మదురై మణి అయ్యర్
మదురై మణి అయ్యర్ | |
---|---|
జననం | సుబ్రమణియన్ 1912 అక్టోబరు 25 |
మరణం | 1968 జూన్ 8 | (వయసు 55)
వృత్తి | కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయకుడు |
తల్లిదండ్రులు | ఎం.ఎస్.రామస్వామి, సుబ్బులక్ష్మి |
మదురై మణి అయ్యర్ (తమిళం: மதுரை மணி ஐயர்) (25 అక్టోబర్ 1912 – 8 జూన్ 1968) ఒక భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఇతడు, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, జి.ఎన్.బాలసుబ్రమణియం ముగ్గురినీ 20వ శతాబ్దపు కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా పిలుస్తారు. ఇతని రాగాలాపన, కల్పనా స్వరాలు, నెరవల్ ఆలాపనలలో నేర్పు ఇతడిని 20వ శతాబ్దపు తొలి సగంలో గొప్ప సంగీతకారుడిగా నిలిపింది.
ఆరంభ జీవితం
[మార్చు]మదురై మణి అయ్యర్ తమిళనాడులోని మదురై పట్టణంలో ఎం.ఎస్.రామస్వామి అయ్యర్, సుబ్బులక్ష్మి దంపతులకు 1912,అక్టోబర్ 25న జన్మించాడు. సంగీత విద్వాంసుడైన విద్వాన్ పుష్పవనం అయ్యర్ ఇతని పెద్దనాన్న. ఇతడు తన 9వ యేటి నుండే సంగీతాభ్యాసం ప్రారంభించాడు. రాజం భాగవతార్ ఇతని తొలి గురువు. తరువాత గాయక శిఖామణి హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతార్ వద్ద శ్రీ త్యాగరాయ సంగీత విద్యాలయంలో చదివాడు.
పురస్కారాలు
[మార్చు]1927లో ఆవడిలో కాంగ్రెస్ సభల సందర్భంగా మహావైద్యనాథ అయ్యర్ నిర్వహించిన 72 మేళరాగ మాలికలో ఇతని పాటకు బహుమతి లభించింది. 1944లో "గానకళాధరర్" బిరుదు, 1959లో సంగీత కళానిధి పురస్కారం, 1960లో రాష్ట్రపతి చేతుల మీదుగా సంగీత నాటక అకాడమీ అవార్డు, 1962లో "ఇసై పేరరిజ్ఞర్" పురస్కారం వంటి అనేక పురస్కారాలు లభించాయి.[1]
స్వయంకృషి
[మార్చు]ఇతనికి సంగీతాభిలాషతో పాటుగా ఇతర విషయాలలో కూడా ఆసక్తి ఉండేది. వాటిలో ఇంగ్లీషు భాషపై అభమానం ఒకటి. ఇతడు పాఠశాల చదువుకు స్వస్తి చెప్పినా స్వయంకృషితో ఆంగ్లభాషపై పట్టు సాధించాడు. ఇతడు మైలాపూరులోని తన ఇంటి నుండి ఇంగ్లీషు పుస్తకాలు చదవడానికి కొన్నెమరా పబ్లిక్ లైబ్రరీకి పరుగులు తీసేవాడు. ఇతడు జార్జి బెర్నార్డ్ షా, చార్లీ చాప్లిన్లను అభిమానించేవాడు. ఇంగ్లీషు, తమిళ వార్తలను తప్పనిసరిగా వినేవాడు. ఇతనికి రాజకీయాలంటే ఆసక్తి ఉంది.[1]
శిష్యులు
[మార్చు]ఇతని శిష్యులు ఎందరో సంగీతరంగంలో రాణించారు. ఇతని శిష్యులలో టి.వి.శంకరనారాయణన్, వెంబు అయ్యర్, తిరువేంగడు ఎ.జయరామన్ మొదలైన వారు ముఖ్యులు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "He charmed young and old alike". The Hindu. 25 October 2002. Archived from the original on 10 ఫిబ్రవరి 2003. Retrieved 10 October 2018.
బాహ్య లంకెలు
[మార్చు]- Articles containing Tamil-language text
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- కర్ణాటక సంగీత విద్వాంసులు
- 1912 జననాలు
- 1968 మరణాలు
- సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు
- సంగీత కళానిధి పురస్కార గ్రహీతలు
- తమిళనాడు గాయకులు