మరికల్ మండలం
మరికల్ మండలం,తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట జిల్లాకు, చెందిన మండలం.[1]
ఇది సమీప పట్టణమైన నారాయణపేట నుండి 31 కి. మీ. దూరంలో జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుండి కర్ణాటక లోని రాయచూరు వెళ్ళు రోడ్డు మార్గంలో ఉంది.
నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]
లోగడ మరికల్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట్ రెవెన్యూ డివిజను పరిధిలోని ధన్వాడ మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా మరికల్ గ్రామాన్ని (1+13) పద్నాలుగు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా మహబూబ్ నగర్ జిల్లా,నారాయణపేట్ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
నారాయణపేట జిల్లాకు మార్పు[మార్చు]
గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలాన్ని 2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నారాయణపేట జిల్లాలోకి చేర్చారు.[2]
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- పూసలపాడ్
- మాధ్వార్
- ఎలిగండ్ల
- పస్పుల
- మరికల్
- ఇబ్రహీంపట్నం
- పెద్దచింతకుంట
- తీలేరు
- వెంకటాపూర్
- రాకొండ
- చిత్తనూర్
- ఎక్లాస్‌పూర్
- జిన్నారం
- కన్మనూర్
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019. CS1 maint: discouraged parameter (link)