మధు యాష్కీ గౌడ్
మధు యాష్కీ గౌడ్ | |||
![]()
| |||
నియోజకవర్గము | నిజామాబాదు | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హైదరాబాదు, తెలంగాణ | 15 డిసెంబరు 1960||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | శుచీ మధు | ||
సంతానము | 2 కూతుర్లు | ||
నివాసము | హైదరాబాదు | ||
వెబ్‌సైటు | www.madhuyaskhi.com | ||
September 26, 2006నాటికి | మూలం | వెబ్సైట్ |
మధు యాష్కీ గౌడ్ (జ: 15 డిసెంబర్ 1960) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 2004లో 14వ, 2009లో 15వ లోక్‌సభకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని నిజామాబాదు లోకసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
వ్యక్తిగత విషయాలు[మార్చు]
మధు యాష్కీ గౌడ్ రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో డిసెంబరు 15, 1960 కృష్ణయ్య, సులోచన దంపతులకు జన్మించాడు. ఇతన్ని చిన్నాన్న పోచయ్య, అనసూయ దంపతులు పెంచుకున్నారు. మధు యాష్కీ కి ముగ్గురు అన్నదమ్ములు, ఆరుగురు అక్క చెల్లెలు. వారి తల్లితండ్రులకు ఆయన నాల్గొవ సంతానం. ఆయన పదవ తరగతి వరకు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నాడు. హైదరాబాద్ సిటీ కాలేజీ లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. యాష్కీ 1982లో నిజాం కళాశాల నుండి బి.ఎ., 1985లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి. 1989లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.ఎమ్. పట్టాలు పొందారు. ఆయన 20 జూన్ 1991లో డా. సుచీ దేవి ని వివాహమాడాడు. వీరికి ఇద్దరు కూతుర్లు కోమలి, గగన.
రాజకీయ జీవితం[మార్చు]
మధు యాష్కీ 2004 లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాడు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నుండి 2004లో నిజామాబాదు స్థానం నుండి పోటీ చేసి పార్లమెంట్ లోకి తొలిసారి అడుగు పెట్టాడు. ఆయన రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒక్కడు. 2007లో ఏఐసిసి కార్యదర్శిగా నియమితుడయ్యాడు. 2009 లో నిజామాబాదు స్థానం నుండి తిరిగి లోక్ సభకు ఎన్నికయ్యాడు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. తెలంగాణ వాణి ని ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళేవాడు. 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి అనంతరం 2015లో ఆయనను ఏఐసీసీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ హై కమాండ్ నియమించింది.
జీవిత విశేషాలు[మార్చు]
- మధు యాష్కీ న్యూయార్క్ అటార్నీ, అంతర్జాతీయ న్యాయం, వ్యాపారంలో కన్సల్టంట్ గా అమెరికాలోని ప్రవాస భారతీయులకు సహాయపడుతున్నారు.
- మధు యాష్కీ 2004 లో భారత పార్లమెంటుకు ఎన్నికోబడిన ప్రథమ, ఏకైక ప్రవాస భారతీయుడు.
అవార్డులు[మార్చు]
- ప్రవాస భారతీయునిగా 2005లో ఎన్నుకోబడ్డారు.
సంఘ సేవ[మార్చు]
- మధు యాష్కీ ఫౌండేషన్ అనే సేవా సంస్థను 2003లో స్థాపించి, పేదలకు ఆర్థిక సాయం, పేద విద్యార్ధులకు విద్య చెప్పిస్తున్నారు.
మూలాలు[మార్చు]
- 1960 జననాలు
- 14వ లోక్‌సభ సభ్యులు
- 15వ లోక్‌సభ సభ్యులు
- జీవిస్తున్న ప్రజలు
- భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు
- తెలుగువారిలో న్యాయవాదులు
- నిజాం కళాశాల పూర్వవిద్యార్ధులు
- ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధులు
- నిజామాబాదు జిల్లా రాజకీయ నాయకులు
- నిజామాబాదు జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
- నిజామాబాదు జిల్లా న్యాయవాదులు