మనిషి రోడ్డున పడ్డాడు
మనిషి రోడ్డున పడ్డాడు (1976 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | సి.వి.రమణ |
నిర్మాణం | రాజబాబు |
తారాగణం | రాజబాబు |
సంగీతం | శంకర్ గణేష్ |
గీతరచన | మైలవరపు గోపి |
నిర్మాణ సంస్థ | బాబ్ & బాబ్ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
మనిషి రోడ్డున పడ్డాడు 1976 అక్టోబర్ 20 న విడుదలైన తెలుగు సినిమా. బాబ్, బాబ్ రిక్రియేషన్స్ పతాకంపై రాజబాబు నిర్మించిన ఈ సినిమాకు సి.వి.రమణ్‌జీ దర్శకత్వం వహించాడు. ఇది రాజబాబు సొంతంగా నిర్మించి, కథానాయకునిగా నటించిన చిత్రానికి శంకర్-గణేష్ లు సంగీతాన్నందించారు.[1] రాజబాబు స్వయంగా నిర్మించిన ఈ సినిమా వ్యాపారపరంగా అంత విజయవంతం కాలేదు. ఈ చిత్రం పరాజయం రాజబాబును ఆర్థిక సమస్యలలో నెట్టింది.
తారాగణం
[మార్చు]విజయబాబు
, జయసుధ,
మోహన్
రావు గోపాలరావు
రంగనాథ్
నిర్మల
రాథాకుమారి .
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: సి.వి.రమణ్‌జీ
- కథ: రాజబాబు
- మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
- సంగీతం: శంకర్ గణేష్
- ఛాయాగ్రహణం: ఆర్.మధుసూధన్
- కూర్పు: ఆత్మ
- నృత్యాలు: తార
- కళ: భాస్కరరాజు
- నిర్మాత: లక్ష్మి అమ్ములు
- స్టూడియో: బాబ్, బాబ్ రిక్రియేషన్స్
- నిర్మాత: శ్రీమతి లక్ష్మియమ్మలు;
- స్వరకర్త: శంకర్-గణేష్
- విడుదల తేదీ: అక్టోబర్ 20, 1976
- సమర్పించినవారు: రాజబాబు;
- సహ నిర్మాత: J.V.S.R. శాస్త్రి, చిట్టిబాబు (హాస్యనటుడు)
పాటల జాబితా
[మార్చు]1.కోటికొక్కరే పుడతారు పుణ్యమూర్తులు, రచన: మైలవరపు గోపి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
2.అయ్యో మానవుడా కళ్లుండే గుడ్డివాడురా మనిషంటే, రచన: ఎం.గోపి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
3.దూరం దూరం దూరం ఎంత దూరం ఇంకెంత దూరం, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.గేదెల ఆనంద్, పులపాక సుశీల
4.లైఫే లాటరీ వీకైతే బ్యాటరీ బ్రతుకే తల్లక్రిందులవుతుంది, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
[మార్చు]- ↑ "Manishi Roaduna Paddadu (1976)". Indiancine.ma. Retrieved 2020-08-29.
2.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.