మయూరి క్యాతరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మయూరి క్యాతరీ
మయూరి క్యాతరీ (2018)
జననం (1992-07-11) 1992 జూలై 11 (వయసు 32)
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుమయూరి
క్రియాశీల సంవత్సరాలు2015–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅరుణ్ రాజ్ (2020)[1]

మయూరి క్యాతరీ (జననం జూలై 11, 1992) కన్నడ సినిమా నటి, మోడల్. అశ్వినీ నక్షత్ర అనే కన్నడ సీరియల్ తో తన నట జీవితాన్ని ప్రారంభించింది.[2] కృష్ణలీల అనే కన్నడ సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించింది. ఇష్టకామ్య, నటరాజ సేవ, రుస్తుమ్‌ సినిమాలలో నటించింది.

తొలి జీవితం

[మార్చు]

మయూరి 1992, జూలై 11న ప్రకాష్ - గీత దంపతులకు కర్ణాటకలోని హుబ్లీలో జన్మించింది. [3] హుబ్లీ సెయింట్ మైఖేల్స్‌ పాఠశాలలో ప్రాథమిక విద్యను చదివి, హుబ్లీలోని ఫాతిమా కళాశాలలో ప్రీ-యూనివర్సిటీ పూర్తిచేసింది. తరువాత హుబ్లీలోని ఆక్స్‌ఫర్డ్ కళాశాల నుండి కామర్స్‌లో పట్టభద్రురాలైంది.

వృత్తిరంగం

[మార్చు]

మయూరి తొలినాళ్ళలో నాలుగేళ్ళపాటు యాంకర్‌గా పనిచేసింది. మొదట కన్నడ సీరియల్ అశ్విని నక్షత్రలో సూపర్ స్టార్ భార్య అశ్విని పాత్రను పోషించింది. 2015లో మయూరి కన్నడ సినిమారంగంలోకి అడుగుపెట్టింది. మయూరి నటించిన కృష్ణలీల సినిమా విజయవంతంగా 100 రోజులు ప్రదర్శన జరుపుకుంది. నాగతిహళ్లి చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఇష్టకామ్య సినిమాలో కావ్యశెట్టితోపాటు విజయ్ సూర్య[4] సరసన నటించింది.[4] పునీత్ రాజ్‌కుమార్ సమర్పణలో నటరాజ సర్వీస్ అనే సినిమాలో శరణ్‌తో కలిసి నటించింది.[5]

నటించినవి

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర(లు) ఇతర వివరాలు మూలాలు
2015 కృష్ణ లీల లీల ప్రధాన పాత్రలో ఉత్తమ ప్రదర్శన ఐఫా అవార్డుకు నామినేట్ చేయబడింది
ఉత్తమ నటిగా కన్నడ ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ చేయబడింది
[6]
2016 ఇష్టకామ్య ఆచారి [7]
నటరాజ సేవ సహానా [3]
2017 కరియా 2 జానకి [8]
2018 రాంబో 2 ఆమెనే అతిథి పాత్ర
జానీ జానీ ఎస్ పాపా ఏంజెల్ అతిథి పాత్ర
8ఎంఎం బుల్లెట్ స్మిత
2019 రుస్తుం అమ్ము
నాన్న ప్రకార విస్మయ
ఆటకుంటూ లేకకిల్లా మేఘన
2020 మౌనం మయూరి
2021 పొగరు శివ సోదరి

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం సీరియల్ పాత్ర ఛానల్ ఇతర వివరాలు
2015 అశ్వినీ నక్షత్ర అశ్విని కలర్స్ కన్నడ [2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మయూరికి 2020, జూన్ 12న బెంగళూరులోని శ్రీ తిరుమలగిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అరుణ్‌తో వివాహం జరిగింది.[9]

మూలాలు

[మార్చు]
  1. "Mayuri Kyatari gets married in an intimate ceremony". Times of India. Retrieved 2022-02-07.
  2. 2.0 2.1 "COLORS KANNADA ASHWINI NAKSHATRA - ASHWINI NAKSHATRA EPISODE - ASHWINI NAKSHATRA". colorskannada.com. Archived from the original on 2015-11-18. Retrieved 2022-02-07.
  3. 3.0 3.1 "Sharan and Mayuri are from the same area in Hubballi". The Times of India. 24 January 2017. Retrieved 2022-02-07.
  4. 4.0 4.1 "ಎರಡು ವರ್ಷದ ನಂತ್ರ ಮತ್ತೆ ಬಂದ ನಾಗತಿಹಳ್ಳಿ ಚಂದ್ರಶೇಖರ್". kannada.filmibeat.com. Retrieved 2022-02-07.
  5. "Mayuri to romance Sharan". The Times of India. Retrieved 2022-02-07.
  6. "What is the real-life Krishna Leela story?". The Times of India. 20 March 2015. Retrieved 2022-02-07.
  7. "Ready for the litmus test". The Hindu. 23 April 2016. Retrieved 2022-02-07.
  8. "The strength my character shows in the face of adversity drew me to Kariya 2". The Times of India. 10 October 2017. Retrieved 2022-02-07.
  9. "Mayuri Kyatari gets married in an intimate ceremony - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-07.

బయటి లింకులు

[మార్చు]