మనీ మనీ
మనీ మనీ (1995 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | శివనాగేశ్వరరావు కృష్ణవంశీ (క్రెడిట్స్ లేకుండా)[1] |
తారాగణం | జయసుధ , పరేష్ రావల్ , బ్రహ్మానందం , జె.డి.చక్రవర్తి, చిన్నా సురభి |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | వర్మ క్రియెషన్స్ |
భాష | తెలుగు |
మనీ మనీ రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వర్మ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ తీసిన 1995 నాటి తెలుగు క్రైం కామెడీ సినిమా. 1993లో విడుదలై మంచి విజయం సాధించిన మనీ సినిమాకి ఇది సీక్వెల్. మనీ మనీ సినిమాని కృష్ణవంశీ దర్శకత్వం చేసినా తన పేరు వద్దనడంతో మనీ సినిమా దర్శకుడైన శివనాగేశ్వరరావు పేరు వేశారు.
పాటల జాబితా
[మార్చు]ఆరుకోట్ల ఆంధ్రుల , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: సిరివెన్నెల.
ఏం కొంపమునిగిందొయ్ , మనో, రచన: సిరివెన్నెల.
బెంగపడి సాదించేదేమిటి , జె.డీ.చక్రవర్తి , రామ్ చక్రవర్తి, చిత్ర . రచన: సిరివెన్నెల .
పాడు కబురు ,
లెఫ్ట్ అండ్ రైట్ , రామ్ చక్రవర్తి. రాధిక ,రచన: సిరివెన్నెల.
వూరు వాడా , రామ్ చక్రవర్తి, చిత్ర,రాధిక, స్వర్ణ లత, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి.
కథ
[మార్చు]తారాగణం
[మార్చు]మనీ కథ ముగిసిన దగ్గరే మనీ మనీ సినిమా మొదలుకావడంతో మనీ సినిమాలోని ప్రధాన తారాగణమంతా ఇందులోనూ ఉంది. వీరికి తోడు జేడీ చక్రవర్తికి జోడీగా సుధ పాత్రలో సురభి, మాణిక్యంగానే కాక లాయర్ సాబ్ అనే మరో పాత్రలో తనికెళ్ళభరణి ద్విపాత్రాభినయం, బెనర్జీగా బెనర్జీ వంటి పాత్రలు కొత్తగా చేరాయి.
- జేడీ చక్రవర్తి - చక్రి
- చిన్నా - బోస్
- జయసుధ - విజయ
- పరేష్ రావల్ - సుబ్బారావు (విజయ భర్త)
- రేణుకా సహాని - రేణు (బోస్ ప్రేయసి)
- సురభి జవేరి వ్యాస్ - సుధ
- కోట శ్రీనివాసరావు - అల్లావుద్దీన్
- బ్రహ్మానందం - ఖాన్ దాదా
- కోట శ్రీనివాసరావు
- తనికెళ్ళ భరణి - మాణిక్యం
- శరత్ సక్సేనా - పోలీసు అధికారి
అభివృద్ధి
[మార్చు]రామ్ గోపాల్ వర్మ నిర్మాణం, శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తీసిన మనీ సినిమా 1993లో చిన్న బడ్జెట్ సినిమాగా విడుదలై మంచి విజయం పొందింది. బ్రహ్మానందం పోషించిన ఖాన్ దాదా పాత్ర ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ నేపథ్యంలో అదే పాత్రలతో మనీలో ముగిసిన కథకు కొనసాగింపుగా మనీ మనీ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు నిర్మాత రామ్ గోపాల్ వర్మ. తనవద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న కృష్ణవంశీని మనీ మనీ సినిమా తీయమని ఆదేశించాడు. దర్శకునిగా తొలి సినిమా ఎలాంటిది చేయాలన్నదానిపై ఒక ఆలోచన ఉన్న కృష్ణవంశీ ఈ సినిమా తీస్తానని, అయితే తన పేరు దర్శకునిగా క్రెడిట్స్‌లో వేయరాదని షరతు పెట్టాడు.[1]
ఇతర వివరాలు
[మార్చు]ఈ చిత్రంలోని కొన్ని పాటలకు శ్రీ సంగీతం అందించాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Krishna Vamsi ghost-directed a film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 16 January 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (13 September 2015). "సంగీత దర్శకుడి శ్రీ జయంతి". andhrajyothy.com. Archived from the original on 2 August 2020. Retrieved 2 August 2020.