మన కుర్రాళ్ళే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మన కుర్రాళ్ళే 2015లో విడుదలైన తెలుగు సినిమా.[1] వీర శంకర్ సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై బీవీఎస్ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు వీర శంకర్ దర్శకత్వం వహించాడు. అర్వింద్ కృష్ణ, రాజ్ కళ్యాణ్, రచనా మల్హోత్రా, శృతిరాజ్, రావు రమేష్, కృష్ణుడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 1 జనవరి 2015న విడుదలైంది.[2]

కథ[మార్చు]

లచ్చు (అరవింద్‌ కృష్ణ), సూరి (కళ్యాణ్‌), అప్పు (వెంకట్‌), దొంగ సుబ్బి (కృష్ణుడు) నలుగురు స్నేహితులు. వీరంతా ఓ గ్రామం నుంచి హైదరాబాద్ వస్తారు. సూరి ఐటీ ప్రొఫెసనల్‌. శారద కూడా ఓ సంస్థలో ఉద్యోగం చేస్తుంటుంది. లచ్చు, సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఓ పబ్‌లో పని చేస్తుంటాడు. శారద (రచన) తో ప్రేమలో పడిన లచ్చు, ప్రేమ పని మీదా, ఉద్యోగం వేటలోనూ పడి సిటీకి వస్తాడు. ఇంకో వైపున సూరి అన్నయ్య రామరాజు (రావు రమేష్‌) సర్పంచ్‌గా పని చేస్తుంటాడు. సెజ్‌ పేరుతో తమ భూముల్ని లాక్కోడానికి ప్రయత్నిస్తోన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాడు .

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: వీర శంకర్ సిల్వర్ స్క్రీన్స్
  • నిర్మాత:బీవీఎస్ శ్రీనివాస్, హరూన్.హెచ్‌ఎస్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వీర శంకర్
  • సంగీతం: రాజ్, గురుకిరణ్, జి.కె, మనోమూర్తి, శివ కాకాని, మోహన్ జోహ్న, బీమ్స్, పవన్‌కుమార్, సాయిరామ్ మద్దూరి [3]
  • సినిమాటోగ్రఫీ: ముజీర్ మాలిక్
  • ఎడిటర్: బస్వ పైడి రెడ్డి

మూలాలు[మార్చు]

  1. The Times of India (2 January 2015). "Mana Kurralle" (in ఇంగ్లీష్). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  2. The Times of India (2015). "Arvind Krishna's Mana Kurralle to release on Jan 1 - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  3. Sakshi (5 August 2014). "ప్రతి ప్రయత్నం కొత్తగానే..." Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.