మనుబోలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మనుబోలు
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో మనుబోలు మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో మనుబోలు మండలం యొక్క స్థానము
మనుబోలు is located in ఆంధ్ర ప్రదేశ్
మనుబోలు
ఆంధ్రప్రదేశ్ పటములో మనుబోలు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°11′00″N 79°53′00″E / 14.1833°N 79.8833°E / 14.1833; 79.8833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము మనుబోలు
గ్రామాలు 18
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 35,828
 - పురుషులు 17,924
 - స్త్రీలు 17,904
అక్షరాస్యత (2001)
 - మొత్తం 61.77%
 - పురుషులు 68.54%
 - స్త్రీలు 55.03%
పిన్ కోడ్ {{{pincode}}}
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మనుబోలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 524 405., ఎస్.టి.డి.కోడ్ = 0861.

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

 1. మనుబోలమ్మ ఆలయo:- ఈ ఆలయ ప్రాంగణంలో 2013 నవంబరు 5న, నాగులశిలా ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆలయంలో ఆంకమ్మ తల్లి పొంగళ్ళు, 2014, జూలై-13, ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఒక వేయిమందికిపైగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. [2] & [6]
 2. గంగమ్మ తల్లి ఆలయo:- ఈ ఆలయంలో వేంచేసియున్న గంగమ్మ తల్లికి ప్రతి సంవత్సరం ఉగాదిరోజున ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. ఆ రోజు రాత్రి, అమ్మవారిని సింహవాహనంపై ఊరేగించి, గ్రామోత్సవం నిర్వహించెదరు. మరుసటిరోజున ఉత్సవం వైభవంగా నిర్వహించెదరు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి మ్రొక్కులు తీర్చుకుంటారు. [3]
 3. శ్రీ కామాక్షీ సమేత సంగమేశ్వరస్వామివారి ఆలయo:- ఈ ఆలయంలో వేంచేసియున్న శ్రీ కామాక్షీ సమేత సంగమేశ్వరస్వామివారి ఉత్సవాలు, 2014,ఏప్రిల్-11 (చైత్ర శుద్ధ ద్వాదశి) శుక్రవారం నాడు ప్రారంభమైనవి. ఉత్సవాలలో భాగంగా ఆ రోజు అర్ధరాత్రి సంగమేశ్వరస్వామివారిని, పూలతో అలంకరించి, రావణసేవ వైభవంగా నిర్వహించారు. తరువాత స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గ్రామోత్సవంలో పాల్గొని స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి మ్రొక్కులు తీర్చుకున్నారు. శనివారం రాత్రి స్వామివారినీ, అమ్మవారినీ, నందివాహనంపై ఉంచి, ప్రత్యేక పూల అలంకరణలు చేసారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేసారు, అనంతరం స్వామి, అమ్మవారల గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవం ఆదివారం సాయంత్రం దాకా కొనసాగినది. ఈ ఉత్సవాలలో భాగంగా, సోమవారం, స్వామి, అమ్మవారల కళ్యాణం కమనీయంగా జరిపించారు. ఈ కళ్యాణోత్సవం తిలకించేటందుకు భక్తులు, జిల్లా నలుమూలలనుండి మనుబోలుకు చేరుకున్నారు. అర్చకులు స్వామివారికీ, అమ్మవారికీ ప్రత్యేక అలంకరణలు చేసి వేదమంత్రాలతో కళ్యాణం జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. దాహంతో ఉన్న భక్తులకు మంచినీటిని అందించారు. ఆదివారం అర్ధరాత్రి మనుబోలు శివాలయం నుండి తేరు బయలుదేరి, సంగమేశ్వరాలయానికి చేరుకున్నది. సోమవారం రాత్రి, రథోత్సవం వైభవంగా నిర్వహించారు. రథాన్ని లాగడానికి భక్తులు పోటీ పడినారు. మిగతా చోట్ల రథాన్ని గొలుసులతో లాగుతారు. కానీ మనుబోలులో అందుకు భిన్నంగా, ప్రజలే రథాన్ని ఆలయానికి లాగుకొని వెళ్ళటం ఆనవాయితీ. ఈ రథోత్సవాన్ని తిలకించేటందుకు, భక్తులు పలు గ్రామాల నుండి మనుబోలు చేరుకున్నారు. [4]
 4. శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. [5]

విద్య[మార్చు]

ఈ గ్రామంలోని జిల్లా పరిషత్తు బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న నాగమణి అను విద్యార్థిని, 2013 నవంబరు 1 న నెల్లూరులో జరిగిన పాఠశాలల ఆటలపోటీలలో ప్రతిభ కనబరిచి, జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎన్నికైనది. [1]

గణాంకాలు[మార్చు]

 • 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
 • జనాభా 8750
 • పురుషుల సంఖ్య 4303
 • స్త్రీల సంఖ్య 4447
 • నివాస గృహాలు 2159
 • విస్తీర్ణం 2290 హెక్టారులు
 • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి, 2013 నవంబరు 5.1వ పేజీ. [2] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి, 2013 నవంబరు 6. 2వ పేజీ. [3] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014,ఏప్రిల్-2; 1వ పేజీ. [4] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి;2014;ఏప్రిల్-13,14&15;2వ పేజీ. [5] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014.మే-23; 2వ పేజీ. [6] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014, జూలై-14, 1వ పేజీ."https://te.wikipedia.org/w/index.php?title=మనుబోలు&oldid=2124828" నుండి వెలికితీశారు