మదార్ సాహేబ్ దర్గా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మదార్ సాహేబ్ దర్గా
మదార్ సాహేబ్ దర్గా
మదార్ సాహేబ్ దర్గా
పేరు
ప్రధాన పేరు :మదార్ సాహేబ్ దర్గా
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:యాదాద్రి - భువనగిరి జిల్లా
ప్రదేశం:రామసముద్రం, ఆలేరు
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:హజరత్ బదియొద్దీన్ పీర్ జిందాషా మదార్ సాహేబ్
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ముస్లీం
ఇతిహాసం
నిర్మాణ తేదీ:2009

మదార్ సాహేబ్ దర్గా తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లా, ఆలేరులోని రామసముద్రం సమీపంలో ఉన్న దర్గా. 2009లో వెలసిన దర్గాకు ప్రతి శుక్రవారం దర్గాకు వివిధ గ్రామాల నుంచి భక్తులు వచ్చి, ప్రార్థనలు చేస్తుంటారు.[1]

చరిత్ర

[మార్చు]

అల్లాహ్కు మొదటి ఫకీర్‌గా పేరుపొందిన సిరియా దేశం కువాల్ గ్రామానికి చెందిన హజరత్ బదియొద్దీన్ పీర్ జిందాషా మదార్ సాహేబ్, ప్రజల్లో దైవ మార్గాన్ని ప్రచారం చేయడంకోసం అనేక ప్రాంతాలలో పర్యటించి భారతదేశం, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, కాన్పూర్ జిల్లాలోని మక్కన్‌పూర్‌కు వచ్చాడు. ఆయన మక్కాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రాంతానికి వచ్చి, 596 సంవత్సరాలు జీవించి దైవంలో లీనమైనట్లు ఇక్కడి స్థానికులు చెప్పుకుంటుంటారు. 2009లో తన భక్తుడైన మధు కలలోకి మదార్ సాహేబ్ వచ్చి, రామసముద్రం సమీపంలో వెలిశానని చెప్పడంతో అక్కడి ప్రాంతంలో దర్గాను నిర్మించారని చెబుతారు. మదార్ సాహేబ్ భారతదేశానికి వచ్చేనాటికి ఆయన వయస్సు 292 సంవత్సరాలట.

ఉర్సు ఉత్సవాలు

[మార్చు]

ప్రతి సంవత్సరం జరిగే ఉర్సు ఉత్సవంలో కాటమయ్యనగర్ నుండి దర్గా వరకు గంధం ఊరేగింపు జరుపుతారు. ఆ సమయంలో డప్పుచప్పుళ్లతో భక్తుల దైవ ప్రార్థనలతో చాదర్‌ను సమర్పిస్తారు. హైదరాబాద్‌లోని ప్రముఖ దైవ భక్తుడు తాజ్ బాబా ఈ ఉత్సవాలకు విచ్చేసి, భక్తులకు ఆశీర్వచనాలు అందజేస్తారు. హైదరాబాదు, వరంగల్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట తదితర జిల్లాలకు చెందిన భక్తులు వచ్చి ఈ ఉర్సు ఉత్సవంలో పాల్గొంటారు.[2]

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (18 February 2019). "మత సామరస్యానికి ప్రతీక మదార్ సాహేబ్ దర్గా". Archived from the original on 1 February 2019. Retrieved 1 February 2019.
  2. ఆంధ్రజ్యోతి, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు (1 February 2019). "కోరిన కోర్కెలు తీర్చే మదార్ సాహేబ్ దర్గా". p. పుట 4. Archived from the original on 1 February 2019. Retrieved 1 February 2019.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)