మన్మధ లీల – కామరాజు గోల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మన్మధ లీల – కామరాజు గోల
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
నిర్మాణం ఎం. సత్యనారాయణ ప్రసాద్
వై.రామ కోటేశ్వరరావు
కథ రేలంగి నరసింహారావు
దివాకర్ బాబు
చిత్రానువాదం రేలంగి నరసింహారావు
దివాకర్ బాబు
సంగీతం వాసూరావు
సంభాషణలు దివాకర్ బాబు
ఛాయాగ్రహణం బి.కోటేశ్వరరావు
కూర్పు మురళి రామయ్య
నిర్మాణ సంస్థ రాంగోపాల్ ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

మన్మథలీల కామరాజుగోల 1987 లో విడుదలైన తెలుగు ఫాంటసీ కామెడీ చిత్రం. ఎం. సత్యనారాయణ ప్రసాద్, వై.రామ కోటేశ్వరరావులు రామ్ గోపాల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై, రేలంగి నరసింహారావు దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్, కల్పన ముఖ్య పాత్రల్లో నటించగా, వాసూరావు సంగీతం అందించాడు.[1] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నమోదైంది.[2]

శృంగార పురుషుడైన కామరాజు (రాజేంద్ర ప్రసాద్) శృంగార దేవుడైన మన్మథుడి (చంద్ర మోహన్) శిష్యుడు. అతడికి మన్మథుణ్ణి చూడగల శక్తి ఉంటుంది. కామరాజు మన్మధతో అమ్మాయిలతో తన శృంగార అనుభవాల గురించి చర్చిస్తాడు. ఒకసారి పందేలు కాసే పిచ్చి ఉన్న పందేల పరమశివం (సుత్తి వీరభద్ర రావు) అనే వ్యక్తి కామరాజు అమ్మాయిలతో సరసాలాడుతుండటం గమనించి అందరి ముందు అతన్ని అవమానిస్తాడు. ఇక్కడ కామరాజు కుమార్తె కల్పన (కల్పన)ను తన ప్రేమలో పడేసి ఆమెను పెళ్ళి చేసుకుంటానని కామరాజు పరమశివంతో పందెం కడతాడు. కామరాజు చాలా ప్రయత్నిస్తాడు కాని విఫలమవుతాడు. కల్పన మనస్తత్వాన్ని మార్చడంలో మన్మథుడు అతనికి సాయం చెయ్యడంతో కామరాజూ ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. . పెళ్ళి తరువాత, మన్మథుడికి, కామరాజుకూ మధ్య వివాదం తలెత్తుతుంది. కల్పన ప్రేమను సాధించిన ఘనత తనదంటే తనదని వారి వాదన. ఇక అక్కడ నుండి, ఈ హాస్య కథలో మన్మథుడు కామరాజును ఆటపట్టించడం ప్రారంభిస్తాడు. అతని కుటుంబ జీవితంలో అవాంతరాలు, వివాదాలను సృష్టిస్తాడు. భార్యా భర్తలను విడదీస్తాడు. కామరాజు ఈ సమస్యల నుండి ఎలా బయటపడతాడనేది మిగిలిన కథ.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఆచార్య ఆత్రేయ రాసిన పాటలకు వాసూరావు బాణీలు కట్టాడు.[3]

ఎస్. పాట పేరు సింగర్స్ పొడవు
1 "మన్మథ లీల కామరాజు గోల" ఎస్పీ బాలు 2:50
2 "చుక్కల్లో ఉన్నాది" ఎస్పీ బాలు 3:59
3 "అడుపులేని తాపం" ఎస్పీ బాలు, పి.సుశీల 4:11
4 "నన్ను చీరగా చేసుకో" మనో, పి. సుశీల 4:29
5 "ఇన్నాళ్ళుగ ఈ దాహము" ఎస్పీ బాలు, పి.సుశీల 4:09

మూలాలు

[మార్చు]
  1. "Manmadha Leela Kamaraju Gola (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2021-01-19. Retrieved 2020-08-07.
  2. "Manmadha Leela Kamaraju Gola (Review)". The Cine Bay. Archived from the original on 2021-01-25. Retrieved 2020-08-07.
  3. "Manmadha Leela Kamaraju Gola (Songs)". Cineradham.