మద్దిల గురుమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గురుమూర్తి
మద్దిల గురుమూర్తి


లోక్‌సభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
02 మే 2021 - ప్రస్తుతం
ముందు బల్లి దుర్గాప్రసాద్‌
నియోజకవర్గం తిరుపతి

వ్యక్తిగత వివరాలు

జననం (1985-06-22) 1985 జూన్ 22 (వయసు 38)[1]
మన్నసముద్రం గ్రామం, ఏర్పేడు మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్‌సీపీ
తల్లిదండ్రులు మునికృష్ణయ్య, రమణమ్మ

గురుమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. లోక్‌సభ సభ్యుడు. 2021లో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంకి జరిగిన ఉపఎన్నికలో లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందాడు.[2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

డా. మద్దిల గురుమూర్తి 1985 జూన్ 22న చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం, మన్నసముద్రం గ్రామంలో మునికృష్ణయ్య, రమణమ్మ దంపతులకు జన్మించాడు. ఆయనకు ఐదుగురు అక్క చెల్లెల్లు ఉన్నారు. ఐదో తరగతి వరకు మన్నసముద్రంలోని ప్రాథమిక పాఠశాలలో, ఆరు నుంచి 10వ తరగతి వరకు బండారుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివాడు. గురుమూర్తి ఇంటర్‌ తిరుపతిలో పూర్తి చేసి, స్విమ్స్‌లో ఫిజియోథెరిపీ కోర్స్ పూర్తి చేశాడు.[3]

రాజకీయ ప్రస్థానం[మార్చు]

గురుమూర్తి విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నపటినుండే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తరచూ కలిసి వచ్చేవారు. వైఎస్ మరణానంతరం జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో ఆయన సోదరి షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టగా ఆమె వెంటే ఉన్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2017లో చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో (2017 నవంబరు- 2019 జనవరి) వరకు 3,648 కి.మీ ఈ పాదయాత్రలో వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్ గా జగన్ తో పాటు ఉన్నాడు.

డా.గురుమూర్తి 2021లో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంకు జరిగిన ఉపఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పై 2,30,572 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.[4] ఆయన గెలిచిన అనంతరం 2021 మే నెలలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిశాడు.[5]

మూలాలు[మార్చు]

  1. The Times of India, eep Raghavan / TNN / Updated: (17 March 2021). "YSR Congress announces Dr Gurumoorthy's name for Tirupati Lok Sabha by-election | Amaravati News - Times of India". Archived from the original on 2 మే 2021. Retrieved 2 May 2021.{{cite news}}: CS1 maint: extra punctuation (link)
  2. Namasthe Telangana (2 May 2021). "తిరుపతిలో 'ఫ్యాన్‌' జోరు.. 2.3 లక్షల మెజార్టీతో గురుమూర్తి ఘనవిజయం". Archived from the original on 2 మే 2021. Retrieved 2 May 2021.
  3. Sakshi (2 May 2021). "తిరుపతి ఉప ఎన్నిక: ఓట్ల సునామీ.. సామాన్యుడిదే గెలుపు". Sakshi. Archived from the original on 2 మే 2021. Retrieved 2 May 2021.
  4. Sakshi (2 May 2021). "తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ భారీ విజయం". Archived from the original on 2 మే 2021. Retrieved 2 May 2021.
  5. Sakshi (3 May 2021). "సీఎం జగన్‌ను కలిసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి". Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.