మలక్‌పేట, హైదరాబాదు
మలక్‌పేట | |
---|---|
పాతబస్తీ | |
![]() | |
నిర్దేశాంకాలు: 17°22′N 78°30′E / 17.367°N 78.500°ECoordinates: 17°22′N 78°30′E / 17.367°N 78.500°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
ప్రభుత్వం | |
• నిర్వహణ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 500 036 |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | టిఎస్-11 |
లోకసభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | మలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
జాలస్థలి | telangana |
మలక్‌పేట్ (Malakpet) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్ షా సేవకుడైన మాలిక్ యాకుబ్ పేరుమీదుగా ఈ ప్రాంతానికి మలక్‌పేట అని పేరు వచ్చింది. ఇది పాత మలక్‌పేట, కొత్త మలక్‌పేట అని రెండు భాగాలుగా ఉంది.
స్థానం[మార్చు]
మలక్‌పేట ఉత్తర దిక్కులో అంబర్‌పేట, ముసరాంబాగ్, తూర్పు దిక్కులో దిల్‌సుఖ్‌నగర్, పడమర దిక్కులో చాదర్‌ఘాట్, దక్షిణ దిక్కులో సైదాబాద్ ఉన్నాయి.
చారిత్రక విశేషాలు[మార్చు]
చారిత్రాత్మకమైన రేమండ్స్ స్తూపం ఇక్కడ ఒక కొండపైన నిర్మించబడింది. 1902వ సంవత్సరంలో మహబూబ్ అలీ ఖాన్ కాలంలో మహబూబ్ మాన్షన్ అనే రాజభవనం నిర్మించబడింది.[1]
వ్యాపారం[మార్చు]
ఈ నామ్ మార్కెటింగ్‌లో మలక్‌పేట వ్యవసాయ మార్కెట్ దేశ మార్కెట్లకే ఆదర్శంగా నిలిచింది.[2]
ఆసుపత్రులు[మార్చు]
మలక్‌పేటలో సౌకర్యవంతమైన అనేక మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి.
- ఎం.ఎన్. ఏరియా ఆసుపత్రి
- సుషుత్ర ఆసుపత్రి
- బీబీ క్యాన్సర్ ఆసుపత్రి
- వీనస్ ఆసుపత్రి
- న్యూ లైఫ్ ఆసుపత్రి
- యశోదా ఆసుపత్రి
- హెగ్డే ఆసుపత్రి
- ఫర్హాత్ ఆసుపత్రి
వనాలు[మార్చు]
ఇక్కడ తాళజాతి మొక్కల వనము ఉంది. దీనిని 2002 సంవత్సరంలో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ప్రారంభించింది.
రవాణా[మార్చు]
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి మలక్‌పేటకు సిటీ బస్సు సర్వీసులు నడుపబడుతున్నాయి. ఇక్కడ మలక్‌పేట రైల్వే స్టేషను, మలక్‌పేట మెట్రో స్టేషను కూడా ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ Rohit P S. "A mansion goen to the dogs". Times of India. Retrieved 28 January 2019.
- ↑ నమస్తే తెలంగాణ, జిందగీ (15 April 2018). "మలక్‌పేట..దేశ మార్కెట్లకే ఆదర్శం". Retrieved 11 July 2018.