మదాలస శర్మ
మదాలస శర్మ చక్రవర్తి | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | మదాలస, మద్దాలస,[1] మితి[2] |
వృత్తి | మోడల్, నటి |
జీవిత భాగస్వామి | మహాక్షయ్ చక్రవర్తి (m. 2018) |
మదాలస శర్మ భారతీయ చలనచిత్ర నటి. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, జర్మన్, పంజాబీ భాషల చిత్రాలలో నటించింది.[3]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]మదాలస శర్మ 1991, సెప్టెంబరు 26న సినీ నిర్మాత, దర్శకుడు సుభాష్ శర్మ, నటి షీలా శర్మ దంపతులకు ముంబైలో జన్మించింది.[4] మార్బుల్ ఆర్చ్ పాఠశాలలో ఉన్నత విద్యను పూర్తిచేసి, ముంబైలోని మిథిబాయి కాలేజీలో[5] ఇంగ్లీష్ లిటరేచర్[1] ను అభ్యసించింది. చిన్నప్పటినుండి నటి కావాలని ఎల్లప్పుడు కోరుకునేది.[6] కిషోర్ నమిత్ కపూర్ దగ్గర నటన, గణేష్ ఆచార్య, షియామాక్ దావర్ ఆధ్వర్యంలో నృత్యం నేర్చుకున్నది.[4]
వివాహం
[మార్చు]2018, జూలై 10న మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ చక్రవర్తిని వివాహం చేసుకుంది.
సినిమారంగం
[మార్చు]2009లో ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఫిట్టింగ్ మాస్టర్ మదాలస శర్మ తొలి తెలుగుచిత్రం.[7] ఈ చిత్రం విజయవంతమై, ఈవిడ నటనకు ప్రసంశలు అందుకుంది. 2010లో శౌర్య సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈ చిత్రం తన సినీజీవితానికి ఉపయోగపడింది.[8] 2010లో సురేష్ ప్రొడక్షన్స్ ఆలస్యం అమృతం సినిమాలో నటించింది.[9][10][11][12]
కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య[13] ద్వారా బాలీవుడ్ చిత్రరంగంలోకి ప్రవేశించగా 2011, ఫిబ్రవరిలో తొలిచిత్రం ఏంజెల్ విడుదలైంది.[14] తరువాత తెలుగులో మేం వయసుకు వచ్చాం సినిమాలో నటించింది.[15] ఈమె నటనను టైమ్స్ ఆఫ్ ఇండియా,[16] ఫుల్ హైడ్.కాం[17] ప్రస్తావిస్తూ ప్రసంశలు అందించాయి.
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2009 | ఫిట్టింగ్ మాస్టర్ | మేఘన | తెలుగు | |
2010 | శౌర్య | శ్వేత | కన్నడ | |
2010 | ఆలస్యం అమృతం | వైదేహి | తెలుగు | |
2010 | తంబిక్కు ఇంద ఊరు | ప్రియ | తమిళం | |
2011 | ఏంజెల్ | సొనాల్ మహజన్ | హిందీ | |
2012 | మేం వయసుకు వచ్చాం | ఖుషి | తెలుగు | |
2013 | పతఏరం కోడి | భూమిక | తమిళం | |
2013 | ది గర్ల్ విత్ ది ఇండియన్ ఎమెరాల్డ్[18][19] | మాల | జర్మన్ | |
2014 | పటియాల డ్రీమ్స్ | రీత్ | పంజాబీ | |
2014 | సామ్రాట్ & కో[20] | డింపి సింగ్ | హిందీ | |
2014 | చిత్రం చెప్పిన కథ[21] | తెలుగు | ||
2015 | రామ్ లీల[22] | ప్రత్యేక పాత్ర | తెలుగు | |
2015 | పైసా హో పైసా | భూమిక | హిందీ | |
2015 | డవ్ | కన్నడ | ||
2016 | దిల్ సాల సంకీ | హిందీ | ||
సూపర్ 2 | తెలుగు | |||
2018 | మౌసం ఇక్రార్ కె దో పాల్ ప్యార్ కె | అంజలి | హిందీ |
ఇతర వివరాలు
[మార్చు]- వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈటివి తెలుగు సూపర్-2 రియాలిటీ షో నటించి, ప్రజాదరణ పొందింది.
- ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన "ఇమామి నవరత్న టాల్క్" ప్రచార చిత్రంలో నటించింది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Maddalasa adds 'D' for good luck – The Times of India". Timesofindia.indiatimes.com. 11 October 2011. Retrieved 10 September 2019.
- ↑ "Madalsa Sharma turns Mithi". 19 April 2012. Retrieved 10 September 2019.
- ↑ "The Tribune, Chandigarh, India – The Tribune Lifestyle". Tribuneindia.com. 9 January 1974. Retrieved 10 September 2019.
- ↑ 4.0 4.1 P Vasudeva rao. "Eyeing young & bubbly roles". The New Indian Express. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 10 September 2019.
- ↑ "Cinema Connect". The Indian Express. 30 April 2014. Retrieved 10 September 2019.
- ↑ "Cinema Connect | The Indian Express | Page 99". The Indian Express. 30 April 2014. Retrieved 10 September 2019.
- ↑ "Comedy, EVV style". The Hindu. 13 January 2009. Retrieved 11 September 2019.
- ↑ Wire, Sampurn. "Madalasa Sharma's Kannada Debut". The New Indian Express. Archived from the original on 6 మార్చి 2016. Retrieved 11 September 2019.
- ↑ 123telugu. "Alasyam Amrutham Movie Review". 123telugu.com. Retrieved 11 September 2019.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Alasyam Amrutham Review". CineGoer.com. 5 December 2010. Archived from the original on 6 May 2014. Retrieved 11 September 2019.
- ↑ "Thambikku Indha Ooru is ridiculous – Rediff.com Movies". Movies.rediff.com. 8 March 2010. Retrieved 11 September 2019.
- ↑ "'Thambikku Intha Ooru' has no depth – IBNLive". Ibnlive.in.com. 29 April 2010. Archived from the original on 7 మే 2014. Retrieved 11 September 2019.
- ↑ "Times of India Publications". Webcache.googleusercontent.com. 21 October 2010. Archived from the original on 6 July 2009. Retrieved 11 September 2019.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Nowshowing". The Hindu. 12 February 2011. Retrieved 11 September 2019.
- ↑ "Maddalasa is on cloud nine – The Times of India". Timesofindia.indiatimes.com. 28 June 2012. Retrieved 11 September 2019.
- ↑ "Mem Vayasuki Vacham movie review: Wallpaper, Story, Trailer at Times of India". Timesofindia.indiatimes.com. Retrieved 11 September 2019.
- ↑ "Mem Vayasuku Vacham review: Mem Vayasuku Vacham (Telugu) Movie Review - fullhyd.com". Movies.fullhyderabad.com. Retrieved 11 September 2019.
- ↑ "Rajeev Khandelwal deserves the role that he is playing in Samrat & Company – Madalsa Sharma". Tellychakkar.com. 7 April 2014. Retrieved 11 September 2019.
- ↑ "Madalasa To Debut in Kavita Barjatya's Detective thriller 'Samrat & Co' – Telugu Movie News". IndiaGlitz.com. Retrieved 11 September 2019.
- ↑ "Cast & Crew". Archived from the original on 4 మార్చి 2016. Retrieved 11 September 2019.
- ↑ y. sunita chowdhary (9 March 2014). "In Uday's memory". The Hindu. Retrieved 11 September 2019.
- ↑ "Bounce back Role". 25 February 2015. Archived from the original on 1 March 2015. Retrieved 11 September 2019.