Jump to content

మనోజ్ కుమార్ (బాక్సర్)

వికీపీడియా నుండి
మనోజ్ కుమార్
Personal information
Full nameమనోజ్ కుమార్ కల్తగడియా[1]
Nationalityభారతీయుడు
Citizenshipభారతీయ
Born (1986-12-10) 1986 డిసెంబరు 10 (వయసు: 39)[2]
రజౌండ్,[3] కైథల్, హర్యానా
Height172 cm (5 ft 8 in)[4]
Sport
Sportఅమెచ్యూర్ బాక్సింగ్
Coached byరాజేష్ కుమార్[5]
Medal record
Representing భారతదేశం
కామన్‌వెల్త్ క్రీడలు
Gold medal – first place 2010 ఢిల్లీ లైట్ వెల్టర్‌వెయిట్
Bronze medal – third place2018 గోల్డ్ కోస్ట్వెల్టర్‌వెయిట్


ఆసియా చాంపియన్‌షిప్స్
Bronze medal – third place 2007 ఉలాన్‌బాటర్ లైట్ వెల్టర్‌వెయిట్
Bronze medal – third place 2013 అమ్మాన్ లైట్ వెల్టర్‌వెయిట్


గ్రాండ్ ప్రీ చెక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్
Gold medal – first place 2017[6] లైట్ వెల్టర్‌వెయిట్


దోహా అంతర్జాతీయ టోర్నమెంట్
Gold medal – first place 2015[7] లైట్ వెల్టర్‌వెయిట్


దక్షిణ ఆసియా క్రీడలు
Gold medal – first place 2016 గువాహటి[8] లైట్ వెల్టర్‌వెయిట్


చెక్ గ్రాండ్ ప్రీ
Bronze medal – third place 2009[9] లైట్ వెల్టర్‌వెయిట్

మనోజ్ కుమార్ (జననం: 10 డిసెంబర్ 1986) భారతీయ బాక్సర్. ఆయన 2010 కామన్‌వెల్త్ క్రీడలులో లైట్ వెల్టర్‌వెయిట్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఆయన హర్యానా రాష్ట్రంలోని కైథల్ జిల్లాలోని రజౌండ్ గ్రామానికి చెందినవాడు.[10]

ప్రారంభ జీవితం, బాక్సింగ్‌లో ప్రవేశం

[మార్చు]

మనోజ్ కుమార్ 1986 డిసెంబర్ 10న హర్యానాలోని కైథల్‌కు 30 కి.మీ దూరంలో ఉన్న రజౌండ్ గ్రామంలో జన్మించాడు. ఆయన రోర్ సమాజానికి చెందినవాడు.[11] ఆయన తండ్రి షేర్ సింగ్ భారత సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. తల్లి గృహిణి.

ప్రారంభంలో మనోజ్ కుమార్ అథ్లెట్‌గా తన క్రీడా జీవితం మొదలుపెట్టాడు. ఆయన అన్న రాజేష్ కుమార్ రజౌండ్ ప్రతిభావంతుడైన బాక్సర్‌గా ఎదుగుతున్నాడు. విశ్వవిద్యాలయ చాంపియన్‌షిప్‌లో రాజేష్ స్వర్ణ పతకం గెలిచినప్పటికీ జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు. దీంతో తన తమ్ముడిని బాక్సింగ్‌లో తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు. రాజేష్ స్వయంగా మనోజ్‌కు శిక్షణ ఇచ్చాడు. మరో తమ్ముడు ముఖేష్ కుమార్‌ను కూడా జూడో నుండి బాక్సింగ్‌కు మార్చి, మనోజ్‌కు స్పారింగ్ భాగస్వామిగా తయారు చేశాడు.

ఈ ముగ్గురు ప్రతిరోజూ తమ గ్రామమైన రజౌండ్ నుండి కైథల్‌కు ప్రయాణించి సాధన చేసేవారు. ప్రారంభ దశలో సరైన పరికరాలు లేకపోవడంతో పాత సైకిల్ ట్యూబ్‌ల సహాయంతోనే శిక్షణ పొందారు.[12]

2008లో మనోజ్ కుమార్ తొలిసారిగా జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. అప్పటి విజేత సోమ్ బహాదూర్ పున్‌ను ఓడించి ఈ ఘనత సాధించాడు.[13][14] ఆ విజయానంతరం ఆయన వెనుదిరిగి చూడలేదు. 2010లో జరిగిన 2010 కామన్‌వెల్త్ క్రీడలులో లైట్ వెల్టర్‌వెయిట్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకొని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు.[15]

క్రీడా జీవితం

[మార్చు]

2010 కామన్‌వెల్త్ క్రీడలు

[మార్చు]

2010 కామన్‌వెల్త్ క్రీడలులో మనోజ్ కుమార్ లైట్ వెల్టర్‌వెయిట్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు.

2011 ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్

[మార్చు]

2011లో అజర్‌బైజాన్లోని బాకులో జరిగిన ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్లో మనోజ్ కుమార్ క్వార్టర్ ఫైనల్‌ వరకు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో టామ్ స్టాల్కర్ చేత 18–24 తేడాతో ఓడిపోయాడు.

ఈ పోటీలలో అంతకుముందు ఆయన క్రింది బాక్సర్లపై విజయాలు సాధించాడు:

హు క్వింగ్‌పై సాధించిన ఈ విజయం ద్వారా ఆయన 2012 లండన్ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు.

2012 లండన్ ఒలింపిక్స్

[మార్చు]

లండన్ ఒలింపిక్స్ లో మొదటి రౌండ్‌లో తుర్క్‌మెనిస్తాన్కు చెందిన సెర్దార్ హుదయ్‌బెర్డియేవ్పై 13–7 స్కోరుతో గెలిచి చివరి 16 దశకు చేరుకున్నాడు.

అయితే ప్రీ-క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకర్ టామ్ స్టాల్కర్ (గ్రేట్ బ్రిటన్) చేత ఓడిపోయాడు.[17] తుది స్కోరు 20–16గా నిలిచింది. రౌండ్‌ల వారీగా స్కోర్లు 7–4, 9–5, 4–7గా స్టాల్కర్‌కు అనుకూలంగా నమోదయ్యాయి.[18]

రెండో రౌండ్ స్కోరింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన మనోజ్, తన ఓటమికి "స్పష్టమైన మోసం" కారణమని ఆరోపించాడు.[19]

2014 కామన్‌వెల్త్ క్రీడలు

[మార్చు]

2014 కామన్‌వెల్త్ క్రీడలులో మనోజ్ కుమార్ క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నాడు. అక్కడ సామ్ మ్యాక్స్‌వెల్ చేత ఓడిపోయాడు.[20]

2016 దక్షిణ ఆసియా క్రీడలు

[మార్చు]

2016లో గువాహటిలో జరిగిన 2016 దక్షిణ ఆసియా క్రీడలులో తన బరువు విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు.

2018 ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్

[మార్చు]

2018లో ఢిల్లీలో నిర్వహించిన ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో తన బరువు విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు.

పురస్కారాలు

[మార్చు]

2014లో భారత ప్రభుత్వం మనోజ్ కుమార్‌కు అర్జున అవార్డును ప్రదానం చేసింది. ప్రారంభంలో మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ అధ్యక్షతన ఉన్న ఎంపిక కమిటీ ఆయన పేరును అర్జున అవార్డు కోసం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆయన కోచ్ రాజేష్ కుమార్ రజౌండ్ 2014 ఆగస్టు 26న ఢిల్లీ హైకోర్టులో ఎంపిక కమిటీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

మనోజ్ కుమార్ అర్జున అవార్డుకు అత్యంత అర్హుడైన క్రీడాకారుడని, అయినప్పటికీ ఎంపిక కమిటీ ఆయనను అన్యాయంగా విస్మరించిందని రాజేష్ వాదించారు. అన్ని విషయాలను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు, మనోజ్ కుమార్‌కు అర్జున అవార్డు ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.[21][22][23][24]

2018లో జరిగిన 2018 కామన్‌వెల్త్ క్రీడలులో ఆయన కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "About Boxer Manoj Kumar". Facebook. Boxer Manoj Kumar. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 October 2015.
  2. "Manoj Kumar: Profile 2012 London Olympics". Zee News. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 October 2015.
  3. "Haryana: Boxer Manoj Kumar approaches CM Manohar Lal khattar grievance window, seeks DSP post". The Indian Express. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 October 2015.
  4. "Manoj Kumar". The Times of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 October 2015.
  5. Manoj Kumar Archived 19 సెప్టెంబరు 2016 at the Wayback Machine. nbcolympics.com
  6. "Manoj Kumar strike gold at Czech boxing". The Indian Express. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 July 2017.
  7. "Indian boxers win four gold medals at Doha International". The Times of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 May 2019.
  8. "SAG Boxing". Press Information Bureau. 16 February 2016. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 April 2016.
  9. "Manoj only new face in boxing". The Indian Express. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 October 2015.
  10. Sharma, Nitin (1 September 2010). "Manoj only new face in boxing". Indian Express. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 May 2012.
  11. "Manoj's Mantra: Never back down in face of adversity". Business Standard. PTI. 14 April 2018. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 December 2024. A Maratha in Haryana, how does that even sound? I belong to the Ror community, descendants of the Maratha soldiers who fought Afghans during the battle of Panipat.
  12. Manoj only new face in boxing – Indian Express. Archive.indianexpress.com (1 September 2010). Retrieved on 24 August 2016.
  13. Pun skips replay. The Hindu (12 September 2008). Retrieved on 24 August 2016.
  14. Railways claim National Boxing title – Rediff.com Sports. Rediff.com (12 September 2008). Retrieved on 24 August 2016.
  15. "India boxers' CWG show outstanding: International Boxing Association". The Hindu. Press Trust of India. 17 October 2010. the original నుండి 16 April 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 April 2016.
  16. Manoj Kumar's profile from the AIBA website Archived 19 అక్టోబరు 2012 at the Wayback Machine
  17. Tom Stalker is ranked world number 1 at 64kg in the latest official AIBA World Rankings. Abae.co.uk. Retrieved on 24 August 2016.
  18. Boxer Manoj Kumar Alleges Foul Play in Thomas Stalker Bout at Olympics. Ibtimes.co.in (5 August 2012). Retrieved on 24 August 2016.
  19. Duggal, Saurabh (5 August 2012). "Heartache continues as Manoj cries foul". Hindustan Times. the original నుండి 6 August 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 August 2012.
  20. "Glasgow 2014 – Manoj Manoj Kumar Profile". g2014results.thecgf.com. the original నుండి 12 August 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 June 2016.
  21. Boxer Manoj Kumar drags Arjuna Award selection committee to Delhi High Court over non-selection | Latest News & Updates at Daily News & Analysis. Dnaindia.com (26 August 2014). Retrieved on 24 August 2016.
  22. Arjuna Award snub! Boxer Manoj Kumar to sue Sports Ministry : Other Sports, News – India Today. Indiatoday.intoday.in (20 August 2014). Retrieved on 24 August 2016.
  23. Boxer Manoj Kumar to file case against Sports Ministry – timesofindia-economictimes. Articles.economictimes.indiatimes.com. Retrieved on 24 August 2016.
  24. Papnai, Chaitan (26 November 2014). "Boxer Manoj Kumar finally receives Arjuna Award; lashes out at Kapil Dev". Zee News.