మర్రిగూడెం (త్రిపురారం మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మర్రిగూడెం , నల్గొండ జిల్లా, త్రిపురారం మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 508207.

ఇది బెజ్జికల్ ప్రక్కన ఉంది. ఈ ఊరిలో ఒకప్పుడు చాల మర్రిచెట్లు ఉండేవి, అందుకే దీనికి మర్రిగూడెం అని పేరు వచ్చింది. గ్రామంలో ఎక్కువగా యాదవ, పెరిక, వడ్డెర, చాకలి, కమ్మరి కులాల వారు మరియు ఒక మంగలి, కోమటి, బ్ర్రాహ్మణ ఇండ్లు ఉన్నాయి.వివాహ సమయాలలో యాదవులు ప్రత్యేకంగా "వీరుడు" అని ఊరేగింపు జరుపుతారు,ఆ వేడుక చూడ ముచ్చటగా ఉంటుంది.మా ఊరిలో రామాలయం మరియు ప్రాచీన మైన ఆంజనేయ స్వామి దేవాలయాలు, ముత్యాలమ్మ ఆలయం, ఊరి మధ్యలో నాభిశిల మరియు ఒక ప్రాథమిక పాఠశాల ఉన్నాయి. ఆంజనేయాలయం ప్రాచీనమైనది. ఈ ఊరికి నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీరు వస్తుంది. అందువలన ఈ ఊరిలో వరి ఎక్కువగా పండుతుంది. పశుసంపద కూడా ఎక్కువగానే ఉంది. సాగునీటి కొరకు కాలువ నీటిపైనే కాకుండా బోరు బావులు కూడా ఉన్నాయి. నీరు సరిగా అందనపుడు ఆరు తడి పంటలు పండిస్తారు. ఈ ఊరిలో విద్యాధికులు ఎక్కువగా ఉన్నారు. వ్యవసాయం పనులే కాక ఇతర పనుల నిమిత్తం ఇతర గ్రామాలకు, హైదరాబాదు వంటి పట్టణాలకు కుడా వెళ్తుంటారు. ఈ ఊరికి బస్సు సదుపాయం ఒకప్పుడు ఉండేది, ప్రస్తుతం ఆటోలు ప్రయాణ సదుపాయం కల్గిస్తున్నవి.ప్రస్తుతం రోడ్డు సదుపాయాన్ని కూడా మెరుగు పరిచారు.మా ఊరి మీదుగా పలుగు మరియు చెన్నాయపాలెంను కలుపుతూ రొడ్డు నిర్మించబడింది.పంటలు పండే సమయంలో మా గ్రామం ఎటుచూసిన పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటుంది.

చుట్టుప్రక్కల మండలాలు[మార్చు]

మిర్యాలగూడ మండలము తూర్పు వైపున, నిడమనూరు మండలం పడమర వైపున, వేములపల్లి మండలం ఉత్తర దిక్కున, అనుమల మండలము పడమర దిశలో ఉన్నాయి. మిర్యాలగూడ, సూర్యాపేట, మాచెర్ల, కోదాడ మున్నగు పట్టణాలు ఈ గ్రామానికి సమీపములో ఉన్నాయి.

ప్రయాణ సౌకర్యములు[మార్చు]

ఈ గ్రామానికి సమీపములో వున్న గ్రామము,రైల్వే స్టేషను మిర్యాలగూడ. ఇక్కడి నుండి పరిసర గ్రామాలకు రోడ్డు వసతి కలిగి బస్సుల సౌకర్యము ఉంది. మిర్యాల గూడలో రైల్వే స్టేషను ఉంది. ఇక్కడి నుండి ఇతర సుదూర ప్రాంతాలకు రైలు రవాణ వసతి ఉంది. గుంటూరు రైల్వే జంక్షను ఇక్కడికి 133 కి.మీ దూరములో ఉంది.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]