మద్రాస్ మ్యూజిక్ అకాడమీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మద్రాసు మ్యూజిక్ అకాడమీ
1943లో మద్రాసు మ్యూజిక్ అకాడమీ
స్థాపన1928 ఆగస్టు 18
వ్యవస్థాపకులుఇ.కృష్ణ అయ్యర్,
యు. రామారావు
కేంద్రీకరణసంగీతం, నృత్యం కళల విద్య
ప్రధాన
కార్యాలయాలు
ఆళ్వార్‌పేట, చెన్నై, భారతదేశం - 600 018

మద్రాస్ మ్యూజిక్ అకాడమీ (ఆంగ్లం: Madras Music Academy) అనేది దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి సంగీత అకాడమీలలో ఒకటి. 1920వ దశకం ప్రారంభంలో ఈ సంగీత అకాడమీ (తమిళం: சங்கீத வித்வத் சபை, సంగీత విద్వత్ సభ) ప్రముఖ సంగీత విద్వాంసుల కోసం ఒక సమావేశ మందిరం.[1] ప్రధానంగా కర్ణాటక సంగీత కళారూపాన్ని ప్రోత్సహించడం దీని ఉద్దేశం. 1930లలో భారతీయ శాస్త్రీయ నృత్య రూపమైన భరతనాట్యం పునరుజ్జీవనంలో ఇది కీలక పాత్ర పోషించింది.[2]

మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో టీచర్స్ కాలేజ్ ఆఫ్ కర్నాటిక్ మ్యూజిక్ అని పిలవబడే సంగీత కళాశాలను కూడా నడుపుతున్నారు, దానిని అనేక మంది ప్రముఖ సంగీత విద్వాంసులు నిర్వహిస్తారు. టైగర్ వరదాచారి, అప్ప అయ్యర్, వలాది కృష్ణయ్యర్, ముదికొండన్ వెంకట్రామ అయ్యర్ వంటి సంగీత విద్వాంసులు ఎందరో ఈ కళాశాల ప్రిన్సిపాల్ గా వ్యవహరించినవారిలో ఉన్నారు.[3]

గ్రంధాలయం

[మార్చు]

మ్యూజిక్ అకాడమీ కె. ఆర్. సుందరం అయ్యర్ మెమోరియల్ లైబ్రరీ ని నిర్వహిస్తోంది. దీని కార్యకలాపాల అభివృద్ధికి ఎస్. విశ్వనాథన్ విరాళంగా రూ. 1,00,000 ఇచ్చారు. టీచర్స్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ విద్యార్థులు, సభ్యులు, సంగీత విద్యార్థులు, పరిశోధకులకు నిపుణుల కమిటీ సెషన్‌ల అరుదైన పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్‌లు, టేప్ రికార్డింగ్‌లు వగైరా అందుబాటులో ఉంచారు.

మూలాలు

[మార్చు]
  1. "The Music Academy". Archived from the original on 4 August 2009. Retrieved 27 December 2006.
  2. Janet O'Shea (2007). "Revival Era Dancers at Music Academy". At home in the world: bharata natyam on the global stage. Wesleyan University Press. p. 1975. ISBN 978-0-8195-6837-3.
  3. "The Music Academy". The Hindu. Chennai, India. 1 December 2001.