మైలాదుత్తురై

వికీపీడియా నుండి
(మయిలాడుతురై నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
  ?Mayiladuthurai
తమిళనాడు • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 11°02′N 79°38′E / 11.04°N 79.64°E / 11.04; 79.64Coordinates: 11°02′N 79°38′E / 11.04°N 79.64°E / 11.04; 79.64
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
11 కి.మీ² (4 చ.మై)
• 54.25 మీ (178 అడుగులు)
జిల్లా(లు) Nagapattinam జిల్లా
జనాభా
జనసాంద్రత
84,290 (2001 నాటికి)
• 7,663/కి.మీ² (19,847/చ.మై)
District Collector Jayaraman
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 609 xxx
• +91 4364
• TN 51

మయిలాడుతురై (తమిళం: மயிலாடுதுறை, mayilāṭuturai, formerly Mayuram or Mayavaram) భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో, నాగపట్టణం జిల్లాలోని ఒక నగరం, మరియు పురపాలక సంఘం. ఈ పట్టణం చారిత్రాత్మకమైన తంజావూరు ప్రాంతంలో, కావేరినది ఒడ్డున ఉంది, ఇక్కడ ‘బ్రాహ్మణులు’ మరియు ‘ముస్లింల’ కమ్యూనిటీ ప్రబలంగా వ్యవహరిస్తుంటారు.

మయిలాడుతురై పేరెన్నిక గన్న రైల్వే జంక్షన్, మరియు ఈ ప్రాంతంలో గల తిరుచురాపల్లి, తంజావూరు, కుంభకోణం మరియు తిరువరూర్ వంటి ఇతర పట్టణాలతో చక్కని అనుసంధానం కలిగినది. మయిలాడుతురై AIADMKకు చెందిన O.S. మణియన్ చేత ప్రాతినిధ్యం వహింపబడుచున్న ఒకలోక సభ నియోజకవర్గం [1]

పేరు మరియు ప్రాధాన్యత[మార్చు]

శాపం కారణంగా, పార్వతీ దేవి మయూరంలో, నెమలి రూపంలో జన్మించి మయూరనాధర్ రూపంలోని దేవుడు శివుణ్ణి పూజించిందని పురాణాలు చెబుతున్నాయి. సంస్కృతంలో మయూరం అంటే నెమలి అని అర్ధం, తర్వాత అది తమిళ భాషలోకి మయిలాడుతురైగా అనువదించబడింది. మయిలాడుతురై మహాంగల్ (మయిలాడుతురై యొక్క యోగులు) అనే గ్రంథం ప్రకారం, అనేక మంది యోగులిక్కడ నివసించారు మరియు మయిలాడుతురైలోనూ, చుట్టుపక్కలా అంతిమ శాంతి (సమాధి)ని పొందారు. పెక్కుమంది సిద్ధులు కూడా ఇక్కడ నివసించారు. నేటికి కూడా, మయిలాడుతురై పశ్చిమ శివార్లలో సిధ్దార్కాడు (అనగా "రుషుల వనం") అని పిలవబడే ఒక గ్రామం ఉంది. అది థరుకవనంలో ఒక భాగమని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాక, మైయిలాడుతురై మూడు పదాల సమ్మేళనం. మాయిలి (అనగా నెమలి)+ ఆదుం (అనగా నాట్యం)+ తురై (అనగా చోటు). మొత్తంగా మయిలాడుతురై అనగా నెమలి నాట్యమాడిన చోటు అని అర్థం.

రవాణా మరియు సమాచార ప్రసారం[మార్చు]

మయిలాడుతురై రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో చక్కగా అనుసంధానించబడింది. దీనికి అతి దగ్గరి అంతర్జాతీయ విమానాశ్రయం తిరుచిరాపల్లిలో ఉంది, ఇది మయిలాడుతురైకి 132 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుండి, చెన్నై[2][3] తంజావూరు [2][3], తిరువరూర్,కుంభకోణం,[2][3] తిరుచిరాపల్లి,[3] చిదంబరం,[2] నాగపట్టిణం,[2] కోయంబత్తూర్,[2] మధురై,[2] పాండిచ్చేరి,[2][3] మరియు తిరునల్వేలిలకు ప్రతిరోజూ ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి.[4] మయిలాడుతురై దక్షిణ భారతదేశంలోని పెక్కు ముఖ్యమైన పట్టణాలు మరియు నగరాలతో రైలు మార్గం ద్వారా కలుపబడి ఉంది.[3] మైసూర్-మయిలాడుతురై ఎక్స్‌ప్రెస్, బెంగుళూరు మైసూర్‌లతో కలుపుతుంది. ఇక్కడ నుండి చెన్నై, విల్లుపురంలకు ప్రతీరోజూ నడిచే రైలు సర్వీసులుండగా, వారణాశి మరియు భువనేశ్వర్లకు వారానికి ఒక సర్వీసు ఉన్నవి.

మయూరం నానుడి[మార్చు]

ஆயிரம் ஆனாலும் மாயூரம் ஆகாது “అయిరం అనాలమ్ మయూరం అగాధు” అనేది పెద్దల మాట. అనగా, వెయ్యి ప్రదేశాలు వెయ్యి ప్రత్యేకతలతో ఉండవచ్చుగాక, అవి ఎప్పటికీ మయూరం (మయిలాడుతురై)తో పోల్చదగినవి కూడా కావు అని అర్ధం. మయూరంలోని సాంస్కృతిక వారసత్వాన్ని, వ్యవసాయక మరియు ఆర్ధికాభివృద్ధిని బలపరుస్తూ, ఎత్తిపెడుతూ ఈ నానుడిని, ఇప్పటికీ ప్రబలంగా వాడుతుంటారు.[ఉల్లేఖన అవసరం]

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

పట్టణ కేంద్రభాగంలో అత్యధిక సంఖ్యలో వ్యాపార సంస్థలు ఉన్నాయి. నివాసప్రాంతాలు దాదాపుగా కూరైనాడు (కోరనాడ్) మరియు తిరు-ఇందలూర్ (తిరువిళందూర్)గా పిలువబడే రెండు శివారు ప్రాంతాల్లో ఉన్నాయి.

మయిలాడుతురై బంగారు ఆభరణాల వ్యాపారానికి మరియు వివాహ మందిరాలకి ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణంలో దాదాపు వంద వివాహ మందిరాలున్నాయి. మరియు ఇక్కడ వివాహ ఉత్సవాలకు ఉత్తమ సేవలందించే వర్గాల (చౌకగా & ఎల్లప్పుడూ సర్వసంసిద్ధంగా ఉండే) ప్రజల కారణంగా, వివిధ ప్రాంతాల నుండి వివాహాలు జరిపించుకునేందుకు ప్రజలిక్కడికి వస్తుంటారు.

ఇది (చిదంబరం, విల్లుపురంల మీదుగా) చెన్నైకు, (కుంభకోణం, తంజావూరుల మీదుగా) తిరుచ్చి మరియు తిరవరూర్‌లకు రైల్వే జంక్షన్. (2005-2006) సంవత్సరంలో మయిలాడుతురై - తిరుచ్చి రైల్వే లైన్, బ్రాడ్‌గేజ్‌కు మార్చబడింది. (2006 – 2007) మయిలాడుతురై-విల్లుపురం సెక్షన్, యూనిగేజ్ క్రింది మార్పిడి జరుగుచున్నది. పూంపుహార్, మయిలాడుతురై నుండి 25 కి.మీ.దూరంలో ఉన్నది.

ఇది వ్యవసాయకంగా సారవంతమైన భూమి కాబట్టి ఇక్కడ వ్యవసాయమే ప్రధాన వృత్తి. వరి మరియు చెరకు ఇక్కడ రెండు ప్రధానమైన పంటలు.

మయిలాడుతురైలో రెండు చక్కెర కర్మాగారాలున్నాయి.

ప్రాచీన కాలంలో కూరెయినాడ్ (మయూవరపు ఉపపట్టణం) పట్టు చీర (9 గజాలు) నేతకు ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ తమిళ ప్రజలు “కూరియప్ పట్టు” (కూరై సిల్క్) మరియు కూరియప్ పుదవై (చీర) పదాలని వాడుతుంటారు.

ప్రాంతం[మార్చు]

ఇది మద్రాసుకు దక్షిణంగా దాదాపు 281 కి.మీ. దూరంలో ఉంది, ప్రధాన లైను మీదుగా రైలులోనూ, మరియు రోడ్డు మార్గంలోనూ ఇక్కడికి చేరవచ్చు. చెన్నై నుండి మయిలాడుతురైకు, PONDICHERRY మీదుగా ECR (ఈస్ట్‌కోస్ట్ రోడ్) ద్వారా చేరటం ఉత్తమమైనది.

దక్షిణ రైల్వేలో మయిలాడుతురై పెద్ద జంక్షన్‌లలో ఒకటి, చెన్నై, తిరుచ్చి, తిరువరూర్ మరియు తరంగంపాడిలకు లైను విస్తరించి ఉన్నది. ఈ పట్టణం తంజావూరు జిల్లాలో కలిసి ఉండేది, కానీ ఇప్పుడు నాగపట్టిణం జిల్లాలో భాగమైంది. ఇది జిల్లాలో విద్యా కేంద్రంగా ఉంది, మరియు తమిళనాడులోని 40 పార్లమెంట్ నియోజక వర్గాలలో ఒకటి.

మయిలాడుతురై, కోయంబత్తూర్, బెంగుళూర్ మరియు మైసూర్‌లకు ప్రతిరోజూ రైలు సర్వీసులు కలిగి ఉండి వాటితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంది.

సమీప విమానాశ్రయం - తిరుచ్చి

మయిలాడుతురైకి సమీపంలోని పరిసర గ్రామాలు, ధర్మాపురం, మోంగిల్ తూతమ్, మన్నాంపాండల్, ఆరుపతి, శంభనార్ కోయిల్, మీలపాప్తి.

నాటియాంజలి[మార్చు]

మయిలాడుతురై, నాటియాంజలి పండుగకు కూడా ప్రసిద్ధి చెందింది. చిదంబరంలోని నటరాజ ఆలయం యొక్క నాటియాంజలి వలె, మయిలాడుతురైలో "MAYURA NATIYANJALI" అని పిలవబడే మరియొక నాటియాంజలి ఉంది. మయూర నాటియాంజలిని ప్రతీ సంవత్సరం మహా శివరాత్రి సమయంలో బాహ్య మయూరనాధర్ దేవాలయంలో జరుపుతారు.

ప్రపంచం నలుమూలల నుండి భరత నాట్యం నృత్యకారులు ఈ పండుగలో పాల్గొంటారు. ఈ మయూర నాటియాంజలి, మయిలాడుతురైలోనూ, చుట్టుప్రక్కల గల ప్రజల సహాయ ప్రోత్సాహాలతో పాటుగా, "SAPTHASVARANGAL TRUST" పేరుతో గల సంస్కృతీ సంక్షేమ ధార్మిక సంస్థ చేత నిర్వహింపబడుతుంది. ఇది మైలయ్ సప్తాశ్వరంగల్ సంగీత, కళల అకాడెమీ యొక్క ప్రజల చేత నడపబడుతుంది.

రాజకీయాలు[మార్చు]

మయూరం శాసనసభా నియోజకవర్గం మయిలాడుతురై (లోక్‌సభా నియోజకవర్గం)లో భాగం.[5]

జనాభా[మార్చు]

As of 2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[6] మయిలాడుతురైలో 84,290 జనాభా ఉంది. పురుషులు జనాభాలో 50% ఉండగా, స్త్రీలు 50% ఉన్నారు. మయిలాదుతురై సగటున 80% అక్షరాస్యతను కలిగి ఉంది, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 84%, మరియు మహిళా అక్షరాస్యత 76%గా ఉంది. మయిలాదుతురైలో, జనాభాలో 9% మంది 6 సంవత్సరాల లోపు వయస్సులో ఉన్నారు.

దేవాలయాలు[మార్చు]

ఉథా వైదేశ్వరార్ ఆలయం - ఉథా వైదేశ్వరార్ ఆలయం, ఇది 'బృహదాలయం' అని కూడా పిలువబడుతుంది, ఇది కుట్టాలంలో నెలవై ఉన్న శివుడికి అంకితం చేయబడింది.

మయూరాంథర్ ఆలయం - మయూరాంథర్ ఆలయం ఇది 'బృహదాలయం' అని కూడా పిలువబడుతుంది, ఇక్కడ దేవారాంలో ఉన్న శివుడికి అంకితం చేయబడింది.

వల్లలార్ ఆలయం - కావేరీనది ఉత్తరపుటొడ్డున ఉన్న వల్లలార్ ఆలయం సుప్రసిద్ధ శివాలయం దీనిలోని గురు మందిరం పేరెన్నిక గన్నది.

అయ్యరాప్పర్ ఆలయం - అయ్యరాప్పర్ ఆలయం, శివుడికి అంకితమైన ఈ ఆలయం నగరం నడిబొడ్డున ఉంది. థులా పండగ ఈ ఆలయంలో ప్రముఖ పర్వదినం మరియు దీన్ని అక్టోబర్ నెలలో నిర్వహిస్తారు.

పరిమళ రంగనాథర్ ఆలయం - పరిమళ రంగనాథర్ ఆలయం, తిరులండలూర్ శివారులో విష్ణు దేవాలయం 108 దివ్య దేశమ్‌ లలో ఒకటి.

గంగై కొండ చోళపురం, 1000 సంవత్సరాలకు పైబడిన పాత ఆలయం, ఇది మయిలాడుతురైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది తప్పక చూడవలసిన చారిత్రక స్థలం.

నవగ్రహ ఆలయాలు ఈ పట్టణంలోనే ఉన్నాయి. మయిలాడుతురై పరిధిలో అనేక సుప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి, వీటిలో వైతీశ్వరన్‌కోయిల్ అత్యంత ప్రసిద్ధ దేవాలయం. ఆలయ సముదాయంలో అనేక మంది జ్యోతిష్కులు NADI జ్యోతిదామ్ పేరుతో పిలువబడుతున్న జోస్య పద్ధతిని ఆచరిస్తుంటారు. ఈ పట్టణంలో మేధా దక్షిణామూర్తి ఆలయం కూడా ఉంది. శుక్రన్ ఆలయంతోపాటుగా ఇతర ప్రముఖ దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి, మరియు తిరుక్కడవుర్ ఆలయం అమృతకడేశ్వరార్ మరియు అభిరామి దేవతలకు అంకితం చేయబడింది.

శైవమ్ మరియు తమిళాన్ని వికసింపజేయడానికి ఏర్పడిన సంస్థలలో ఒకటైన ధర్మపురం అధీనం (మఠం) మయూరంకి తూర్పు భాగంలో ఉంది.

తమిళ నెల "ఐపాసి"లో కావేరి నదిలో చేసే "తులా స్నానమ్" కోసం ఇది అత్యంత ప్రముఖ స్థలం.

కులోత్తుంగ చోళుడు నిర్మించిన మూవలుర్ మర్కాసగయ శివాలయం మయిలాడుతురైకి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సెంతాంగుడి దుర్గ ఆలయం - దుర్గ ఆలయం కూడా ప్రసిద్ధమైనది ఇది మయిలాడుతురైకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుకాడియూర్ అభిరామి అమ్మన్ ఆలయం - ఈ ఆలయం శదాబిసేగమ్ మనివిళకు పేరెన్నిక గన్నది. చాలా కాలంగా ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు ఇది మయిలాడుతురైకి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.

తిరుపంబుపురం ఆలయం - తిరుపంబుపురం ఆలయం చాలా ప్రాచీన శివాలయం. ఇది దక్షిణ కాళహస్తిగా పేరొందింది. ఇది పెరాలం సమీపంలో ఉంది (7 కిలోమీటర్లు పడమరగా ఉంది)

తిరుమంచెరి ఆలయం - తిరుమంచెరి ఆలయం చాలా ప్రసిద్ధి గాంచింది, ఇది మయిలాదుతురైకి అతి దగ్గరలో ఉంది- ఈ ఆలయం గురించి మరిన్ని వివరాలను మీకు www.thirumanancheri.info తెలుపుతుంది.

కన్నగి ఆలయం - మెలైయూర్ లోని కన్నగి ఆలయం మయిలాదుతురై నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూంపుహార్ మెలైయూర్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పునుగైశ్వరార్ ఆలయం - పునుగైశ్వరార్ ఆలయం శివుడికి & తన దేవేరి శాంత నాయకికి అంకితం చేయబడింది. ఇది కొరనాడ్‌ వద్ద ఉంది. సివెట్ పిల్లిచే పూజించబడింది.

'శ్రీ వనముట్టి పెరుమాళ్, కొళికుట్టి మాయావరం సమీపంలో (కుంభకోణం రోడ్‌లో పట్టణానికి 5 కిలోమీటర్ల వెలుపల ఉంది), ఇది విశిష్టమైన దేవాలయం, శ్రీనివాస పెరుమాళ్ ఇక్కడ ప్రధాన దేవుడు (అతడు ఎదుగుతున్నందున "వనమ్-ము్ట్టి" పెరుమాల్‌గా అభిమానిస్తున్నారు) 16 అడుగుల ఎత్తుతో ఉన్నాడు బోల్డ్ టెక్స్ట్ ఎత్తు. ఇక్కడ అత్యంత ప్రత్యేక అంశం ఏమిటంటే మొత్తం విగ్రహం ఒకే ఒక అత్తి చెట్టు నుంచి చెక్కబడింది, దీని నిజమైన వేళ్లు ఇటాలిక్ టెక్స్ట్ కింద ఈరోజుకీ విస్తరిస్తున్నాయి. కొయ్యమీద విగ్రహం అజంతా పెయింటింగులుతో అద్భుతంగా పూయబడింది, ఈ ఆలయం 1500 సంవత్సరాల క్రితం చోళ రాజవంశ కాలంలో నిర్మించబడినప్పటికీ ఈనాటికీ ఇది ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది. ఇది పవిత్ర దేవుడి నిలయంగా మాత్రమే కాకుండా సుసంపన్నమైన వాస్తు నైపుణ్యానికి కూడా ఈ ఆలయం ఒక ముఖ్య వనరుగా ఉంది.

విద్య[మార్చు]

విద్యావంతమైన ఒక జిల్లాకు మయిలాడుతురై ప్రధానకార్యాలయం.

కళాశాలలు[మార్చు]

 • A.G.R.A. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, చోళంపట్టయ్
 • A.V.C. కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, మయిలాడుతురై
 • A.V.C. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
 • A.V.C. కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్
 • ధర్మపురం అధీనం ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్ ధర్మపురం, మయిలాడుతురై
 • జ్ఞానాబికై కాలేజ్ ఫర్ విమెన్ - రాజన్ తోట్టమ్, మయిలాడుతురై
 • A.R.C. విశ్వనాధన్ ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్, మయిలాడుతురై
 • J.M.H అరబిక్ కాలేజ్, మయిలాడుతురై
 • పూంపుహార్ కాలేజ్, మెలయ్యూర్, మయిలాడుతురై
 • T.B.M.L. కాలేజ్, పెరియార్

విద్యాసంస్థలు[మార్చు]

 • RAJ మెట్రిక్యులేషన్ హైయర్ సెకండరీ స్కూల్, కొరనాడ్
 • IDEAL(CBSE), మయిలాడుతురై
 • DBTR నేషనల్ హైయ్యర సెకండరీ స్కూల్
 • కిట్టప్ప మునిసిపల్ హైయ్యర్ సెకండరీ స్కూల్
 • Govt. గర్ల్స్ హైయ్యర్ సెకండరీ స్కూల్
 • St. పాల్స్ గర్ల్స్ హైయ్యర్ సెకండరీ స్కూల్
 • గురుజ్ఞాన సంబంధర్ మిషన్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్
 • అరివాలయం మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్
 • శ్రీ గురు జ్ఞాన సంబంధర్ హయ్యర్ సెకండరీ స్కూల్, ధర్మపురం
 • రోటరీ క్లబ్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్
 • సిల్వర్ జూబ్లీ మెట్రిక్యులేషన్ హయ్యర సెకండరీ స్కూల్
 • A.R.C.కామాక్షి మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్
 • మూవలూర్ ముత్తట్టి రామతీర్థమ్ అమ్మియార్ హయ్యర్ సెకండరీ స్కూల్
 • అజాద్ స్కూల్
 • నస్రుల్ ముస్లమిన్ హయ్యర్ సెకండరీ స్కూల్, నిదుర్, మయిలాడుతురై
 • ఆల్ హాజీ మెట్రిక్యులేషన్ స్కూల్, నిదుర్, మయిలాడుతురై

సాంస్కృతిక సంక్షేమ ట్రస్టు[మార్చు]

 • సప్తస్వరంగళ్ ట్రస్ట్, మయిలాడుతురై.

సంగీత పాఠశాలలు[మార్చు]

 • మైలై సప్తస్వరంగళ్_ఫైన్ ఆర్ట్స్ అకాడమీ, పాలకరై, మయిలాడుతురై.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • మయిలాడుతురై (లోక్‌సభ నియోజకవర్గం)

సూచనలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
 1. http://www.thanjavur.com/election99.htm
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 లోన్లీ ప్లానెట్, pp 1068
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 David Abram (2003). The Rough Guide to South India. Rough Guides. p. 475. ISBN 1-84353-103-8, ISBN 978-1-84353-103-6.
 4. "Origin of Kumbakonam Municipality". Government of Tamil Nadu. Cite web requires |website= (help)
 5. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Retrieved 2008-10-12.
 6. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. మూలం నుండి 2004-06-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-11-01. Cite web requires |website= (help)