మన్నె శ్రీనివాస్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మన్నె శ్రీనివాస్ రెడ్డి
మన్నె శ్రీనివాస్ రెడ్డి


లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
  2019- ప్రస్తుతం
ముందు జితేందర్ రెడ్డి
నియోజకవర్గం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 2 జనవరి 1959
గురుకుంట, నవాబ్‌పేట మండలం, మహబూబ్​నగర్​ జిల్లా
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు మన్నె అచ్చిరెడ్డి, సోమేశ్వరమ్మ
జీవిత భాగస్వామి గీతా రెడ్డి
సంతానం 3 కూతుళ్లు
నివాసం కూకట్‌పల్లి, హైదరాబాద్, తెలంగాణ

మన్నె శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు.[1] 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి సభ్యునిగా మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3][4]

జీవిత విషయాలు[మార్చు]

శ్రీనివాస్‌రెడ్డి 1959, జనవరి 2న అచ్చిరెడ్డి, సోమేశ్వరమ్మ దంపతులకు మహబూబ్​నగర్​ జిల్లా, నవాబ్‌పేట మండలంలోని గురుకుంట గ్రామంలో జన్మించాడు. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ నుండి బికాం పూర్తిచేశాడు.[5] కొంతకాలం సివిల్ కన్స్ట్రక్షన్స్ రంగంలోనూ కొంతకాలం వ్యవసాయ శాస్త్రవేత్తగా రసాయన, ఔషధాలలో పనిచేశాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

శ్రీనివాస్‌రెడ్డికి 1995, ఫిబ్రవరి 2న గీతారెడ్డితో వివాహం జరిగింది. వారికి 3 కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ విశేషాలు[మార్చు]

కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన శ్రీనివాస్‌రెడ్డి 2005లో నవాబ్‌పేట మండలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సింగిల్‌ విండో చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ఆ తరువాత 2009 స్థానిక సంస్థల ఎన్నికల్లో గురుకుంట ఎంపీటీసీ సభ్యుడిగా పోటిచేసి గెలిచాడు.[6]

2019 మే నెలలో జరిగిన 17వ లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డి.కె అరుణ పై 56,404 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[7] 2019 సెప్టెంబరు 13 నుండి 2020 సెప్టెంబరు 12 వరకు ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమించబడ్డాడు. 2020, సెప్టెంబరు 13 నుండి విదేశీ వ్యవహారాలపై స్టాండింగ్ కమిటీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ-పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖల సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా నియమించబడ్డాడు.[8]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-07-14. Retrieved 2019-07-14.
  2. "Mahabubnagar (Telangana) Election 2019". Times Now. Retrieved 26 May 2019.
  3. "KCR names 17 TRS candidates for Lok Sabha, drops sitting MPs". Ch Sushil Rao. The Times of India. 22 March 2019. Retrieved 25 March 2020.
  4. "ls shock for TRS, gets only 9 seats out of 17". Deccan Herald. 24 May 2019. Retrieved 25 March 2020.
  5. "Srinivas Reddy Manne | National Portal of India". www.india.gov.in. Retrieved 2021-08-20.
  6. Sakshi (5 April 2019). "కాంగ్రెస్‌ గూటి పక్షులు!". Archived from the original on 1 ఆగస్టు 2021. Retrieved 1 August 2021.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-07-14. Retrieved 2019-07-14.
  8. "Members : Lok Sabha". loksabhaph.nic.in. Retrieved 2021-08-20.