Jump to content

మరియాం పెట్రోస్యాన్

వికీపీడియా నుండి
మరియాం పెట్రోస్యాన్
పుట్టిన తేదీ, స్థలం (1969-08-10) 1969 ఆగస్టు 10 (వయసు 55)
యెరెవాన్, ఆర్మేనియా
వృత్తికార్టూనిష్ట్, రచయిత
జాతీయతఆర్మేనియన్
రచనా రంగంమ్యాజిక్ రియలిసమ్
సాహిత్య ఉద్యమంమోడ్రనిష్ట్ లిటరేట్యర్, పోష్ట్-మోడ్రనిష్ట్ లిటరేట్యర్
గుర్తింపునిచ్చిన రచనలుద గ్రే హౌస్ (2007)
ప్రభావంకెన్ కెసే, ఆంటాన్ చెఖోవ్, జె.డి. సలింగర్, ఎడ్గర్ అల్లాన్ పోయ్, జె.ఎం. భర్రీ, థామస్ మయ్నీ రైద్, లెయో తోల్స్టాయ్
పురస్కారాలురష్యన్ బిగ్ బుక్
జీవిత భాగస్వామిఆర్టాసేష్ స్తన్మోల్ట్స్యాన్

మరియాం పెట్రోస్యాన్ (జననం 1969 ఆగస్టు 10) ఒక ఆర్మేనియన్ చిత్రకారురాలు, కార్టూనిస్ట్, రష్యన్-భాష నవలా రచయిత. ఆమె రచించిన ద గ్రే  హౌస్ (2009) ఎన్నో ఆవార్డు దక్కించుకుంది, తరువాత దానిని ఎనిమిది భాషలులోకి అనువాధించారు.

జీవిత చరిత్ర

[మార్చు]

మరియం పెట్రోస్యాన్ 1969లో ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లో జన్మించారు. కళ కళాశాలలోవిద్యాభ్యాసం అయిపోయిన తరువాత ఆమె అర్మెఫిల్మ్ స్టూడియోలో కార్టూనిస్ట్ గా చేరింది. తరువాత ఆమె మాస్కో వెళ్ళి సోయుజ్మల్టిఫిల్మ్ లో పనిచేసినా తిరిగి ఆర్మేనియాకు వచ్చి 1995 నుంచి యెరెవాన్ లో పనిచేసింది. తను 2007 వరకు పనిచేసింది.

ఆమె మొదటి నవల, ద గ్రే హౌస్ (రష్యన్: "Дом, в котором...", సాహిత్యపరంగా: ద హౌస్, ఇన్ విచ్...) వికలాంగ పిల్లలకు చెందిన ఒక బోర్డింగ్ పాఠశాల గురించి చెప్తుంది. ఇది రష్యన్ భాషలో 2009లో ప్రచురించబడింది, ఉత్తమఅమ్మకాలలో ఒకటిగా మారింది. ఇది 2010లో రష్యన్ బుకర్ ప్రైజ్ కు నామినేట్ అయ్యింది, అనేక అవార్డులు, నామినేషన్లు దక్కాయి, వాటిలో విదేశంలో ఉన్న రష్యన్ రాచించిన పుస్తకాలలో రష్యన్ ప్రైజ్ ఆఫ్ ది బెష్ట్ బుక్ అవార్డు వచ్చింది.

ఆ పుస్తకాన్ని ఇటాలియన్ (La casa del tempo sospeso, 2011), హంగేరియన్ (Abban a házban, 2012), పోలిష్ (Dom, w którym..., 2013), స్పానిష్ (La casa de los otros, 2015), ఫ్రెంచ్ (La Maison dans laquelle, 2016), చెక్ (Dům, ve kterém, 2016), మసడోనియన్ (Домот во кој..., 2016) భాషలలోకి అనువధించారు.

ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల ఎడిషను 2017 ఏప్రిల్ 25న అమెరికన్ క్రాసింగ్ నుండి బయటకు వచ్చింది;[1] ఇది 2018లోని రీడ్ రష్యా ప్రైజ్ కు షార్ట్లిష్ట్ చేశారు.[2] పెట్రోస్యాన్ సాహిత్య సంస్థ డానిష్, లాట్వియన్, నార్వేజియన్ అనువాదాల అమ్మక హక్కులను కొన్నట్లు ప్రకటించింది .[3]

ఆ కథను ఛిత్రీకరించింది (ఆంగ్ల అనువాదాన్ని ఆండ్రీవ్ బ్రాంఫీల్డ్[4]) నర్రేషన్ స్టీఫెన్ ఫ్రై ఒక రష్యన్ చలనఛిత్రం ఓపెన్ బుక్: వ్రైటింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ పుతిన్ ను ఛిత్రీకరించారు.[5]

మరియాం పెట్రోస్యాన్ రచించిన మరొక నవల ఒక చిన్న అద్భుత కథ, ద డాగ్ హూ కుడ్ ఫ్లై (రష్యన్: "Сказка про собаку, которая умела летать", 2014).

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మరియం ఆర్మేనియన్ గ్రాఫిక్ కళాకారుడు ఆర్టాసేష్ స్తన్మోల్ట్స్యాన్ ను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె ఒక గొప్ప చిత్రకారుడు మార్టిరోస్ సర్యాన్ కు మనుమరాలు.

సూచనలు

[మార్చు]
  1. Amazon: The Gray House
  2. "2018 Read Russia Prize". Archived from the original on 2018-08-09. Retrieved 2018-06-24.
  3. The House That... at Elkost site.
  4. The House That... Sample translations
  5. Russia's Open Book: Writing in the Age of Putin (excerpt).