మధ్యధరా సముద్రము
మధ్యధరా సముద్రం (ఆంగ్లం : Mediterranean Sea) అట్లాంటిక్ మహాసముద్రమునకు చెందిన ఒక సముద్రం. మధ్యధరా ప్రాంతంచే చుట్టి ఉంది. ఈ సముద్రం పూర్తిగా భూభాగంచే చుట్టబడివున్నది. ఉత్తరాన యూరప్ , దక్షిణాన ఆఫ్రికా ఖండాలు గలవు. మధ్యధరా అనగా "భూభాగం మధ్యలో గలది".[1]. దీని విస్తీర్ణం దాదాపు 25 లక్షల చదరపుకిలోమీటర్లు లేదా 9,65,000 చ.మైళ్ళు. కానీ ఇది అట్లాంటిక్ మహాసముద్రానికి లంకె (జిబ్రాల్టర్ జలసంధి) కేవలం 14 కి.మీ. వెడల్పు కలిగివున్నది. సముద్రాల అధ్యయన శాస్త్రంలో కొన్ని సార్లు దీనిని, "యూరోఫ్రికన్ మధ్యధరా సముద్రం" అనికూడా అంటారు.
సరిహద్దు దేశాలు[మార్చు]
21 దేశాలు మధ్యధరా సముద్రానికి తీరంకలిగి ఉన్నాయి. అవి:
- ఐరోపా (పశ్చిమం నుండి తూర్పునకు) : స్పెయిన్, ఫ్రాన్స్, మొనాకో, ఇటలీ, మాల్టా, స్లొవేనియా, క్రోషియా, బోస్నియా , హెర్జెగొవీనా, మోంటెనీగ్రో, అల్బేనియా, గ్రీసు , టర్కీ యొక్క యూరప్ భాగం.
- ఆసియా (ఉత్తరం నుండి దక్షిణం వైపునకు) : టర్కీ, సైప్రస్, సిరియా, లెబనాన్, ఇస్రాయెల్ , ఆసియా విభాగానికి చెందిన ఈజిప్టు.
- ఆఫ్రికా (తూర్పు నుండి పశ్చిమానికి) : ఈజిప్టు, లిబియా, ట్యునీషియా, అల్జీరియా , మొరాకో.
టర్కీ ప్రధానంగా ఆసియా విభాగంలోనూ , పాక్షికంగా ఐరోపాలోనూ గలదు. ఈజిప్టు ప్రధానంగా ఆఫ్రికాలోనూ దాని సినాయ్ ద్వీపకల్పం ఆసియాలోనూ ఉన్నాయి.
కొన్ని ఇతర భూభాగాలు మధ్యధరా సముద్ర తీరంలో ఉన్నాయి. (పశ్చిమం నుండి తూర్పునకు) :
- జిబ్రాల్టర్ నకు చెందిన బ్రిటిష్ పరదేశ భూభాగం
- స్పానిష్ ఎన్క్లేవ్ లైన స్యూటా , మెలిల్లా , దగ్గరలోని ద్వీపాలు
- అక్రోటిరి , ఢెకేలియాకు చెందిన బ్రిటిష్ సార్వభౌమ ప్రాంతం.
- పాలస్తీనా భూభాగాలు
అండొర్రా, జోర్డాన్, పోర్చుగల్, సాన్ మెరీనో, సెర్బియా , వాటికన్ నగరం, వీటికి మధ్యధరా సముద్రతీరంతో సంబంధం లేకున్ననూ, మధ్యధరాప్రాంతపు దేశాలుగా పరిగణింపబడుతాయి.
మధ్యధరా సముద్రతీరంలో గల పెద్ద నగరాలు :
- మలగా, వాలన్షియా, బార్సెలోనా, మార్సెయిల్లె, నైస్, వెనిస్, జెనీవా, నేపుల్స్, బారి, పాలెర్మో, మెస్సినా, స్ప్లిట్, ఏథెన్సు, ఇస్తాంబుల్, ఇజ్మీర్, అంతాల్యా, లట్టాకియా, బీరుట్, టెల్ అవీవ్, పోర్ట్ సైద్, డామియెట్టా, అలెగ్జాండ్రియా, బెంఘాజీ, ట్రిపోలీ, ట్యూనిస్, , అల్జీర్స్.
మూలాలు[మార్చు]
- ↑ "How did mediterranean sea get its name?". Yahoo Inc. approx. 06 May 2008. Archived from the original on 27 జూలై 2011. Retrieved 06 January, 2008. Check date values in:
|accessdate=
,|date=
, and|archive-date=
(help)
ఇవీ చూడండి[మార్చు]
- మధ్యధరా బేసిన్
- మధ్యధరా వాతావరణం
- మధ్యధరా ప్రాంతపు అడవులు
- మధ్యధరాసముద్రంలోని ద్వీపాలు
- సూయజ్ కాలువ
- సముద్రం
- నల్ల సముద్రం
![]() |
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో మధ్యధరా సముద్రముచూడండి. |
బయటి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Mediterranean Sea. |