మర్దానీ 3
| మర్దానీ 3 | |
|---|---|
థియేట్రికల్ విడుదల పోస్టర్ | |
| దర్శకత్వం | అభిరాజ్ మినవాలా |
| రచన | ఆయుష్ గుప్తా |
| కథ |
|
| నిర్మాత | ఆదిత్య చోప్రా |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | ఆర్థర్ జురావ్స్కీ |
| కూర్పు | యాష రామచందాని |
| సంగీతం | పాటలు: సార్థక్ కల్యాణి నేపథ్య సంగీతం: జాన్ స్టీవర్ట్ ఎదురి |
నిర్మాణ సంస్థ | యష్ రాజ్ ఫిల్మ్స్ |
| పంపిణీదార్లు | యష్ రాజ్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 2026 జనవరి 30 |
సినిమా నిడివి | 129 నిమిషాలు[1] |
| దేశం | భారతదేశం |
| భాష | హిందీ |
| బడ్జెట్ | ₹60 కోట్లు[2] |
| బాక్సాఫీసు | సుమారు ₹32.95 కోట్లు[3] |
మర్దానీ 3 అనేది అభిరాజ్ మినవాలా దర్శకత్వంలో, యష్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన 2026 నాటి భారతీయ హిందీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఇది 2019 నాటి మర్దానీ 2 చిత్రానికి సీక్వెల్, మర్దానీ చిత్ర పరంపరలో మూడవ భాగం. ఇందులో రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించగా, జాంకీ బోడివాలా, మల్లిక ప్రసాద్ ఇతర పాత్రలు పోషించారు. కేవలం మూడు నెలల వ్యవధిలో రహస్య పరిస్థితుల మధ్య అదృశ్యమైన 93 మంది యువతుల కేసును పోలీసు అధికారిణి శివాని శివాజీ రాయ్ ఎలా దర్యాప్తు చేసిందనేది ఈ చిత్ర కథాంశం.
మర్దానీ 3 చిత్రం 2026 జనవరి 30న థియేటర్లలో విడుదలై, విమర్శకుల నుండి మిశ్రమ సానుకూల స్పందన పొందింది.[4]
కథ
[మార్చు]బులంద్‌షహర్ లో భారత రాయబారి సాహు చిన్న కుమార్తె రుహాని, పనిమనిషి కుమార్తె జిమ్లీతో కలిసి దాగుడుమూతలు ఆడుతుండగా కిడ్నాప్ అవుతారు. జిమ్లీ వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆమెను కూడా అపహరిస్తారు. మరోవైపు సుందరబన్ ప్రాంతంలో మహిళలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠా ఆటను ఎస్ఎస్పీ శివాని శివాజీ రాయ్ కట్టిస్తుంది. ఆమె పనితీరుకు ముగ్ధుడైన సాహు, రుహాని అదృశ్యంపై దర్యాప్తుకు నాయకత్వం వహించాలని శివానిని కోరుతూ ₹2 కోట్ల రివార్డును ప్రకటిస్తాడు.
కిడ్నాపర్లు మొదట ఆ బాలికలను బిచ్చగాళ్ల మాఫియా నెట్‌వర్క్ నాయకురాలు అమ్మకు అప్పగిస్తారు, కానీ తర్వాత నేరుగా డబ్బు వసూలు చేయడానికి రుహానిని తిరిగి స్వాధీనం చేసుకుంటారు. పోలీసులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ నేరస్థులు తప్పించుకుంటారు. శివాని దర్యాప్తులో గత మూడు నెలల్లో పేద కుటుంబాలకు చెందిన ఎనిమిది నుండి తొమ్మిదేళ్ల వయస్సు గల 93 మంది బాలికలు అదృశ్యమైనట్లు తెలుస్తుంది. రుహానిని పొరపాటున పేద పిల్లనుకొని కిడ్నాప్ చేశారని శివాని అనుమానిస్తుంది.
దర్యాప్తులో భాగంగా శివాని రామానుజన్ నడుపుతున్న త్రేతా ట్రస్ట్ అనే సంస్థను చేరుకుంటుంది. దాడుల సమయంలో కిడ్నాపర్లు చనిపోగా, రుహానిని రక్షించడానికి వెళ్లిన రామానుజన్ ఆమెను చంపేస్తాడు. అతను అమ్మ తరపున పనిచేసే పోలీసు ఇన్ఫార్మర్ అని వెల్లడవుతుంది. జిమ్లీని రక్షిస్తానని శివాని ప్రతిజ్ఞ చేస్తుంది. ఆధారాల కొరత కారణంగా శివాని సస్పెండ్ అయినప్పటికీ, ఆమె రహస్యంగా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఆ బాలికలను గర్భాశయ క్యాన్సర్ మందుల ప్రయోగాల కోసం పరీక్షా వస్తువులుగా వాడుతున్నారని ఆమె గుర్తిస్తుంది. చివరకు కొలంబో లో అమ్మను పట్టుకుని, రామానుజన్ ముఠా ఆట కట్టించి బాలికలను ఎలా రక్షించిందనేది మిగిలిన కథ.
నటీనటులు
[మార్చు]- రాణి ముఖర్జీ - శివాని శివాజీ రాయ్ ఐపీఎస్
- జాంకీ బోడివాలా - కానిస్టేబుల్ ఫాతిమా అన్వర్
- మల్లిక ప్రసాద్ - అమ్మ
- జిస్సు సేన్‌గుప్తా - డాక్టర్ విక్రమ్ రాయ్ (శివాని భర్త)
- నవేద్ అస్లాం - హోమ్ సెక్రటరీ
- మిఖాయిల్ యావల్కర్ - ఇన్‌స్పెక్టర్ బలవిందర్ సింగ్ సోధి
నిర్మాణం
[మార్చు]యష్ రాజ్ ఫిల్మ్స్ 2024 డిసెంబర్ 13న ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది.[5] మల్లిక ప్రసాద్ ఈ ఫ్రాంచైజీలో మొదటి మహిళా విలన్‌గా ఎంపికయ్యారు.[6] చిత్రీకరణ ప్రధానంగా ఢిల్లీ, ముంబై, కొలంబోలలో జరిగింది.
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|---|
| 1. | "బబ్బర్ షేర్ని" | శ్రుతి శుక్లా | సార్థక్ కల్యాణి | సార్థక్ కల్యాణి, డీ ఎంసీ | 3:11 |
| మొత్తం నిడివి: | 3:11 | ||||
మూలాలు
[మార్చు]- ↑ "Mardaani 3". British Board of Film Classification. 1 February 2026. Retrieved 20 January 2026.
- ↑ "'Mardaani 3' box office collection Day 4: Rani Mukerji's cop drama FAILS to impress audience; earns just Rs 2.15 crore". Times of India. 4 February 2026. Retrieved 4 February 2026.
- ↑ "Mardaani 3 Box Office Collection". Bollywood Hungama. 30 January 2026. Retrieved 30 January 2026.
- ↑ "Mardaani 3 Review: Rani Mukerji And Mallika Prasad Shine In A Sharp Crime Thriller". NDTV (in ఇంగ్లీష్). Retrieved 2026-02-04.
- ↑ "Mardaani 3: Rani Mukerji returns as supercop Shivani Shivaji Roy". Hindustan Times. 13 December 2024. Retrieved 25 January 2026.
- ↑ "Who is Mallika Prasad, the RUTHLESS villain 'Amma' in Rani Mukerji's 'Mardaani 3'?". The Times of India. 12 January 2026. Retrieved 12 January 2026.