Jump to content

మరూరు లక్ష్మీనరసప్ప

వికీపీడియా నుండి
మరూరు లక్ష్మీనరసప్ప
జననంమరూరు లక్ష్మీనరసప్ప
(1882-09-16)1882 సెప్టెంబరు 16
మరూరు, రాప్తాడు మండలం, అనంతపురం జిల్లా
మరణం1956 ఏప్రిల్ 3(1956-04-03) (వయసు: 73)
వృత్తిప్రభుత్వ ఉద్యోగి
ప్రసిద్ధికవి, రచయిత
మతంహిందూ
తండ్రికరణం నరిసింహప్ప
తల్లిలక్ష్మాంబ

మరూరు లక్ష్మీనరసప్ప (1882, సెప్టెంబరు 16 - 1956, ఏప్రిల్ 3)[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత.[2]

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

లక్ష్మీనరసప్ప 1882, సెప్టెంబరు 16అనంతపురం జిల్లా, రాప్తాడు మండలంలోని మరూరు గ్రామంలో జన్మించాడు. తల్లి లక్ష్మాంబ, తండ్రి కరణం నరిసింహప్ప. ఇతని కుటుంబీకులు బ్రాహ్మణ కులంలోని నందవరీక శాఖకు చెందిన శ్రీవత్సస గోత్రజులు.[2]

మేనమామల సహాయంతో మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో పట్టభద్రులయ్యాడు. ఆ తరువాత ఉద్యోగం చేస్తూనే చరిత్రలో ఎం.ఏ. పట్టా పొందాడు. కీ.శే. కట్టమంచి రామలింగారెడ్డి ఇతనికి సహాధ్యాయులు.[2]

ఉద్యోగం

[మార్చు]

లక్ష్మీనరసప్ప మొదట రూ. 41 జీతంతో ప్రభుత్వ ఉద్యోగం ప్రారంభించి, 1937 వరకు డిప్యూటీ కలెక్టరుగా పనిచేశాడు. 1927లో భద్రాచలంలో ఉద్యోగం చేస్తున్న సమయంలో వారికి శ్రీ భద్రాద్రి రాముని కృప కలిగింది.[2]

సాహిత్య ప్రస్థానం

[మార్చు]

లక్ష్మీనరసప్ప తెలుగు భారతాన్ని గద్య రూపంలో రచించాడు. ఇంగ్లీషులో బైబిల్ శైలిపై తనకున్న ప్రత్యేక ఆసక్తితో ఇంగ్లీషులో 'శ్రీకృష్ణ చరిత్రము'ను సులభ శైలిలో రాశాడు. అయితే ఈ రెండు గ్రంథాలూ అచ్చుకాలేదు. భద్రాచల శ్రీరాములవారి ప్రేరణతో రామాయణ గాథను సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సులభ శైలిలో తేటగీతాలతో రాయాలని సంకల్పించి 'సులభ రామాయణము'ను 5365 గీతాలతో పూర్తి చేశాడు.[3]

మరణం

[మార్చు]

లక్ష్మీనరసప్ప 1956, ఏప్రిల్ 3న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. రాయలసీమ రచయితల చరిత్ర రెండవసంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
  2. 2.0 2.1 2.2 2.3 కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
  3. కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).

ఇతర లింకులు

[మార్చు]