, తన తల్లి ఎన్ జార్వీస్ మే 9, 1905న మరణించిన తరువాత, ఫిలడెల్ఫియా వ్యాపారి జాన్ వానామేకర్ సాయంతో ఆమె దీనిని సృష్టించారు.[2] మే 12, 1907న పశ్చిమ వర్జీనియాలోని గ్రాఫ్టన్‌లో ఉన్న ఆండ్ర్యూస్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చిలో ఒక చిన్న సేవా కార్యక్రమం జరిగింది, ఇక్కడ అన్నా తల్లి సండే స్కూల్ బోధన చేసేవారు.[2] అయితే మొదటి అధికారిక సేవా కార్యక్రమం మే 10, 1908న ఇదే చర్చిలో జరిగింది, దీనితోపాటు ఫిలడెల్ఫియాలోని వానామేకర్ యొక్క స్టోరులోని వానామేకర్ స్టేడియంలో పెద్ద వేడుక జరిగింది.[2] తరువాత ఆమె U.S. జాతీయ సెలవు దినంగా మదర్స్‌కు గుర్తింపు ఇవ్వాలని మొదటి ప్రచారాన్ని ప్రారంభించారు, తరువాత అంతర్జాతీయ సెలవు దినం గుర్తింపు తీసుకురావడం కోసం కూడా ఆమె ప్రచారాన్ని చేపట్టారు.[1][2]

పశ్చిమ వర్జీనియా రాష్ట్రం 1910న అధికారికంగా సెలవు దినాన్ని ప్రకటించగా, మిగిలిన రాష్ట్రాలు ఆ వెంటనే దీనికి సంబంధించిన ప్రకటనలు చేశాయి.[2] మే 8, 1914న U.S. కాంగ్రెస్, మే నెలలో రెండో ఆదివారాన్ని మదర్స్‌గా గుర్తిస్తూ మరియు దీనికి సంబంధించిన ప్రకటనకు విజ్ఞప్తి చేస్తూ ఒక చట్టాన్ని ఆమోదించింది. మే 9, 1914లన అధ్యక్షుడు వుడ్‌రో విల్సన్ మొదటి జాతీయ తల్లుల దినోత్సవ గుర్తింపు ప్రకటన చేశారు,[9][10] యుద్ధంలో మరణించిన బిడ్డల తల్లులకు అమెరికా పౌరులు నివాళులు అర్పించే రోజుగా దీనిని గుర్తించారు.[9]

1934న, U.S. అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ ఈ సెలవు దినంపై ఒక స్టాంపు విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.[11]

మే 2008న U.S. ప్రతినిధుల సభ మదర్స్ డే స్మారకోత్సవ తీర్మానానికి రెండుసార్లు ఓటు వేశారు[12][13], మొదటి ఓటింగ్‌లో మదర్స్ డేకు మద్దతుగా కాంగ్రెస్ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు.[ఉల్లేఖన అవసరం]

మొదటి వేడుక నిర్వహించబడిన గ్రాఫ్టన్స్ చర్చి ఇప్పుడు అంతర్జాతీయ తల్లుల దినోత్సవ ఆలయంగా మరియు ఒక జాతీయ చారిత్రక ప్రదేశంగా గుర్తించబడుతుంది.[14]

కార్నేషన్‌లు[మార్చు]

కార్నేషన్‌లు (ఒకరకమైన పూలు) మదర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి, అన్నా జార్వీస్ 1908లో మొదటి వేడుక సందర్భంగా 500 కార్నేషన్‌లు సమర్పించడంతో ఈ సంప్రదాయం మొదలైంది.[10][2][14] అనేక మతపరమైన సేవలు కూడా తరువాత కార్నేషన్‌లు ఇచ్చే ఈ ఆచారాన్ని మొదలుపెట్టాయి.[2] అంతేకాకుండా మదర్స్ డే రోజు కార్నేషన్ ధరించే ఆచారానికి కూడా ఇది నాంది పలికింది.[7] ఈ ఆచారాన్ని ప్రారంభించిన అన్నా జెర్వీస్ తన తల్లికి ఈ పువ్వులంటే ఇష్టం కావడంతో కార్నేషన్‌లనే ఎంచుకున్నారు.[15] తెలుపు రంగులోని కార్నేషన్‌ల కొరత కారణంగా, మదర్స్ డే రోజున మరిన్ని రకాల కార్నేషన్‌ల విక్రయాలను పెంచేందుకు, పువ్వుల విక్రేతలు తల్లి జీవించి ఉన్నవారు ఎరుపు కార్నేషన్‌లు ధరించాలని; తల్లి మరణించినట్లయితే తెలుపు కార్నేషన్ ధరించాలని; ప్రచారం చేశారు, ఈ ప్రచారం తిరుగులేకుండా, చర్చిల్లో ప్రసిద్ధ ఆచారాలకు కూడా విస్తరించింది.[7][16]

సంబంధిత కార్యక్రమాలు[మార్చు]

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అన్నా జార్వీస్ తల్లి ఎన్ మేరియా రీవ్ జార్వీస్ (1832-1905) పారిశుద్ధ్యాన్ని మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు స్థానికంగా "మదర్స్ డే వర్క్ క్లబ్‌లు" నిర్వహించారు. టైఫాయిడ్ వ్యాప్తిని నియంత్రించడంలో ఈ క్లబ్‌లు కేంద్ర మరియు సహాయక శిబిరాల్లో సాయం అందించాయి. పౌర యుద్ధం సందర్భంగా విడిపోయిన కుటుంబాలను కలిపేందుకు వారు "మదర్స్ ఫ్రెండ్‌షిప్ డే"ను కూడా నిర్వహించారు.

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 ది హిస్టరీ అఫ్ మదర్స్ డే ది లెగసి ప్రాజెక్ట్, ఒక లెగాసి సెంటర్ (కెనడా) వెబ్‌సైట్ నుంచి
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9 Virgina Bernhard (2002). "Mother's Day". In Joseph M. Hawes, Elizabeth F. Shores (సంపాదకుడు.). The family in America: an encyclopedia (3, illustrated సంపాదకులు.). ABC-CLIO. p. 714. ISBN 1576072320, 9781576072325 Check |isbn= value: invalid character (help).
 3. లరోస్సా, 1997, పేజ్ 172
 4. ది ఫస్ట్ అన్నివర్సారి అఫ్ 'మదర్స్ డే'", ది న్యూయార్క్ టైమ్స్, జూన్ 3, 1874, పే. 8: "'మదర్స్ డే,' Mrs. జూలియా వార్డ్ హొవర్డ్స్[sic] చే 1872, జూన్ 2న సిటీ లో ప్రారంభించబడినది, క్రితం రాత్రి ప్లిమ్ప్టన్ హాల్ మదర్స్ పీస్ మీటింగ్ లో సంబరాలు"
 5. శాంతి స్థాపన కై జూలియా వార్డ్ హోవేస్ మదర్స్ డే , about.com
 6. మదర్స్ డే "అల్బియోన్స్ హిస్టోరికల్ మార్కర్స్"నుండి, మిచిగాన్ బిజినెస్ అల్బియోన్ చే నిర్వహించబడినది
 7. 7.0 7.1 7.2 "Annie's "Mother's Day" History Page". Retrieved 2008-06-26. Cite web requires |website= (help)
 8. "Fraternal Order of Eagles: The History of Mother's Day". మూలం నుండి 2013-08-23 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-01-26. Cite web requires |website= (help)
 9. 9.0 9.1 Rice, Susan Tracey and Robert Haven Schauffler (1915). Mother's day: its history, origin, celebration, spirit, and significance as related in prose and verse. pp. 3–5. in 1914 Congress passed a law, which Wilson signed on May 8, 1914, 'designating the second Sunday in May as Mother's Day', and authorizing and requesting that Wilson issue a proclamation 'calling upon the government officials to display the United States flag on all buildings, and the people of the United States to display the flag at their homes or other suitable places on the second Sunday in May as a public expression of our love and reverence for the mothers of our country.'
 10. 10.0 10.1 టుడే ఇన్ హిస్టరీ: మే 9 లైబ్రరీ అఫ్ కాంగ్రెస్
 11. William H. Young, Nancy K. Young (2007), The Great Depression in America: A Cultural Encyclopedia (illustrated సంపాదకులు.), Greenwood Publishing Group, p. 520, ISBN 0313335206
 12. హౌస్ వోటు #274 (మే 7, 2008) H. Res. 1113: యునైటెడ్ స్టేట్స్ లో మాతృ మూర్తి యొక్క పాత్రను ఆనందిస్తూ మరియు మదర్స్ డే యొక్క భావాలను మరియు లక్ష్యాలను బలపరుస్తూ (వ్యాసం పై వోటు)
 13. హౌస్ వోట్ #275 (మే 7, 2008) టేబుల్ మోషన్ టు రి కన్సిడర్: H RES 1113 యునైటెడ్ స్టేట్స్ లో మాతృ మూర్తి యొక్క పాత్రను ఆనందిస్తూ మరియు మదర్స్ డే యొక్క భావాలను మరియు లక్ష్యాలను బలపరుస్తూ
 14. 14.0 14.1 Andrews Methodist Episcopal Church, National Historic Landmarks program, National Park Service
 15. లై , 1997, పేజ్. 260
 16. లై, 1997, పేజ్. 274

బాహ్య లింకులు[మార్చు]

మూస:U.S. Holidays