మనికాపాల్ భద్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనికాపాల్ భద్ర
జననం
మనికాపాల్ భద్ర
జాతీయతభారతీయులు
వృత్తిమహిళా శాస్త్రవేత్త

మనికాపాల్ భద్ర జీన్స్ సైలెన్సింగ్ ఆవిష్కరనకు ఆద్యులు. ఎంతో ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి తలుపులు తట్టినవారు.[1] ఎయిడ్స్, డెంగ్యూ,మెదడువాపు వంటి ప్రాంణాంతక్వ్క వ్యాధులనునిర్మూలించగల పరిశోధనలకు 2006 లో శ్రీకారం చుట్టిన ఈమె తన భర్త ఉత్పల్ భద్రతో కలసి ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. భర్త సిసిఎంబి(హైదరాబాద్) శాస్త్రవేత్త గాకా మనికాపాల్ ఐఐసిటి (హైదరాబాదు) లో పనిచేస్తున్నారు [2] .

పరిశోధనలు[మార్చు]

జీన్ లైసెన్సింగ్ ఆవిష్కరణకు దంపతులిద్దరూ అవిరామ కృషి జరిపారు. జీవి ఎదుగుదలకు కారణాలను విశ్లేషిస్తున్నారు. కణంలో కేంద్రకం దానిలో డి.ఎన్.ఎ ఉంటుంది. దానిలో ఆర్.ఎన్.ఎ ఉంటుంది. ఈ విధంగా వీరిరువురి పరిశోధన నిరంతరాయంగా కొనసాగింది. "ఆర్ ఎన్ ఎ ఐ" "స్విచ్ ఆన్ అండ్ ఆఫ్" విధానంలో కీలక పాత్ర పోషిస్తున్నదని భద్ర దంపతులు కనుగొన్నారు.

జీన్ సైలెన్సింగ్ చాలా శక్తివంతమైన ఆయుధం. జీన్స్ ను నియంత్రించలేం కనుక మనకు కావససిన సమయంలో వాటిని క్రియారహితంగా ఉంచడం ఉపయోగకరం. దీని ద్వారా వైరస్ వల్ల సంప్రాప్తించే వ్యాధులను నివారించవచ్చు. జీన్ సైలెన్సింగ్ ద్వారా జీన్స్ తో ఆడుకోవచ్చు. అదే దీని బలం. 1995 నుంచి జీన్స్ పైనే ఈ దంపతులు ఇరువురూ పరిశోధనలు చేసారు. దీనిలో ప్రధాన విజయం "జీన్స్ సైలెన్సింగ్".

కేన్సర్ కారకమైన కణ విభజనలో దీని పాత్ర మీద పరిశోధన నిర్వహించింది ప్రధానంగా మానికాపాల్ గారే. క్రోమోజోం కదలికల్లో జీన్స్ ప్రభావం మీద పరిశోధన చేసారు. జీన్ సైలెన్సింగ్ ద్వారా పట్టుపురుగుల్లో వైరస్ వ్యాధులను నియంత్రించే పరిసోధనలు 2006 లో పూర్తయ్యాయి.

డాక్టర్ మానికాపాల్ గారు భర్తతో కలసి పరిశోధనల కోసం అమెరికా వెళ్ళి అక్కడ 8 సంవత్సరాలు ఉన్నారు. వీరి పరిశోధన యొక్క ఫలితాలు అంతర్జాతీయ పత్రిక "సెల్" లో 1997 లో ప్రచురితమైనది. 1998 లో నోబుల్ పురస్కారం పొందిన ఆండ్రూ ఫైర్, క్రెగ్ మిలో లు కృత్రిఅంగా తయారుచేసిన డాబుల్ స్ట్రాండెడ్ ఆర్ ఎన్ ఎ లను ప్రవేశ పెట్టడంలో విజయం సాధించారు. ఆర్ ఎన్ ఎ పరిశోధనల్లో వీరు కూడా మార్గదర్శకులు కావడం చెప్పుకోదగ్గ విషయం. ఈ పరిశోధనకు నోబెల్ రావడం వెనుక వీరి పరిశోధనలు ఒక కారణం కావడం విశేషం.

ఈమె "మాలిక్యులర్" అధ్యయనంలో కొత్త కోణం కనుగొన్నారు. తాను చేసిన ఈ పరిశోధన వివరాలు ఆమె మాటల్లో

ఈ పరిశోధన "బయాలాజికల్ మాలిక్యూల్స్" అధ్యయనంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఆకారం లో తేడా ఉన్నా జన్యువుల్లో మనిషి, ఈగల్లో చాలా సారూప్యత ఉంటుంది. వివిధ వ్యాధులకు కారణమైన జన్యువులు మనిషిలో, ఈగలో 714 సారూప్య జన్యువులు ఉన్నాయి. సాధారణంగా ఒక్కొక్క జన్యువు ఒక దశలో సైలెన్సింగ్ గా మారడంతో జంతువుల్లో వర్ణాలు, అవయవాలు రూపొందుతున్నాయని మా పరిశోధనల్లో తేలింది. ఈగ గుడ్డు పొదగడానికి మూడు వారాలు పడుతుంది. ఈ కాలంలో దానిలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి? అంతవరకు ఏ జన్యువు పాత్ర వహించింది? అనంతరం ఈ జన్యువు ఎందుకు సైలెన్స్ అవుతుంది? దీనిని సైలెన్స్ చేస్తున్న జీవరసాయనమేదని మేము అధ్యయనం చేశాం అందులో 'ఆర్‌ఎన్‌ఏఐ'కీలకంగా పనిచేస్తున్నదని తేలింది.

—మనికాపాల్ భద్ర

ప్రతిజీవి వికాసంలో దాని జన్యువులు కీలకంగా పనిచేస్తాయనే భావనకు ఈమె కొత్త భాష్యం చెప్పారు. జన్యువుల్లో ఉందే ఆర్ ఎన్ ఎ ఎంతర్ ఫియరెన్స్ ప్రతి పరిణామాన్ని నియంత్రిస్తుందని ఈమె తన భర్తతో సంయుక్తంగా జనుగొన్నారు. జంతు, మానవ అభివృద్ధి కార్యక్రమంలో గల సూక్ష్మ రహస్యాలను తెలుసుకొనుటకు ఆర్ ఎన్ ఎ ఐ ని ఉపయోగించి పరిశోధనలు చేశారు. కణ కేంద్రక నిర్మాణంలో జన్యు వ్యక్తీకరణ మీద ఆర్ ఎన్ ఎ వ్యక్తీకరణ మీద విశదీకరిచే అధ్భుత విషయాలను తెలిపే వీరి పరిశోధనా విజయం ప్రపంచ శాస్త్రవేత్తలనే విస్మయపరచింది.

మూలాలు[మార్చు]

  1. "హిందూలో వ్యాసం". Archived from the original on 2012-11-14. Retrieved 2014-03-09.
  2. http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/synthesised-nanoparticle-proves-to-be-effective-drug-delivery-vehicle/article3748886.ece

ఇతర లింకులు[మార్చు]