Jump to content

మనోజ్ నైట్ శ్యామలన్

వికీపీడియా నుండి
మనోజ్ నైట్ శ్యామలన్
శ్యామలన్
2018 లో శ్యామలన్
జననంమనోజ్ నెల్లియాట్టు శ్యామలన్
(1970-08-06) 1970 ఆగస్టు 6 (వయసు: 55)
మాహె, పుదుచ్చేరి, భారతదేశం
పౌరసత్వంఅమెరికా
విశ్వవిద్యాలయాలున్యూ యార్క్ యూనివర్సిటీ
వృత్తి
  • Director
  • producer
  • screenwriter
  • actor
క్రియాశీలక సంవత్సరాలు1992–ప్రస్తుతం
సంస్థబ్లైండింగ్ ఎడ్జ్ పిక్చర్స్
భార్య / భర్త
Bhavna Vaswani
(m. 1992)
పిల్లలు3, సలేకా, ఇషానా లతో కలుపుకుని

మనోజ్ నెల్లియట్టు "ఎం. నైట్" శ్యామలన్ (జ: 1970 ఆగస్టు 6 న)[1] అమెరికన్ [2] చిత్రనిర్మాత. అతను అతీంద్రియ కథాంశాలతో కూడిన, ఊహించని మలుపులతో, ముగింపుతో ఉండే సినిమాలు తీస్తాడు. ప్రపంచవ్యాప్తంగా అతని చిత్రాల మొత్తం వసూళ్లు $3.3 బిలియన్ల పైచిలుకు ఉంది.[3] శ్యామలన్ రెండు అకాడమీ అవార్డులు, రెండు BAFTA అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లతో సహా వివిధ ప్రశంసలను అందుకున్నాడు.

శ్యామలన్ భారతదేశంలోని మాహేలో జన్మించి, పెన్సిల్వేనియాలోని పెన్ వ్యాలీలో పెరిగాడు. అతని తొలి చిత్రాలలో ప్రేయింగ్ విత్ యాంగర్ (1992), వైడ్ అవేక్ (1998) ఉన్నాయి. తరువాత అతని అద్భుతమైన చిత్రం ది సిక్స్త్ సెన్స్ (1999) అతనికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కొరకు అకాడమీ అవార్డు నామినేషన్లను సంపాదించి పెట్టింది. ఆ తరువాత అతను అన్బ్రేకబుల్ (2000), సైన్స్ (2002), ది విలేజ్ (2004) లను విడుదల చేశాడు. లేడీ ఇన్ ది వాటర్ (2006), ది హాపెనింగ్ (2008), ది లాస్ట్ ఎయిర్‌బెండర్ (2010), ఆఫ్టర్ ఎర్త్ (2013) వంటి పేలవమైన చిత్రాల తర్వాత, ది విజిట్ (2015), స్ప్లిట్ (2016) లతో అతను కెరీర్‌ను పునర్నిర్మించుకున్నాడు. వీటి తర్వాత గ్లాస్ (2019), ఓల్డ్ (2021), నాక్ ఎట్ ది క్యాబిన్ (2023), ట్రాప్ (2024) లు వచ్చాయి.[4] [5] [6]

శ్యామలన్ 20వ టెలివిజన్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ వేవార్డ్ పైన్స్ (2015–2016), ఆపిల్ టీవీ+ సైకలాజికల్ హారర్ సిరీస్ సర్వెంట్ (2019–2023) లకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతలలో ఒకడు. అప్పుడప్పుడు డైరెక్టర్ గా కూడా పనిచేసాడు. దీనికి ఆయన షోరన్నర్ గా కూడా చేశాడు.[7] [8]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

మనోజ్ నెల్లియాట్టు శ్యామలన్ 1970 ఆగస్టు 6 న భారతదేశంలోని మాహేలో జన్మించాడు. ఇది కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఒక పట్టణం.[9][10] అతని తండ్రి, నెల్లియాట్టు సి. శ్యామలన్, మాహేలో న్యూరాలజిస్టు, జిప్మర్ గ్రాడ్యుయేట్; తండ్రి మలయాళీ. తల్లి, చెన్నైకి చెందిన తమిళురాలు జయలక్ష్మి. ఆమె కూడా డాక్టరే - గైనకాలజిస్టు.[11]

శ్యామలన్‌కు ఆరు వారాల వయసులో, తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్ళారు.[12] శ్యామలన్ పెన్సిల్వేనియాలోని పెన్ వ్యాలీలో హిందూ మతంలో పెరిగాడు.[13] అతను వాల్డ్రాన్ మెర్సీ అకాడమీ అనే ప్రైవేట్ రోమన్ కాథలిక్ గ్రామర్ స్కూల్‌లో చదివాడు. అతనికి, తానో బయటి వ్యక్తిలా అనిపించేది. బాప్టిజం పొందని వారు నరకానికి వెళతారని ఉపాధ్యాయులు చెప్పేవారని గుర్తు చేసుకున్నాడు.[14] అక్కడ విద్యార్థిగా ఉన్నప్పుడు అతను, "మతం తరగతిలో ఉత్తమ గ్రేడ్ సాధించాడు. [అతను] కాథలిక్ కూడా కానం"దున ఒక ఉపాధ్యాయుడు కలత చెందాడు.[14] తరువాత అతను పెన్సిల్వేనియాలోని మేరియన్ స్టేషన్‌లో ఉన్న ఒక ప్రైవేట్ ఎపిస్కోపల్ ఉన్నత పాఠశాల ఎపిస్కోపల్ అకాడమీలో చదివాడు.[15][16]

శ్యామలన్ 1988లో న్యూయార్క్ యూనివర్సిటీ మెరిట్ స్కాలర్‌షిప్ పొందాడు. అతను నేషనల్ మెరిట్ స్కాలర్ కూడా.[17] శ్యామలన్ మాన్‌హట్టన్‌లోని న్యూయార్క్ యూనివర్సిటీ టిష్ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్ పూర్వ విద్యార్థి, [18] అక్కడ అతను 1992లో పట్టభద్రుడయ్యాడు.[19] లకోటా గురించి చదివినప్పుడు, అతను ఒక వ్యక్తిని కనుగొన్నాడు, అతని పేరు లోని నెల్లియాట్టును పలకడానికి వీలుగా 'నైట్' అనేవారు. ఆ తర్వాత అతను దాన్నే తన మధ్య పేరుగా వాడడం మొదలుపెట్టాడు. హిచ్‌కాక్, స్పీల్‌బర్గ్ ల మాదిరిగానే తన పేరుతోనే ప్రేక్షకులను ఆకర్షించాలనే ఉద్దేశం కూడా ఆ పేరుమార్పులో ఉంది.[20] [21]

చిన్న వయసులోనే సూపర్ 8 కెమెరా ఇచ్చినప్పుడు శ్యామలన్ కు ఫిల్మ్ మేకర్ కావాలనే కోరిక ఉండేది. అతని తండ్రి కుటుంబ వైద్య వృత్తిలో చేరాలని కోరుకున్నప్పటికీ, తల్లి మాత్రం అతని అభిరుచిని అనుసరించమని ప్రోత్సహించింది. పదిహేడేళ్ల వయసు వచ్చేసరికి, మనోజ్ నలభై ఐదు హోమ్ సినిమాలు తీశాడు.[22]

కెరీర్

[మార్చు]

సినిమా

[మార్చు]
2008లో ది హ్యాపెనింగ్ కోసం విలేకరుల సమావేశంలో శ్యామలన్.

శ్యామలన్ తన మొదటి చిత్రం, సెమీ-ఆటోబయోగ్రాఫికల్ డ్రామా అయిన ప్రేయింగ్ విత్ యాంగర్‌ను NYUలో విద్యార్థిగా ఉన్నప్పుడే నిర్మించాడు. దీనికోసం కుటుంబం నుండి, స్నేహితుల నుండి అప్పు తీసుకున్నాడు. రెండవ చిత్రం, వైడ్ అవేక్‌ను రచించి దర్శకత్వం వహించాడు. అతని తల్లిదండ్రులు ఈ చిత్రానికి అసోసియేట్ నిర్మాతలు. తన తాత (రాబర్ట్ లాగియా) మరణం తర్వాత దేవుడి కోసం వెతికే పదేళ్ల కాథలిక్ పాఠశాల విద్యార్థి (జోసెఫ్ క్రాస్) కథ అది. ఈ చిత్రానికి సహాయక తారాగణంలో డానా డెలానీ, డెనిస్ లియరీ లు ఆ బాలుడి తల్లిదండ్రులుగా, రోజీ ఓ'డొన్నెల్, జూలియా స్టైల్స్, కామ్రిన్ మ్యాన్‌హీమ్ ఇతర పాత్రల్లోనూ నటించారు. వైడ్ అవేక్‌ను శ్యామలన్ చిన్నప్పుడు చదివిన పాఠశాలలో చిత్రీకరించారు.[23] ఉత్తమ నాటకం, ఉత్తమ ప్రదర్శన కోసం 1999 యంగ్ ఆర్టిస్ట్ అవార్డు నామినేషన్‌లను పొందింది.[24] పరిమితంగా విడుదలైనపుడు, ఈ చిత్రం $6 మిలియన్ల బడ్జెట్‌తో పోలిస్తే థియేటర్లలో $3,05,704 వసూలు చేసింది.[25]

అదే సంవత్సరం శ్యామలన్ స్టూవర్ట్ లిటిల్ కోసం గ్రెగ్ బ్రూకర్‌తో కలిసి స్క్రీన్‌ప్లే రాశాడు. 2013 లో ఫ్రెడ్డీ ప్రింజ్ జూనియర్, రాచెల్ లీ కుక్ నటించిన 1999 నాటి చిత్రం షీస్ ఆల్ దట్ కోసం తాను ఘోస్ట్ రైటర్ అని వెల్లడించాడు.[26] 2013 జూన్ 17 న జాక్ లెచ్నర్ (1990ల చివరలో మిరామాక్స్ డెవలప్‌మెంట్ హెడ్‌గా పనిచేశాడు) శ్యామలన్, ఆర్. లీ ఫ్లెమింగ్, జూనియర్ ఇద్దరూ స్క్రిప్ట్‌కు దోహదపడ్డారని ధృవీకరించారు: మిరామాక్స్ కొనుగోలు చేసిన ప్రారంభ స్క్రిప్ట్‌ను ఫ్లెమింగ్ రాశాడు. శ్యామలన్ దాన్ని తిరగ రాసాడు (ఉత్త "మెరుగు పెట్టడం" కాదది). సినిమా అంతిమ రూపంలో ఇద్దరు రచయితల కంటెంటు ఉందని లెచ్నర్ పునరుద్ఘాటించాడు.[27]

1999 లో శ్యామలన్ రచించి దర్శకత్వం వహించిన, బ్రూస్ విల్లిస్ నటించిన ది సిక్స్త్ సెన్స్ అనే చిత్రం అతనికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. సార్వకాలికంగా అత్యధిక వసూళ్లు చేసిన హారర్ సినిమాల్లో ఇది రెండవ స్థానంలో నిలిచింది.[28] అతను స్పీల్‌బర్గ్ లాగా సినిమాను మార్కెట్ చేయగల దర్శకుడయ్యాడు.[29] ది సిక్స్త్ సెన్స్ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లేతో సహా ఆరు అకాడమీ అవార్డులకు నామినేటైంది.[30]

స్వంత నిర్మాణ సంస్థ

[మార్చు]

శ్యామలన్ నిర్మాణ సంస్థ, బ్లైండింగ్ ఎడ్జ్ పిక్చర్స్,[31] పెన్సిల్వేనియాలోని బెర్విన్‌లో ఉంది.[32] బ్లైండింగ్ ఎడ్జ్ సర్వెంట్, వేవార్డ్ పైన్స్, డెవిల్, ది హాపెనింగ్, లేడీ ఇన్ ది వాటర్, ది విలేజ్, సైన్స్, అన్‌బ్రేకబుల్, ది లాస్ట్ ఎయిర్‌బెండర్, ఆఫ్టర్ ఎర్త్, ది విజిట్, స్ప్లిట్, గ్లాస్, ఓల్డ్‌లను నిర్మించింది. దీనిని శ్యామలన్, అశ్విన్ రాజన్ నిర్వహిస్తున్నారు.[33] 2023 ఫిబ్రవరిలో కంపెనీ, వార్నర్ బ్రదర్స్‌తో బహుళ-సంవత్సరాల ఫస్ట్-లుక్ ఒప్పందంపై సంతకం చేసింది. వాటిలో శ్యామలన్ దర్శకత్వం వహించిన ట్రాప్, 2024 ఆగస్టు 2 న థియేటర్లలో విడుదలైంది. [34]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

శ్యామలన్ న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో కలిసిన సహ విద్యార్థిని భావన వాస్వానీని పెళ్ళి చేసుకున్నాడు.[35] ఈ దంపతులకు దర్శకురాలు ఇషానా, సంగీతకారుడు సలేకాలతో సహా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[36][37] నటుడు రితేష్ రాజన్ అతని బంధువు.[38]

శ్యామలన్, అతని కుటుంబం ఫిలడెల్ఫియా సమీపంలోని రావెన్‌వుడ్‌లో 125 ఎకరాల ఎస్టేటులో, 27 వేల చదరపు అడుగుల 1937 నాటి జార్జియన్ రివైవల్ ఇంట్లో నివసిస్తుంది.[39]

శ్యామలన్‌కు ఫిలడెల్ఫియా 76ers కు సీజన్ టికెట్ ఉంది.[40]

2023 లో శ్యామలన్, పెన్సిల్వేనియాలోని చెస్టర్ కౌంటీలోని విల్లిస్టౌన్ టౌన్‌షిప్‌లోని రాక్‌ఫెల్లర్ కుటుంబం నుండి $24 మిలియన్లకు 218 ఎకరాల ఎస్టేటును కొన్నాడు. ఇందులో ఐదు పాత ఇళ్ళు, రెండు బార్న్‌లు ఉన్నాయి.[41]

శ్యామలన్ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగాడు. కాథలిక్ పాఠశాలలో చదువుకున్నాడు. అతని సినిమాలు చాలావాటిలో క్రైస్తవ ప్రతీకవాదం ఉంటుంది. తాను "చాలా ఆధ్యాత్మిక వ్యక్తిని" అనీ, "కానీ మతపరమైనవాడిని కాద"నీ శ్యామలన్ భావిస్తాడు. "మనం తాకగల, అనుభూతి చెందగల వాటిని మించి, ఆ రంగంలోని విషయాల పట్ల నాకు ఆలోచనలు ఉన్నాయి. కానీ నేను వ్యవస్థీకృత మతానికి పెద్ద అభిమానిని కాదు," అని శ్యామలన్ అన్నాడు. "నేను దాని పట్ల చాలా ఆకర్షితుడనయ్యాను. అంచేత అది నా సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది."[42]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
దర్శకత్వం వహించిన సినిమాలు
సంవత్సరం పేరు పంపిణీదారు
1992 ప్రేయింగ్ విత్ యాంగర్ సినీవిస్టాస్ లిమిటెడ్
1998 వైడ్ అవేక్ మిరామాక్స్ ఫిల్మ్స్
1999 సిక్స్త్ సెన్స్ బ్యూనా విస్టా పిక్చర్స్
2000 సంవత్సరం అన్‌బ్రేకబుల్
2002 సైన్‌స్
2004 గ్రామం
2006 లేడీ ఇన్ ది వాటర్ వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్
2008 ది హ్యాపెనింగ్ 20వ శతాబ్దపు ఫాక్స్
2010 ది లాస్ట్ ఎయిర్‌బెండర్ పారామౌంట్ పిక్చర్స్
2013 ఆఫ్టర్ ఎర్త్ సోనీ పిక్చర్స్ విడుదల
2015 ది విజిట్ యూనివర్సల్ పిక్చర్స్
2016 స్ప్లిట్
2019 గ్లాస్
2021 ఓల్డ్
2023 నాక్ ఎట్ ది క్యాబిన్‌
2024 ట్రాప్ వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ [43]
2026 రిమెయిన్
కీ
ఇంకా విడుదల కాని చిత్రాలను సూచిస్తుంది.

పురస్కారాలు, నామినేషన్లు

[మార్చు]

2008లో, శ్యామలన్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. [44] శ్యామలన్ 72వ బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ పోటీ విభాగానికి జ్యూరీ అధ్యక్షుడిగా ఉన్నాడు.[45]

వివాదం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  2. Huber, Robert; Wallace, Benjamin (2006). The Philadelphia Reader. Temple University Press. p. 197. Then [Shyamalan] changed his name. The idea came when he was applying for American citizenship at age 18.
  3. Colman, David (May 31, 2012). "M. Night Shyamalan's Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on June 2, 2016. Retrieved June 2, 2016.
  4. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  5. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  6. Colman, David (May 31, 2012). "M. Night Shyamalan's Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on June 2, 2016. Retrieved June 2, 2016.
  7. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  8. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  9. Pais, Arthur J (February 20, 2009). "The need for a Dev Patel in the Life of Pi". Rediff.com. Retrieved August 17, 2024.
  10. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  11. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  12. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  13. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  14. 14.0 14.1 Farley, Christopher (November 27, 2000). "Cinema: A New Day Dawns For Night". Time. Archived from the original on September 21, 2021. Retrieved April 4, 2021.
  15. Colman, David (May 31, 2012). "M. Night Shyamalan's Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on June 2, 2016. Retrieved June 2, 2016.
  16. @MNightShyamalan (August 15, 2017). "My cous @teshrajan gave me the anime series #DeathNote for my birthday" (Tweet). Retrieved December 28, 2023 – via Twitter.
  17. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  18. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  19. Colman, David (May 31, 2012). "M. Night Shyamalan's Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on June 2, 2016. Retrieved June 2, 2016.
  20. @MNightShyamalan (August 15, 2017). "My cous @teshrajan gave me the anime series #DeathNote for my birthday" (Tweet). Retrieved December 28, 2023 – via Twitter.
  21. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  22. "M Night Shyamalan Malayali Holloywood Film Director - Pictures Biog and Films". www.learn-malayalam.com. Archived from the original on June 26, 2023. Retrieved 2023-06-26.
  23. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  24. Colman, David (May 31, 2012). "M. Night Shyamalan's Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on June 2, 2016. Retrieved June 2, 2016.
  25. @MNightShyamalan (August 15, 2017). "My cous @teshrajan gave me the anime series #DeathNote for my birthday" (Tweet). Retrieved December 28, 2023 – via Twitter.
  26. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  27. Busis, Hillary (June 17, 2013). "M. Night Shyamalan and 'She's All That': Did he really write it?". Entertainment Weekly. Archived from the original on November 24, 2013. Retrieved January 24, 2021.
  28. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  29. Hiatt, Brian (December 20, 2018). "The Fall and Rise of M. Night Shyamalan". Rolling Stone. Archived from the original on November 26, 2021. Retrieved July 24, 2020.
  30. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  31. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  32. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  33. Colman, David (May 31, 2012). "M. Night Shyamalan's Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on June 2, 2016. Retrieved June 2, 2016.
  34. @MNightShyamalan (August 15, 2017). "My cous @teshrajan gave me the anime series #DeathNote for my birthday" (Tweet). Retrieved December 28, 2023 – via Twitter.
  35. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  36. Colman, David (May 31, 2012). "M. Night Shyamalan's Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on June 2, 2016. Retrieved June 2, 2016.
  37. Crouch, Aaron (2023-02-14). "Ishana Night Shyamalan to Make Feature Directorial Debut with 'The Watchers' for New Line". The Hollywood Reporter (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on February 15, 2023. Retrieved 2023-02-15.
  38. @MNightShyamalan (August 15, 2017). "My cous @teshrajan gave me the anime series #DeathNote for my birthday" (Tweet). Retrieved December 28, 2023 – via Twitter.
  39. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  40. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  41. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  42. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  43. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  44. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.
  45. Colman, David (June 2016). "Filmmaker M. Night Shyamalan's 1930s Pennsylvania Estate". Architectural Digest. Archived from the original on May 23, 2022. Retrieved February 18, 2022.